Horoscope: ఈ రాశివారికి ఈ నెలలో పట్టిందల్లా బంగారమే.. వీరికి వ్యాపారంలో ఇబ్బందులు తప్పవు.. డిసెంబర్ నెల మీకెలా ఉంటుందో..

Horoscope: ఈ రాశివారికి ఈ నెలలో పట్టిందల్లా బంగారమే.. వీరికి వ్యాపారంలో ఇబ్బందులు తప్పవు.. డిసెంబర్ నెల మీకెలా ఉంటుందో..

December Horoscope: నెలవారీ జాతకం అనేది వారపు రాశిఫలాల వివరణాత్మక సంకలనం. వివిధ గ్రహాల స్థానాలు..వాటి పరిశీలనలను బట్టి జాతకాలు అలాగే అదృష్టాలను పండితులు లెక్కిస్తారు. ఇక డిసెంబర్ నెలలో ఏ రాశివారికి ఎటువంటి అదృష్టం ఉందొ ఇక్కడ తెలుసుకుందాం

KVD Varma

|

Dec 01, 2021 | 6:10 PM

December Horoscope: నెలవారీ జాతకం అనేది వారపు రాశిఫలాల వివరణాత్మక సంకలనం. వివిధ గ్రహాల స్థానాలు..వాటి పరిశీలనలను బట్టి జాతకాలు అలాగే అదృష్టాలను పండితులు లెక్కిస్తారు. ప్రతి రాశికి గ్రహాలు, నక్షత్రాల స్థానం భిన్నంగా ఉంటుంది. కాబట్టి ఇది ఒక్కో రాశికి భిన్నంగా ఉంటుంది. ఇక డిసెంబర్ నెలలో ఏ రాశివారికి ఎటువంటి అదృష్టం ఉందొ.. ఆరోగ్య పరిస్థితి.. కుటుంబ స్థితిగతులు.. ఇలా అన్ని అంశాలను సంక్షిప్తంగా నిపుణులు చెప్పిన విధంగా ఇక్కడ అందిస్తున్నాం. మరింకెందుకు ఆలస్యం.. మీ రాశి మీకోసం డిసెంబర్ లో ఏమి దాచి వుంచిందో తెలుసుకోండి..

మేషం

మేషరాశిలో జన్మించిన వారు ఈ నెలలో తమ కెరీర్‌లో మంచి అవకాశాలను పొందగలుగుతారు. ఆర్థికంగా, మేషరాశి వారికి డిసెంబర్ శుభప్రదం. డబ్బు సంపాదించడానికి చాలా అవకాశాలు ఉంటాయి. డిసెంబరు నెలలో ఆరోగ్య పరంగా కాస్త ఒడిదుడుకులు ఉంటాయి.

వృషభం

కొన్ని చెడు పరిస్థితులు ఎదురైనా డబ్బు వస్తుంది. వ్యాపారంలో కొంత మార్పు వచ్చే అవకాశం ఉంది. మీరు కుటుంబ మద్దతు, తల్లిదండ్రుల ఆశీర్వాదం పొందుతారు. పోటీ పరీక్షలో ఉత్తీర్ణత సాధించడానికి చాలా అధ్యయనం అదేవిధంగా అదనపు మార్గదర్శకత్వం అవసరం.

మిథునం

కుటుంబ అశాంతి పిల్లలపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. మిధున రాశి వారికి ఆరోగ్యం బాగా ఉండదు. అవివాహితులు సంతోషకరమైన సంబంధంలోకి ప్రవేశించడంలో విజయం సాధిస్తారు. వృత్తిపరమైన వృద్ధి ఈ రాశివారికి అద్భుతంగా ఉంటుంది.

కర్కాటకం

డిసెంబర్ నెల కర్కాటక రాశి వారికి అనుకూలమైన కెరీర్ ఫలితాలను ఇస్తుంది. వైవాహిక బంధం దృఢంగా ఉంటుంది. ఆరోగ్యం బాగుంటుంది. కానీ మీ తోబుట్టువులు, కుటుంబ సభ్యులతో సంబంధాలు చాలా బలహీనంగా ఉంటాయి. వ్యాపారం దెబ్బతినవచ్చు. తగిన జాగ్రత్తలు తీసుకోండి.

సింహం

డిసెంబరు నెల కుటుంబ విషయాలకు చాలా ఉత్సాహంగా ఉంటుంది. ఆర్థికంగా, ఈ నెల మీకు అనుకూలంగా ఉంటుంది, ఇంటిలోని అందరు సభ్యులకు మంచి రోజులు ఉంటాయి.అన్నిటా అనుకూలమైన నెల డిసెంబర్. ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న కొత్త ప్రాజెక్ట్ నెలాఖరులో వచ్చే అవకాశం ఉంది.

