Dhana Yoga: గురు, కుజుల వక్రగతి.. ఆ రాశుల వారికి ధన యోగాలు పక్కా..!
Guru Kuja Vakti: జ్యోతిష శాస్త్రంలో గ్రహాల వక్రగతికి ప్రత్యేకత ఉంది. గ్రహాల వక్రకతి కొన్ని ప్రత్యేక ఫలితాలను తీసుకొస్తాయి. ఒకరి జీవితంలో ఆకస్మిక మార్పులను, ఊహించని శుభ పరిణామాలను తీసుకువస్తాయి. అనుకోకుండా శుభ ఫలితాలు కలుగుతాయి. ఫిబ్రవరి 5వ తేదీ వరకు వృషభంలో గురువు, ఫిబ్రవరి 26 వరకు మిథునంలో కుజుడు వక్ర సంచారం చేయడం జరుగుతోంది.

ఆ గదిని వెంటిలేషన్ లేకుండా 22 రోజులు చీకటిలోనే ఉంచాలి. గది ఉష్ణోగ్రత సుమారు 28 డిగ్రీలు ఉండాలి. 22 రోజుల తర్వాత బ్యాగులను మరో గదికి తరలించాలి. అన్ని బ్యాగులను వేలాడదీయాలి. ఇలా మీరు పుట్టగొడుగుల సాగు చేయవచ్చు.
Money Astrology 2025: జ్యోతిషశాస్త్రంలో గ్రహాల వక్రగతికి ప్రత్యేక ఫలితాలు ఉన్నాయి. సాధారణంగా వక్ర గ్రహాలు ఆకస్మిక మార్పులను, ఊహించని శుభ పరిణామాలను తీసుకు వస్తాయి. అనుకోకుండా శుభ ఫలితాలు కలుగుతాయి. ఫిబ్రవరి 5వ తేదీ వరకు వృషభంలో గురువు, ఫిబ్రవరి 26 వరకు మిథునంలో కుజుడు వక్ర సంచారం చేయడం జరుగుతోంది. ఈ రెండూ మిత్ర గ్రహాలు. వీటివల్ల కొన్ని రాశులకు తప్పకుండా జీవితంలో సానుకూల మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది. ఫిబ్రవరి నెలంతా వీటి శుభ ఫలితాలు కొనసాగుతాయి. మేషం, వృషభం, సింహం, కన్య, మకరం, కుంభ రాశులకు వీటి వల్ల బాగా మేలు జరుగుతుంది.
- మేషం: ఈ రాశివారికి ధన స్థానంలో గురువు, తృతీయ స్థానంలో రాశ్యధిపతి కుజుడు వక్రించడం జరి గింది. ఈ గ్రహాల వక్రగతి వల్ల వృత్తి, ఉద్యోగాల్లో ఆకస్మిక శుభ పరిణామాలు చోటు చేసుకుం టాయి. ఊహించని విధంగా ఉన్నత పదవులకు వెళ్లే అవకాశం ఉంది. ఇష్టమైన ప్రాంతానికి బదిలీ అయ్యే అవకాశం కూడా ఉంది. ఆకస్మిక ధన ప్రాప్తి కలుగుతుంది. ఆస్తి వివాదాలు అనుకూలంగా పరిష్కారమై భూ లాభాలు కలుగుతాయి. వ్యక్తిగత సమస్యలు చాలావరకు పరిష్కారం అవుతాయి.
