AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kuja Rahu Yuti: కుజ రాహువుల యుతి.. వాహన ప్రమాదాలు, ధన నష్టానికి ఛాన్స్.. జాగ్రత్త..!

కుజుడు, రాహువుల మధ్య పరస్పర దృష్టి జూలై 28 వరకు కొనసాగుతుంది. వృషభం, కర్కాటకం, సింహం, కన్య, మకరం, కుంభ రాశుల వారికి ప్రతికూల ప్రభావం ఉంటుంది. వాహన, అగ్ని ప్రమాదాలు, ఆరోగ్య సమస్యలు, ఆర్థిక నష్టం, కుటుంబ వివాదాలు సంభవించే అవకాశం ఉంది. అయిదు వారాల పాటు ప్రతి రోజూ సుబ్రహ్మణ్యాష్టక పారాయణం మంచిది.

Kuja Rahu Yuti: కుజ రాహువుల యుతి.. వాహన ప్రమాదాలు, ధన నష్టానికి ఛాన్స్.. జాగ్రత్త..!
Telugu Astrology
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Jun 21, 2025 | 2:04 PM

Share

ప్రస్తుతం కుజ, రాహువుల పరస్పరం వీక్షించుకుంటున్నాయి. జూలై 28న కుజుడి రాశి మార్పుతో ఈ వీక్షణ తొలగిపోతుంది. కుంభ రాశిలో ఉన్న రాహువుతో సింహ రాశిలో ఉన్న కుజుడికి వీక్షణ ఏర్పడింది. ఈ రెండు పాప గ్రహాల మధ్య పరస్పర వీక్షణ ఏర్పడడం వృషభం, కర్కాటకం, సింహం, కన్య, మకరం, కుంభ రాశుల వారికి ఏమాత్రం మంచిది కాదు. వాహన ప్రమాదాలు, అగ్ని ప్రమాదాలు, ఆరోగ్య భంగం, పదవీచ్యుతి, మోసం, ధన నష్టం, నమ్మక ద్రోహం వంటి ప్రతికూల ఫలితాలకు ఎక్కువ అవకాశం ఉంటుంది. ఈ రాశివారు అయిదు వారాల పాటు ప్రతి రోజూ ఉదయం సుబ్రహ్మణ్యాష్టకం చదువుకోవడం మంచిది.

  1. వృషభం: ఈ రాశికి చతుర్థ స్థానంలో కుజుడి మీద రాహువు దృష్టి పడినందువల్ల వాహన ప్రమాదాలకు ఎక్కువగా అవకాశం ఉంది. కుటుంబంలో సమస్యలు, విభేదాలు తలెత్తి టెన్షన్లు చోటు చేసుకుంటాయి. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారు మోసపోవడం గానీ, నష్టపోవడం గానీ జరుగుతుంది. ఆస్తి వివాదాలు బాగా ఇబ్బంది కలిగిస్తాయి. ఉద్యోగంలో అధికారుల ఒత్తిడి, వేధింపులు కాస్తంత ఎక్కువగా ఉంటాయి. మొత్తం మీద మనశ్శాంతి, సుఖ సంతోషాలు బాగా తగ్గే అవకాశం ఉంది.
  2. కర్కాటకం: ఈ రాశికి కుటుంబ, ధన స్థానంలో సంచారం చేస్తున్న కుజుడి మీద రాహువు దృష్టిపడినందు వల్ల ఆర్థిక సమస్యలు, రుణ సమస్యల ఒత్తిడి కాస్తంత ఎక్కువగా ఉంటుంది. రావలసిన డబ్బు సకాలంలో చేతికి అందక ఇబ్బంది పడతారు. కుటుంబంలో తీవ్రస్థాయిలో అపార్థాలు చోటు చేసుకుంటాయి. ఆర్థిక సహాయం పొందినవారు ముఖం చాటేస్తారు. కుటుంబం మీద ఖర్చు బాగా పెరుగుతుంది. ఆర్థిక వ్యవహారాల్లో కొందరు బంధుమిత్రుల వల్ల మోసపోయే అవకాశం ఉంది.
  3. సింహం: ఈ రాశిలో ఉన్న కుజుడికి, సప్తమంలో ఉన్నరాహువుకి మధ్య పరస్పర వీక్షణ ఏర్పడినందువల్ల కుటుంబంలో సుఖశాంతులు బాగా తగ్గుతాయి. జీవిత భాగస్వామితో విభేదాలు, అపార్థాలు తలెత్తుతాయి. ప్రతి వ్యవహారంలోనూ, ప్రతి విషయంలోనూ ఆచితూచి వ్యవహరించాల్సి ఉంటుంది. వృత్తి, వ్యాపారాల్లో ప్రత్యర్థులు, పోటీదార్లు పైచేయి సాధిస్తారు. పెళ్లి ప్రయత్నాలు వెనుక పట్టుపడతాయి. ప్రేమ వ్యవహారాల్లో ఘర్షణలు చోటు చేసుకుంటాయి. అనారోగ్యానికి కూడా అవకాశముంది.
  4. కన్య: ఈ రాశికి వ్యయ స్థానంలో ఉన్న కుజుడితో ఆరవ స్థానంలో ఉన్న రాహువుకు సమసప్తకం ఏర్పడినందువల్ల ఆర్థికంగా బాగా నష్టపోవడం, నమ్మక ద్రోహానికి గురికావడం, అనారోగ్యంతో ఇబ్బంది పడడంవంటివి జరిగే అవకాశం ఉంది. రహస్య శత్రువులు తయారవుతారు. ఆస్తి వివాదాలు ఇబ్బంది పెడతాయి. లేనిపోని నిందలు మీద పడతాయి. అరెస్టయ్యే అవకాశం కూడా ఉంటుంది. అనవసర పరిచయాలతో ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఉంది.
  5. మకరం: ఈ రాశికి అష్టమ స్థానంలో ఉన్న కుజుడితో రాహువుకు సమసప్తకం ఏర్పడినందువల్ల వాహన ప్రమాదాలకు, అగ్ని ప్రమాదాలకు, విద్యుదాఘాతాలకు అవకాశం ఉంది. ఆస్తి వివాదాలు ఇబ్బంది పెడతాయి. మాట తొందరపాటు వల్ల బంధుమిత్రులతో సంబంధాలు దెబ్బతినడం జరుగుతుంది. రావలసిన డబ్బు ఒక పట్టాన చేతికి అందదు. జీవిత భాగస్వామితో విభేదాలు తలెత్తుతాయి. ఇష్టం లేని ప్రాంతాలకు బదిలీ అయ్యే అవకాశం ఉంది. ఆర్థికంగా బాగా నష్టపోవడం జరుగుతుంది.
  6. కుంభం: ఈ రాశిలో ఉన్న రాహువుతో కుజుడికి సమసప్తక దృష్టి ఏర్పడినందువల్ల జీవిత భాగస్వామితో వివాదాలు తలెత్తడం, జీవిత భాగస్వామి అనారోగ్యానికి గురికావడం, రోడ్డు ప్రమాదాలు సంభవించడం, బంధుమిత్రుల వల్ల ఆర్థికంగా దెబ్బతినడం వంటివి జరిగే అవకాశం ఉంది. పెళ్లి ప్రయత్నాల్లో ఆశాభంగాలు కలుగుతాయి. దుర్వార్తలు ఎక్కువగా వినడం జరుగుతుంది. ఆస్తి వివాదాలు, కోర్టు కేసుల్లో ప్రతికూల ఫలితాలు అందుతాయి. తగాదాల్లో తలదూర్చకపోవడం మంచిది.