Marriage & Job Astrology: ఆ రాశుల వారి ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలు త్వరలో నెరవేరుతాయి..!

స్థిర రాశులైన వృషభం, సింహం, వృశ్చికం, కుంభ రాశుల వారు సాధారణంగా ప్రణాళికాబద్ధంగా వ్యవహరిస్తారు. ఏ పని చేసినా, ఏ ప్రయత్నం తలపెట్టినా ఆచితూచి అడుగులు వేస్తారు. మాటలో, చేతలో నిలకడ ఉంటుంది. వీరికి ఈ నెల 20వ తేదీ నుంచి ఏప్రిల్ 30 వరకూ అనేక విధాలుగా జీవితంలో స్థిరత్వం ఏర్పడుతుంది. ముఖ్యంగా పెళ్లి ప్రయత్నాలు, ఉద్యోగ ప్రయత్నాలు సఫలం కావడమే కాకుండా..

Marriage & Job Astrology: ఆ రాశుల వారి ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలు త్వరలో నెరవేరుతాయి..!
Marriage Astrology
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By: Janardhan Veluru

Updated on: Jan 23, 2024 | 3:37 PM

స్థిర రాశులైన వృషభం, సింహం, వృశ్చికం, కుంభ రాశుల వారు సాధారణంగా ప్రణాళికాబద్ధంగా వ్యవహరిస్తారు. ఏ పని చేసినా, ఏ ప్రయత్నం తలపెట్టినా ఆచితూచి అడుగులు వేస్తారు. మాటలో, చేతలో నిలకడ ఉంటుంది. వీరికి ఈ నెల 20వ తేదీ నుంచి ఏప్రిల్ 30 వరకూ అనేక విధాలుగా జీవితంలో స్థిరత్వం ఏర్పడుతుంది. ముఖ్యంగా పెళ్లి ప్రయత్నాలు, ఉద్యోగ ప్రయత్నాలు సఫలం కావడమే కాకుండా, ఉద్యోగాలు మారాలనుకుంటున్న వారికి కూడా త్వరలో ఆ కోరిక నెరవేరుతుంది. ఈ నాలుగు రాశులతో పాటు భూతత్వం కలిగిన కన్య, మకర రాశుల వారికి కూడా స్థిర రాశుల వారి మాదిరిగానే అన్ని విషయాలలోనూ ‘స్థిరత్వం’ కలిగే అవకాశం ఉంది.