కన్య

గ్రహాలు అనుకూలం కావు. ఇది కుటుంబ సభ్యుల మధ్య విడిపోవడానికి దారితీసే అవకాశం ఉంది. ఆర్థిక పరిస్థితిలో కూడా సమస్యలు ఉంటాయి. కానీ, ఈ నెలలో మీరు మీ అప్పుల్లో దేనినైనా తీర్చే అవకాశం ఉంది. కెరీర్ పరంగా ఈ నెల ప్రత్యేకంగా అనుకూలంగా ఉంటుంది.

తుల

మీరు మీ శత్రువులను సులభంగా ఓడించగలరు. ఈ నెల వృత్తి, పనికి అనుకూలంగా ఉంటుంది. మీరు మీ ప్రయత్నాల ద్వారా నెలాఖరులో చాలా డబ్బు సంపాదించగలరు. ఒకరకంగా మీరు పట్టిందల్లా బంగారం అన్నట్టు ఉంటుంది. మీ ఆదాయాన్ని పెంచుకోగలరు. ఈ మాసం తులారాశి వారికి ఆరోగ్యం పరంగా బాగానే ఉంటుంది.

వృశ్చికం

మీరు ఉన్నత స్థానాన్ని సాధించగలరు. కానీ మీ ఓపిక లేమి దానిని ప్రభావితం చేస్తుంది. ఓపికగా ఉండటం చాలా ముఖ్యం. అధికారిక పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు డిసెంబర్ నెల అనుకూలంగా ఉంటుంది. ఆదాయం పెరిగే అవకాశం కూడా ఉంది. మీరు మానసిక క్షోభను అనుభవించవచ్చు.

ధనుస్సు

కార్యరంగంలో అభివృద్ధికి అవకాశాలు ఉంటాయి. మీరు కొత్త ఉద్యోగం కూడా పొందవచ్చు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. మీ ఆదాయాన్ని పెరుగుతుంది. దానితో పాటు మీ ఖర్చులు కూడా పెరుగుతూనే ఉంటాయి. స్వల్ప ఆరోగ్య సమస్యలు ఉంటాయి. కుటుంబం, స్నేహితులతో నాణ్యమైన సమయాన్ని గడపండి.

మకరం

మీరు మీ ఆరోగ్యంపై దృష్టి పెట్టాలి. ముఖ్యంగా పొట్టకు సంబంధించిన ప్రతి సమస్య పట్ల జాగ్రత్తగా ఉండాలి. మీరు అధికారిక పరీక్షకు సిద్ధమైతే, మీరు ఈ నెలలో విజయం సాధిస్తారు. కుటుంబంలో ఏదైనా శుభకార్యం జరగవచ్చు.

కుంభం

కుంభ రాశి వారు ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. మీ పనికి మీకు ప్రశంసలు లభిస్తాయి. కానీ, పని పట్ల అజాగ్రత్తగా ఉండకండి. డిసెంబరు నెలలో కుంభ రాశి వారికి అనేక విధాలుగా ముఖ్యమైనది. ధార్మిక, ఆధ్యాత్మిక రంగాలలో ఆసక్తి పెరుగుతుంది.

మీనం

మీన రాశి వారికి ఈ నెల ఆర్థికంగా సాధారణంగా బాగుంటుంది. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. ముఖ్యంగా, మీరు కీళ్ళు, మోకాలు, కడుపు సమస్యలను ఎదుర్కొంటారు. మీకు తమ్ముళ్ల నుంచి అన్ని రకాలుగా పూర్తి మద్దతు లభిస్తుంది.

గమనిక: ఇక్కడ ఇచ్చిన రాశిఫలాలు పంచాంగం..జాతక చక్రాలను అనుసరించి పండితులు చెప్పిన విషయాల ఆధారంగా సంకలనం చేసినవి. ఇవి పూర్తిగా ఆయా వ్యక్తుల ఆసక్తి కోసం ఇక్కడ ఇవ్వడం జరుగుతోంది. ఇవి నమ్మకం మీద ఆధారపడిన విషయాలు కాబట్టి వీటికి ఎటువంటి బాధ్యత టీవీ9 తీసుకోదని గమనించాలి. మీ రాశిఫలాల విషయంలో మీ అనుమానాలు మీ పండితుల ద్వారా తీర్చుకునే ప్రయత్నం చేయమని సూచన.

ఇవి కూడా చదవండి: Afghanistan Crisis: ఆఫ్ఘనిస్తాన్ ఆకలితో పాకిస్తాన్ వ్యాపారం.. భారత్ చేస్తున్న సహాయాన్ని తనదిగా చెప్పుకునే ప్రయాస!

Omicron Spread: వేగంగా వ్యాపిస్తోన్న ఒమిక్రాన్ వేరియంట్..మరో రెండు దేశాల్లో కలకలం..ఒమిక్రాన్ లేటెస్ట్‌ అప్‌డేట్స్

GST Collections: జీఎస్టీ వసూళ్లు అదిరిపోయాయి.. నవంబర్ నెలలో టాక్సుల రూపేణా ఎంత వచ్చిందంటే..

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu