Money Astrology 2024: బలహీనపడిన శుక్ర గ్రహం.. ఆ రాశుల వారికి ఆర్థిక లాభాలు.. !
ప్రస్తుతం సూర్యుడికి శుక్రుడు బాగా సన్నిహితంగా ఉన్నందువల్ల శుక్రుడికి ఈ నెల 7వ తేదీ వరకు అస్తంగత్వ దోషం ఏర్పడింది. సూర్యుడికి ఏదైనా గ్రహం బాగా దగ్గరగా వచ్చినప్పుడు, ఆ వేడిమికి దగ్ధమైపోవడం జరుగుతుంది. దీన్ని జ్యోతిష పరిభాషలో అస్తంగత్వ దోషంగా అభివర్ణి స్తారు. సాధారణంగా గ్రహాలు దగ్ధమైపోవడం జరగదు కానీ, బలహీనపడడం, క్షీణించిపోవడం మాత్రం జరుగుతుంది.
ప్రస్తుతం సూర్యుడికి శుక్రుడు బాగా సన్నిహితంగా ఉన్నందువల్ల శుక్రుడికి ఈ నెల 7వ తేదీ వరకు అస్తంగత్వ దోషం ఏర్పడింది. సూర్యుడికి ఏదైనా గ్రహం బాగా దగ్గరగా వచ్చినప్పుడు, ఆ వేడిమికి దగ్ధమైపోవడం జరుగుతుంది. దీన్ని జ్యోతిష పరిభాషలో అస్తంగత్వ దోషంగా అభివర్ణి స్తారు. సాధారణంగా గ్రహాలు దగ్ధమైపోవడం జరగదు కానీ, బలహీనపడడం, క్షీణించిపోవడం మాత్రం జరుగుతుంది. ప్రస్తుతం శుక్రుడు బలహీనపడడం వల్ల శృంగార కార్యకలాపాల మీద శ్రద్ధ తగ్గడం, ప్రేమ వ్యవహారాల పట్ల నిరాసక్తత ఏర్పడడం, దాంపత్య జీవితంలో కలతలు రావడం వంటివి జరిగే అవకాశం ఉంది. అయితే, ధన సంపాదన మీద మాత్రం విపరీతమైన వ్యామోహం ఏర్పడుతుంది. ఇంటి వ్యవహారాల కంటే బయటి వ్యవహారాలకు ప్రాధాన్యం పెరుగుతుంది. మిథునం, కర్కాటకం, వృశ్చికం, ధనుస్సు, మకరం, మీన రాశులకు ఈ దోష ఫలాలు వర్తించే అవకాశం ఉంది.
- మిథునం: ఈ రాశిలో శుక్ర, రవుల కలవడం వల్ల శుక్రుడికి అస్తంగత్య దోషం ఏర్పడింది. దీనివల్ల మనసు ధన సంపాదన మీదకు, వ్యక్తిగత పేరు ప్రఖ్యాతుల మీదక, వృత్తి, ఉద్యోగాల మీదకు మళ్లుతుంది. కుటుంబ లేదా దాంపత్య జీవితం మీద శ్రద్ధాసక్తులు తగ్గుతాయి. సంపాదన మార్గాలు విస్తరిం చడం, వాటి మీద శ్రమను పెంచడం జరుగుతుంది. విలాస జీవితానికి స్వస్తి చెప్పి, ఖర్చుల్ని తగ్గించుకోవడం, పొదుపు చేయడం, బ్యాంక్ బ్యాలెన్స్ పెంచుకోవడం తప్పకుండా జరుగుతుంది.