  1. వృషభం: ఈ రాశివారికి తప్పకుండా ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆశించిన ఉద్యోగంతో పాటు, కోరు కున్న జీతభత్యాలు కూడా అందే అవకాశం ఉంది. పెళ్లి ప్రయత్నాలకు కూడా సానుకూల స్పందన లభిస్తుంది. మొత్తం మీద ఏప్రిల్ 30వ తేదీ లోపు ఈ రాశివారికి జీవితంలో అనేక విధా లుగా స్థిరత్వం లభిస్తుంది. ఆ తర్వాత జీవితం వారు ఎంచుకున్న విధంగా సాఫీగా, హ్యాపీగా సాగి పోతుంది. శని, శుక్రుల అనుకూలత వల్ల వీరి జీవితంలో సానుకూల మార్పులు చోటు చేసుకుంటాయి.
  2. సింహం: ఈ రాశివారికి శనీశ్వరుడు, రవి ఊహించని విధంగా లిఫ్ట్ ఇవ్వడం జరుగుతుంది. వీరు కోరుకున్న రంగంలో కోరుకున్న విధంగా స్థిరపడడానికి అవకాశం ఉంది. నిరుద్యోగులకు మంచి జీతభత్యా లతో కూడిన ఉద్యోగం లభించడానికి అవకాశం ఉంది. పైగా సొంత ఊర్లోనే మంచి ఉద్యోగం లభించే అవకాశం కూడా ఉంది. ఉద్యోగపరంగా, ఆర్థికపరంగా స్థిరపడడంతో పాటు పెళ్లి ప్రయత్నాల్లో విజ యాలు లభించి వైవాహిక జీవితంలో కూడా కొత్త పుంతలు తొక్కడం తప్పకుంగా జరుగుతుంది.
  3. కన్య: ఈ రాశివారికి శనీశ్వరుడి అనుకూలతతో పాటు, రాశ్యధిపతి బుధుడి అనుకూలత కూడా ఉన్నం దువల్ల వీరు ఉద్యోగపరంగా బాగా పురోగతి సాధించడం జరుగుతుంది. ఉద్యోగ జీవితంలో భద్రత ఉంటుంది. ఆశించిన స్థాయిలో జీతభత్యాలు పెరగడం కూడా జరుగుతుంది. సంపన్న కుటుంబా నికి చెందిన వ్యక్తితో వివాహం జరిగే సూచనలున్నాయి. ఉద్యోగం మారడానికి కూడా అవకాశం ఉంది. మొత్తం మీద కెరీర్ పరంగానే కాక, వ్యక్తిగతం కూడా సానుకూలతలు ఎక్కువగా ఉన్నాయి.
  4. వృశ్చికం: ఈ రాశివారికి అర్ధాష్టమ శని వల్ల దుష్ఫలితాల కంటే శుభ ఫలితాలే ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. వృత్తి, ఉద్యోగాల్లో అంచనాలకు మించిన స్థిరత్వం ఏర్పడుతుంది. ఆర్థికంగా చాలావరకు సమస్యలు తగ్గిపోయి, ఆదాయం పెరుగుతుంది. పెళ్లిపరంగా మంచి సంబంధాలు అంది వస్తాయి. జీవితంలో అన్ని విధాలా స్థిరత్వం పొందడానికి అవసరమైన పునాదులు ఈ రెండు మూడు నెలల్లో పడే సూచనలున్నాయి. వృత్తి, ఉద్యోగాల్లో విదేశాల్లో స్థిరపడడానికి కూడా అవకాశం ఉంది.
  5. మకరం: ఈ రాశివారికి అతి సమీప భవిష్యత్తులో తప్పకుండా అన్ని విధాలుగానూ స్థిరత్వం లభిస్తుంది. నిరుద్యోగులు మంచి జీతభత్యాలతో కొత్త ఉద్యోగంలోకి ప్రవేశించడం జరుగుతుంది. ఉద్యోగం మారాలనుకుంటున్న వారి ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆ తర్వాత ఇప్పట్లో ఉద్యోగం మారడం కూడా జరగకపోవచ్చు. సాధారణంగా సొంత ఊర్లోనే ఉద్యోగం సంపాదించుకోవడం, ఉద్యోగం మారడం జరుగుతుంది. ఆర్థిక పరిస్థితి బాగా మెరుగుపడుతుంది. ఇష్టమైన వ్యక్తితో పెళ్లి ఖాయం అవుతుంది.
  6. కుంభం: ఈ రాశివారికి ఏలిన్నాటి శని సైతం శుభ ఫలితాలను ఇచ్చే అవకాశం ఉంది. ఈ రాశివారికి స్థిర మైన ఉద్యోగం లభించడంతో పాటు, ఆదాయపరంగా కూడా బాగా పురోగతి చెందే అవకాశం ఉంటుంది. సొంత ఊర్లోనే ఆశించిన ఉద్యోగం లభించడం జరుగుతుంది. ఇష్టమైన వ్యక్తితో, ఇష్టమైన విధంగా వివాహం జరిగే అవకాశం ఉంటుంది. ఆర్థికంగా అనేక మార్గాలలో సంపాదించడం జరు గుతుంది. ఆర్థిక సమస్యలు చాలావరకు తగ్గిపోయి, చీకూ చింతా లేని పరిస్థితి ఏర్పడుతుంది.

టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?