AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కీలక స్థానాల్లో బలమైన గ్రహాలు.. ఆ రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!

Telugu Astrology: జ్యోతిష శాస్త్రంలో 3, 6, 10, 11 స్థానాలను ఉపచయ స్థానాలుగా, అభివృద్ధి కేంద్రాలుగా పరిగణించడం జరుగుతోంది. ఈ స్థానాల్లోని గ్రహాలను బట్టి ఏ రాశివారు ఏ విధంగా జీవితంలో అభివృద్ధి చెందేదీ తెలుస్తుంది. గ్రహ సంచారంలో ఈ స్థానాలకు అత్యంత ప్రాముఖ్యం ఉంటుంది. ఈ నాలుగు స్థానాల్లోని గ్రహాలను బట్టి అభివృద్ధిని అంచనా వేయాల్సి ఉంటుంది. ఈ నాలుగు స్థానాలలోనూ గ్రహాలున్న పక్షంలో ఆకాశమే హద్దుగా వీరి అభివృద్ధి సాగిపోతుంది. ఒకే ఒక గ్రహం ఉంటే అభివృద్ధి సామాన్యంగా ఉంటుంది. వివిధ రాశులకు ఇక నుంచి నెల రోజుల పాటు ఏ విధమైన అభివృద్ధి సాధ్యమవుతుందో ఇక్కడ పరిశీలిద్దాం.

TV9 Telugu Digital Desk
| Edited By: Janardhan Veluru|

Updated on: Jan 24, 2025 | 7:23 PM

Share
మేషం: ఈ రాశివారికి మూడవ స్థానంలో కుజుడు, 6వ స్థానంలో కేతువు, 10 వ స్థానంలో రవి, 11వ స్థానంలో శనీశ్వరుడు సంచారం చేస్తున్నందు వల్ల ఏ రంగంలో ఉన్నవారికైనా తప్పకుండా అంచనాలను మించిన అభివృద్ధి లేదా పురోగతి ఉంటుంది. వృత్తి, ఉద్యోగాల్లో అధికార యోగం చేపడతారు. ఇంతకన్నా మంచి ఉద్యోగంలోకి మారడానికి అవకాశం ఉంది. నిరుద్యోగులు ఆశించిన ఉద్యోగం సంపాదించుకోగలుగుతారు. శత్రు, రోగ, రుణ సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది.

1 / 6
వృషభం: ఈ రాశివారికి 10వ స్థానంలో శుక్ర, శనులు, 11వ స్థానంలో రాహువు ఉండడం వల్ల వృత్తి, ఉద్యోగాల కారణంగా ఆదాయం బాగా పెరుగుతుంది. వ్యాపారాలు కొన్ని కష్టనష్టాల నుంచి బయటపడతాయి. ఆర్థికంగా శుభ ఫలితాలను అనుభవిస్తారు. ఏ ప్రయత్నం తలపెట్టినా విజయం వరిస్తుంది. ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. వృత్తి, ఉద్యోగాల్లో తప్పకుండా అధికార యోగం పడుతుంది. వ్యాపారాలలో లాభాలు అంచనాలను మించుతాయి. వ్యక్తిగత సమస్యలు తగ్గుతాయి.

2 / 6
కర్కాటకం: ఈ రాశివారికి 3వ స్థానంలో కేతువు, ఆరవ స్థానంలో బుధుడు, 11వ స్థానంలో గురు సంచారం వల్ల ఊహించని విధంగా కొన్ని అదృష్టాలు కలుగుతాయి. ముఖ్యంగా ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. శుభవార్తలు ఎక్కువగా వింటారు. శుభ పరిణామాలు ఎక్కువగా చోటు చేసుకుంటాయి. వృత్తి, వ్యాపారాలు చాలావరకు నష్టాల నుంచి, ఆర్థిక సమస్యల నుంచి బయటపడతాయి. ఉద్యోగంలో పదోన్నతులు లభిస్తాయి. నిరుద్యోగులకు తప్పకుండా ఆశించిన ఉద్యోగం లభిస్తుంది.

3 / 6
కన్య: ఈ రాశివారికి 6వ స్థానంలో శని, 10వ స్థానంలో కుజుడి సంచారం వల్ల ఉద్యోగ జీవితంలో సానుకూల మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది. నిరుద్యోగులకు విదేశాల్లో ఉద్యోగం చేయాలనే కల నెరవేరుతుంది. ఆర్థికపరమైన లాభాలు ఎక్కువగా ఉంటాయి. ఊహించని విధంగా ప్రముఖులతో మంచి పరిచయాలు ఏర్పడతాయి. మనస్సులోని కోరికలు చాలావరకు నెరవేరుతాయి. వ్యక్తిగత సమస్యలు బాగా తగ్గిపోతాయి. వృత్తి, వ్యాపారాల్లో రాబడి అంచనాలను మించుతుంది.

4 / 6

ధనుస్సు: ఈ రాశివారికి 3వ స్థానంలో శని, ఆరవ స్థానంలో గురువు, 10వ స్థానంలో కేతువు సంచారం వల్ల ఏ రంగంలో ఉన్నా ఊహించని పురోగతి ఉంటుంది. శత్రువుల మీద పైచేయి సాధిస్తారు. శనీశ్వరుడు ఈ రాశిలో సంచరిస్తున్నంత కాలం ఆదాయం వృద్ది చెందుతూనే ఉంటుంది. అనేక సమ స్యల నుంచి విముక్తి లభిస్తుంది. నిరుద్యోగులకు కొద్ది ప్రయత్నంతో ఆశించిన ఉద్యోగం లభిస్తుంది. వృత్తి, వ్యాపార, ఉద్యోగాల్లో విశేషమైన అభివృద్ధి కనిపిస్తుంది. ఆరోగ్యం బాగా మెరుగుపడుతుంది.

5 / 6
మకరం: ఈ రాశివారికి 3వ స్థానంలో రాహువు, ఆరవ స్థానంలో కుజుడు సంచారం చేస్తున్నందువల్ల కోరుకున్నవన్నీ నెరవేరుతాయి. ముఖ్యంగా వృత్తి, ఉద్యోగాల్లో ఊహించని పురోగతి అనుభవానికి వస్తుంది. కుటుంబ పరిస్థితులు బాగా సానుకూలంగా మారతాయి. ఉద్యోగపరంగా అనేక అవకాశాలు అంది వస్తాయి. ఉద్యోగులకే కాక నిరుద్యోగులకు సైతం అరుదైన అవకాశాలు లభిస్తాయి. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. ఉద్యోగంలో శీఘ్ర పురోగతి ఉంటుంది. ఆరోగ్యం మెరుగుపడుతుంది.

6 / 6