Zodiac Signs: అనుకూల స్థితిలో చంద్రుడు.. ఆ రాశుల వారి కలలు సాకారం పక్కా..!
ఈ నెల 12వ తేదీ నుంచి 16వ తేదీ వరకు నాలుగు రోజుల పాటు ఆరు రాశుల వారికి చంద్రుడు బాగా అనుకూల సంచారం చేయబోతున్నాడు. ఈ నెల 12, 13, 14 తేదీల్లో మేష రాశిలోని గురువు కలవడం వల్ల గజకేసరి యోగం ఏర్పడుతోంది. పైగా గురువును కలవడం వల్ల చంద్రుడికి ఉచ్ఛ స్థితి కలుగుతుంది. కాగా 15, 16 తేదీల్లో చంద్రుడు తనకు ఉచ్ఛ రాశి అయిన వృషభ రాశిలో సంచారం చేస్తున్నాడు.

ఈ నెల 12వ తేదీ నుంచి 16వ తేదీ వరకు నాలుగు రోజుల పాటు ఆరు రాశుల వారికి చంద్రుడు బాగా అనుకూల సంచారం చేయబోతున్నాడు. ఈ నెల 12, 13, 14 తేదీల్లో మేష రాశిలోని గురువు కలవడం వల్ల గజకేసరి యోగం ఏర్పడుతోంది. పైగా గురువును కలవడం వల్ల చంద్రుడికి ఉచ్ఛ స్థితి కలుగుతుంది. కాగా 15, 16 తేదీల్లో చంద్రుడు తనకు ఉచ్ఛ రాశి అయిన వృషభ రాశిలో సంచారం చేస్తున్నాడు. దీని వల్ల మొత్తం మీద మేషం, మిధునం, కర్కాటకం, కన్య, వృశ్చికం, మకర రాశుల వారికి మనసులోని కోరికల్లో ముఖ్యమైనవి తప్పకుండా నెరవేరుతాయి. ఈ రాశుల వారు తమ భవిష్యత్తుకు, ఆర్థికాభివృద్ధికి, కొత్త కార్యక్రమాలకు సంబంధించి నిర్ణయాలు తీసుకోవడానికి, కొన్ని ముఖ్యమైన పనులు ప్రారంభించిడానికి ఇది చాలా మంచి సమయం. ఈ రాశుల వారు ఎంత సానుకూల దృక్పథంతో వ్యవహరిస్తే అంత మంచిది.
- మేషం: ఈ రాశిలో చంద్ర, గురువులు కలసినప్పుడు గజకేసరి యోగం ఏర్పడుతుంది. ఆ తర్వాత ధన స్థానంలో చంద్రుడు ఉచ్ఛపట్టడం వల్ల సంపద బాగా పెరుగుతుంది. అంతేకాక, ఈ రాశివారు ఈ నాలుగు రోజులు ఏ పని తలపడితే ఆ పని విజయవంతంగా పూర్తవుతుంది. ఆర్థిక పరిస్థితి బాగా మెరుగ్గా ఉంటుంది. రావలసిన డబ్బు చేతికి అందుతుంది. అప్రయత్న ధన లాభం ఉంటుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో జీతభత్యాలు, రాబడి బాగా పెరుగుతాయి. మాటకు విలువ ఉంటుంది.
- మిథునం: ఈ రాశికి ధనాధిపతి అయిన చంద్రుడితో లాభ స్థానంలో గజకేసరి యోగం ఏర్పడడం, ఆ తర్వాత చంద్రుడు ఉచ్ఛ పట్టడం వల్ల సంపద బాగా వృద్ధి చెందుతుంది. సంపదనిచ్చే అవకాశాలు కూడా వృద్ధి చెందుతాయి. మాటకు, చేతకు విలువ పెరుగుతుంది. లాభదాయకమైన పరిచయాలు పెరు గుతాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో ప్రాభవం పెరగడంతో పాటు ఆదాయం కూడా బాగా పెరిగే అవకాశం ఉంది. ఇంట్లో శుభకార్యాలకు మార్గం సుగమం అవుతుంది. ఆరోగ్యం మెరుగవుతుంది.
- కర్కాటకం: ఈ రాశివారికి రాశ్యధిపతి అయిన చంద్రుడు నాలుగు రోజుల పాటు బాగా అనుకూలంగా ఉండ డంతో పాటు, ఉచ్ఛ బలంతో సంచారం చేస్తున్నందువల్ల ఆకస్మిక ధన లాభానికి బాగా అవకాశం ఉంది. తప్పకుండా బ్యాంక్ బ్యాలెన్స్ పెరుగుతుంది. వ్యక్తిగత, కుటుంబ సమస్యలకు పరిష్కారం అభిస్తుంది. మనసులోని కోరికలు నెరవేరుతాయి. భవిష్యత్తుకు సంబంధించి ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నా విజయవంతం అవుతాయి. రాజకీయ ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి.
- కన్య: ఈ రాశికి భాగ్య స్థానంలో చంద్రుడు అనుకూల సంచారం చేస్తుండడం వల్ల ఆశించిన శుభ వార్తలు అందడానికి, కొన్ని శుభ పరిణామాలు చోటు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. విదేశీయానా నికి, విదేశాల్లో స్థిరపడడానికి, విదేశీ ధనం సంపాదించడానికి బాగా అవకాశం ఉంది. తండ్రి వైపు నుంచి ఆస్తిపాస్తులకు సంబంధించిన శుభవార్తలు వినడం జరుగుతుంది. ఇష్టమైన ప్రదేశాలను, పుణ్య క్షేత్రాలను సందర్శించడం జరుగుతుంది. వృత్తి, ఉద్యోగాల్లో ఊహించని పురోగతి ఉంటుంది.
- వృశ్చికం: భాగ్యాధిపతిగా చంద్రుడు ఈ రాశివారికి బాగా అనుకూలంగా ఉండడం వల్ల శుభ వార్తలు ఎక్కు వగా వినడం జరుగుతుంది. మనసులోని కోరికలు నెరవేరుతాయి. గృహ, వాహన సంబంధమైన సౌకర్యాలు కలగడానికి మార్గం సుగమం అవుతుంది. వ్యక్తిగత, కుటుంబ సమస్యలు చాలావరకు తగ్గిపోతాయి. భవిష్యత్తుకు సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకుంటారు. తండ్రి నుంచి ఆశించిన సంపద లభిస్తుంది. దీర్ఘకాలిక అనారోగ్యం నుంచి సైతం ఊరట లభిస్తుంది. ఆర్థిక స్థిరత్వం లభిస్తుంది.
- మకరం: ఈ రాశికి చంద్రుడి సంచారం బాగా అనుకూలంగా ఉన్నందువల్ల తప్పకుండా ఉద్యోగ స్థిరత్వం, ఆర్థిక స్థిరత్వం లభిస్తాయి. వృత్తి , ఉద్యోగ, వ్యాపారాల్లో రాబడి బాగా పెరుగుతుంది. ఇంట్లో సౌకర్యా లను మెరుగుపరచుకోవడం, కొత్త సౌకర్యాలను ఏర్పరచుకోవడం వంటివి జరుగుతాయి. బ్యాంక్ బ్యాలెన్స్ బాగా పెరుగుతుంది. ప్రతిభా పాటవాలకు మంచి గుర్తింపు లభిస్తుంది. అదనపు ఆదాయ ప్రయత్నాలు సత్ఫలితాలనిస్తాయి. ప్రముఖులతో మంచి పరిచయాలు ఏర్పడతాయి.