- కర్కాటకం: ఈ రాశివారికి వ్యయ స్థానంలో ఈ శుక్ర, రవుల యుతి చేసుకున్నందువల్ల శృంగార జీవితం కంటే వృత్తి, వ్యాపారాల మీద ఏకాగ్రత పెరుగుతుంది. ఎక్కువ సమయాన్ని సంపాదనకే ఖర్చు చేయ డం జరుగుతుంది. ఉద్యోగ జీవితంలో స్థిరత్వం కోసం, గుర్తింపు కోసం ఎక్కువగా ప్రయత్నించే లేదా పాటుబడే అవకాశం ఉంది. ఈ రెండు గ్రహాల యుతి వల్ల ఉద్యోగంలో పదోన్నతులు పెరగడా నికి, జీతభత్యాలు వృద్ధి చెందడానికి అవకాశం ఉంది. ఖర్చుల్ని బాగా తగ్గించుకోవడం జరుగుతుంది.
- వృశ్చికం: ఈ రాశికి ఎనిమిదవ స్థానంలో శుక్ర, రవులు కలవడం వల్ల పెళ్లి ప్రయత్నాలు చేయకపోవడం మంచిది. ప్రేమ వ్యవహారాల్లో కూడా ఎంతో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. దాంపత్య జీవితంలో కొద్దిగా అపార్థాలు, వివాదాలు చోటు చేసుకునే అవకాశం ఉంది. ధన వ్యవహారాలు, సంపాదన ప్రయత్నాలు మాత్రం అంచనాలకు మించి కలిసి వస్తాయి. ఎక్కువ సమయం వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో పురోగతి చెందడానికే సరిపోతుంది. ఆరోగ్యం కూడా అందుకు అనుకూలిస్తుంది.
- ధనుస్సు: ఈ రాశికి సప్తమ స్థానంలో శుక్రుడికి అస్తంగత్వ దోషం పట్టడం వల్ల జీవితంలో మాట పట్టింపులు చోటు చేసుకునే అవకాశం ఉంది. దాంపత్య జీవితంలో సుఖ సంతోషాలు లోపిస్తాయి. పెళ్లి ప్రయత్నాలకు, పెళ్లి మాటలకు, ప్రేమ వ్యవహారాలకు కాస్తంత దూరంగా ఉండడం మంచిది. వృత్తి, ఉద్యోగాల్లో ప్రాధాన్యం, ప్రాభవం పెరగడంతో పాటు బరువు బాధ్యతలు కూడా బాగా పెరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా వృత్తి, వ్యాపారాల్లో క్షణం కూడా తీరిక ఉండని పరిస్థితి ఏర్పడుతుంది.
- మకరం: ఈ రాశికి ఆరవ స్థానంలో శుక్ర, రవుల సంచారం వల్ల వృత్తి, ఉద్యోగాలకు బాగా అనుకూలంగా ఉంటుంది కానీ, గృహ జీవితానికి అనుకూలంగా ఉండకపోవచ్చు. ఎక్కువ సమయాన్ని వృత్తి, ఉద్యోగాలకు కేటాయించాల్సి వస్తుంది. శరీరానికి విశ్రాంతి కరువవుతుంది. ఆదాయం బాగా పెరిగి ముఖ్యమైన అవసరాలు తీరిపోయే అవకాశం ఉంది. కెరీర్ పరంగానే కాక, సామాజికంగా కూడా మంచి గుర్తింపు లభిస్తుంది. అదనపు ఆదాయ మార్గాల కారణంగా కూడా శ్రమ బాగా పెరుగుతుంది.
- మీనం: ఈ రాశికి నాలుగవ స్థానంలో, అంటే సుఖ సంతోషాలకు సంబంధించిన స్థానంలో శుక్రుడి అస్తం గత్వం జరిగినందువల్ల కుటుంబంలో సుఖ సంతోషాలు బాగా తగ్గే అవకాశం ఉంది. ముఖ్యంగా దాంపత్య జీవితానికి దూరమవుతారు. ప్రేమ వ్యవహారాల్లో చిక్కులు ఎదురవుతాయి. కుటుంబంలో సమస్యలు తలెత్తే అవకాశం కూడా ఉంది. అయితే, వృత్తి, ఉద్యోగాల్లో ప్రాభవం పెరుగుతుంది. హోదాతో పాటు జీతభత్యాలు పెరిగే అవకాశం కూడా ఉంది. వ్యాపారాలు బిజీ అయిపోతారు.