- వృషభం: ఈ గ్రహాల వక్రగతి ఈ రాశివారికి ధన యోగాలు కలగజేస్తుంది. ఆదాయ ప్రయత్నాలన్నీ సఫలం అవుతాయి. ఆర్థిక పరిస్థితి పూర్తిగా మారిపోతుంది. ఉద్యోగ ప్రయత్నాలు, పెళ్లి ప్రయత్నాలు శీఘ్ర గతిన సఫలమవుతాయి. వృత్తి, ఉద్యోగాల్లో అందలాలు ఎక్కుతారు. ఇంటా బయటా దూసుకు పోతారు. సరికొత్త ఆలోచనలతో వ్యాపారాలను బాగా అభివృద్ధి చేస్తారు. కుటుంబ జీవితంలో సమ స్యలు పరిష్కారమై, హ్యాపీగా సాగిపోతుంది. గృ’హ, వాహన ప్రయత్నాలు తప్పకుండా ఫలిస్తాయి.
- సింహం: ఈ రాశివారికి దశమ స్థానంలో గురువు, లాభ స్థానంలో కుజుడు వక్రించిన కారణంగా ఉద్యోగ జీవి తంలో తప్పకుండా కీలకమైన శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఉద్యోగులకు, నిరుద్యో గులకు విదేశాల నుంచి కూడా ఆఫర్లు అందుతాయి. ఉద్యోగంలో ఊహించని పదోన్నతులు లభి స్తాయి. వృత్తి, వ్యాపారాలు కష్టనష్టాల నుంచి బయటపడి అభివృద్ధి బాట పడతాయి. రాజకీయ ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. సంపన్న కుటుంబంలో పెళ్లి సంబంధం కుదురుతుంది.
- కన్య: భాగ్య స్థానంలో గురువు, దశమ స్థానంలో కుజుడు వక్రీకరించడం వల్ల ఈ రాశివారు ఐశ్వర్యవంతు లయ్యే అవకాశం ఉంది. ఉద్యోగపరంగా ఊహించని అవకాశాలు లభిస్తాయి. ఆదాయం అనేక మార్గాల్లో ఇబ్బడిముబ్బడిగా వృద్ధి చెందే అవకాశం ఉంది. నిరుద్యోగులకు అరుదైన ఆఫర్లు అందుతాయి. ఉద్యోగంలో పదోన్నతితో పాటు జీత భత్యాలు పెరిగే అవకాశం ఉంది. మరింత మంచి ఉద్యో గంలోకి మారడానికి కూడా అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాల్లో లాభాలు అంచనాల్ని మించుతాయి.
- మకరం: ఈ రాశికి పంచమ స్థానంలో గురువు, షష్ట స్థానంలో కుజుడు వక్రించడం అత్యంత శుభదాయకం. అనేక విధాలుగా ధన యోగాలు కలుగుతాయి. ఆర్థిక సమస్యల నుంచి, ఆరోగ్య సమస్యల నుంచి త్వరగా బయటపడతారు. ఆస్తి వివాదాలు అనుకూలంగా పరిష్కారమవుతాయి. ఆదాయం అనేక విధాలుగా వృద్ధి చెందుతుంది. కుటుంబంలో ఊహించని శుభ పరిణామాలు చోటు చేసుకుం టాయి. ప్రముఖులతో పరిచయాలు విస్తరిస్తాయి. వృత్తి, ఉద్యోగాలలో అందలాలు ఎక్కుతారు.
- కుంభం: చతుర్థ, పంచమ స్థానాల్లో గురు, కుజులు వక్రించడం వల్ల జీవితంలో పెను మార్పులు చోటు చేసు కుంటాయి. జీవనశైలి పూర్తిగా మారిపోతుంది. విలాసవంతమైన జీవితం లేదా సంపన్న జీవితం గానీ అలవడుతుంది. ప్రముఖుల కోవలో చేరే అవకాశం ఉంది. వృత్తి, ఉద్యోగాల్లో తప్పకుండా పదో న్నతులు కలుగుతాయి. వ్యాపారాల్లో లాభాలు వృద్ధి చెందుతాయి. అనారోగ్యాల నుంచి చాలా వరకు విముక్తి లభిస్తుంది. షేర్లు, స్పెక్యులేషన్లు, లాటరీలు వగైరాలు అపార ధన లాభం కలిగిస్తాయి.



