Horoscope Today: ఆ రాశి వారికి ఆకస్మిక ధన ప్రాప్తికి అవకాశం.. 12 రాశుల వారికి బుధవారం రాశిఫలాలు

దిన ఫలాలు (జనవరి 24, 2024): ఉద్యోగంలో మేష రాశి వారి పనితీరు అధికారులకు బాగా నచ్చుతుంది. వృషభ రాశి వారికి వృత్తి, ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు తప్పకపోవచ్చు. మిథున రాశి వారికి ఉద్మోగ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి బుధవారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..

Horoscope Today: ఆ రాశి వారికి ఆకస్మిక ధన ప్రాప్తికి అవకాశం.. 12 రాశుల వారికి బుధవారం రాశిఫలాలు
Horoscope Today 24th January 2024
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By: Janardhan Veluru

Updated on: Jan 24, 2024 | 5:01 AM

దిన ఫలాలు (జనవరి 24, 2024): ఉద్యోగంలో మేష రాశి వారి పనితీరు అధికారులకు బాగా నచ్చుతుంది. వృషభ రాశి వారికి వృత్తి, ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు తప్పకపోవచ్చు. మిథున రాశి వారికి ఉద్మోగ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి బుధవారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..

మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)

ఉద్యోగంలో మీ పనితీరు అధికారులకు బాగా నచ్చుతుంది. ఉన్నత స్థాయి వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి. సర్వత్రా మీ మాటకు విలువ పెరుగుతుంది. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. రావలసిన డబ్బు చేతికి అందుతుంది. అనుకోని ఖర్చులు మీద పడే అవకాశం ఉంది. జీవిత భాగస్వామితో కలిసి షాపింగ్ చేస్తారు. ఆహార, విహారాలకు సంబంధించి ముఖ్యమైన జాగ్ర త్తలు పాటించడం మంచిది. కొందరు మిత్రుల వల్ల అనుకోకుండాఈ డబ్బు నష్టపోయే అవకాశం ఉంది.

వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)

వృత్తి, ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు తప్పకపోవచ్చు. తీరిక దొరకని పరిస్థితి ఏర్పడుతుంది. ప్రయాణాలు లాభదాయకంగా సాగిపోతాయి. ముఖ్యమైన వ్యవహారాల్లో నిర్ణయాలు మార్చుకో వడం జరుగుతుంది. కుటుంబ సభ్యులతో దైవ దర్శనం చేసుకుంటారు. వ్యాపారాలు నిలకడగా ముందుకు సాగుతాయి. ఆదాయ ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి. ఒకరిద్దరు మిత్రులకు ఆర్థికంగా సహాయం చేయడం జరుగుతుంది. వ్యక్తిగత సమస్య అనుకోకుండా పరిష్కారం అవు తుంది.

మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)

అనుకోకుండా కుటుంబ సమస్యలు పరిష్కారం అవుతాయి. ఉద్మోగ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. ఉద్యోగంలో మీ మాట చెల్లుబాటవుతుంది. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్త వుతాయి. మనసులోని కోరికలు ఒకటి రెండు నెరవేరుతాయి. చేపట్టిన వ్యవహారాలు విజయవం తంగా, సంతృప్తికరంగా పూర్తవుతాయి. ఆర్థిక పరిస్థితి చాలావరకు అనుకూలంగా ఉంటుంది. వృత్తి, వ్యాపారాల్లో రాబడి నిలకడగా ఉంటుంది. పిల్లల పరంగా శుభవార్తలు వింటారు. ఆరోగ్యం జాగ్రత్త.

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)

కుటుంబ వాతావరణం ఉత్సాహంగా ఉంటుంది. ఉద్యోగంలో ఒత్తిడి ఉన్నప్పటికీ, శుభ ఫలితాలు అనుభవానికి వస్తాయి. అధికారుల నుంచి ప్రోత్సాహకాలు అందుకుంటారు. వృత్తి, వ్యాపారాల్లో లాభాలు పెరిగే అవకాశం ఉంటుంది. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు సానుకూలంగా ఉంటాయి. జీవిత భాగస్వామి సలహాలు, సూచనలు కలిసి వస్తాయి. సన్నిహితుల నుంచి శుభ వార్తలు వింటారు. పిల్లలు ఆశించిన స్థాయిలో పురోగతి సాధిస్తారు. ఆహార, విహారాల్లో జాగ్రత్తగా ఉండాలి.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)

వృత్తి, వ్యాపారాల్లో సొంత నిర్ణయాలు బాగా కలిసి వస్తాయి. ఉద్యోగ జీవితం సాఫీగా, హ్యాపీగా గడిచిపోతుంది. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ముఖ్యమైన పనులు సజావుగా సాగిపోతాయి. వ్యక్తిగత సమస్యలు తగ్గుముఖం పడతాయి. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది. తోబుట్టువులతో సఖ్యత, సాన్నిహిత్యం పెరుగుతాయి. కుటుంబ వ్యవహారాలు సానుకూలంగా సాగిపోతాయి. దాంపత్య జీవితంలో అన్యోన్యత పెరుగుతుంది. వాహన ప్రమాదాలతో జాగ్రత్తగా ఉండాలి.

కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)

ఆర్థిక పరిస్థితికి సానుకూలంగా, సంతృప్తికరంగా ఉంటుంది. ఆర్థిక లావాదేవీల వల్ల ఇబ్బందు లె దురవుతాయి. వృత్తి, ఉద్యోగాల్లో ప్రాధాన్యం పెరుగుతుంది. వ్యాపారాలు సజావుగా సాగిపోతాయి. ముఖ్యమైన వ్యవహారాలు మందకొడిగా ముందుకు సాగుతాయి. ఆరోగ్యం జాగ్రత్త. ప్రయాణాల్లో ఇబ్బందులు పడతారు. కుటుంబ జీవితంలో అన్యోన్యత, సామరస్యం పెరుగుతాయి. తోబుట్టువు లతో ఆస్తి సంబంధమైన సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. ఒకటి రెండు శుభవార్తలు వింటారు.

తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)

ఏ ప్రయత్నం తలపెట్టినా సునాయాసంగా నెరవేరుతుంది. వృత్తి, వ్యాపారాలు నిదానంగా, నిల డగా సాగుతాయి. ఉద్యోగులకు ప్రమోషన్ల విషయంలో కొద్దిగా జాప్యం జరిగే అవకాశం ఉంది. స్వల్ప అనారోగ్య సమస్యలుంటాయి. వ్యయ ప్రయాసలతో ముఖ్యమైన వ్యవహారాలు పూర్తవుతాయి. ఇంటా బయటా బాధ్యతలు పెరుగుతాయి. ఆర్థిక ప్రయత్నాలు సానుకూలపడతాయి. అవసరానికి మించి ఇతరులకు సహాయం చేయడం జరుగుతుంది. వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు.

వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట)

ఉద్యోగ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. డాక్టర్లు, లాయర్లకు డిమాండ్ పెరుగుతుంది. వ్యాపా రపరంగా కొన్ని సమస్యలను అధిగమిస్తారు. కొందరు దగ్గర బంధువుల నుంచి శుభ వార్తలు వింటారు. పెళ్లి సంబంధం ఖాయం చేసుకుంటారు. రియల్ ఎస్టేట్, లిక్కర్, రాజకీయాలు, ప్రభుత్వం వంటి రంగాలకు చెందిన వారికి సమయం చాలావరకు అనుకూలంగా ఉంది. ఆకస్మిక ధన ప్రాప్తికి అవకాశం ఉంది. ఉన్నత స్థాయి వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. . ఆరోగ్యం పరవాలేదు.

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)

ఆర్థిక వ్యవహారాలు చాలావరకు సానుకూలంగా సాగిపోతాయి. రావలసిన డబ్బు సకాలంలో చేతికి అందుతుంది. అన్ని రకాల బాకీలు వసూలవుతాయి. ముఖ్యమైన అవసరాలు తీరిపోతాయి. వృత్తి, వ్యాపారాలు లాభసాటిగా, సంతృప్తికరంగా ముందుకు సాగుతాయి. ఉద్యోగ వాతా వరణం ఉత్సాహంగా ఉంటుంది. అనుకున్న వ్యవహారాలు, ముఖ్యమైన పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. పెద్దల జోక్యంతో ముఖ్యమైన కుటుంబ సమస్య ఒకటి పరిష్కారం అవుతుంది.

మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2)

ఆర్థిక పరిస్థితి చాలావరకు మెరుగ్గా ఉంటుంది. సామాజికంగా మరింత పురోగతి సాధిస్తారు. ఒక శుభ కార్యం గురించి కుటుంబ సభ్యులతో ప్లాన్ చేస్తారు. వృత్తి జీవితంలో బాగా ఒత్తిడి ఉంటుంది. విశ్రాంతికి అవకాశం ఉండకపోవచ్చు. వ్యాపారాలు అనుకూలంగా, ఆశాజనకంగా ఉంటాయి. ఉద్యో గంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. కొత్త బాధ్యతలు తీసుకోవాల్సి వస్తుంది. సంతానానికి సంబంధించి శుభవార్తలు వింటారు. నిరుద్యోగులకు మంచి కంపెనీల నుంచి ఆఫర్లు అందివస్తాయి.

కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)

సమాజంలో గౌరవ మర్యాదలకు లోటుండదు కానీ, బరువు బాధ్యతలు పెరిగిన కారణంగా ఇబ్బందిపడడం జరుగుతుంది. సొంత పనులకు ప్రాధాన్యం ఇవ్వడం మంచిది. ఉద్యోగంలో ఇత రుల బాధ్యతలు మీద పడే అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాల్లో శ్రమ ఎక్కువగా ఉన్నా ఫలితం ఉంటుంది. కొన్ని ముఖ్యమైన వ్యవహా రాలు, వ్యక్తిగత పనుల్లో స్నేహితుల సహాయ సహకారాలు లభిస్తాయి. ఆరోగ్యం విషయంలో అశ్రద్ధ చేయడం ఏమాత్రం మంచిది కాదు. ఆర్థిక పరిస్థితి బాగానే ఉంటుంది.

మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)

ఇంటా బయటా అనుకూల పరిస్థితులు ఉంటాయి. ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు. చేపట్టిన వ్యవహారాలు సజావుగా సాగిపోతాయి. ఆస్తి సంబంధమైన వ్యవహారాలు సానుకూలంగా పూర్తవు తాయి. వ్యాపారులకు లాభాలు పెరిగి పెట్టుబడులు పెంచడం జరుగుతుంది. వృత్తి, ఉద్యోగాలలో ఆశించిన ప్రోత్సాహకాలు అందుతాయి. ఆదాయం నిలకడగా ఉంటుంది. కొద్ది ప్రయత్నంతో మొండి బాకీలు, బకాయిలు వసూలు అవుతాయి. ప్రయాణాలలో వీలైనంత జాగ్రత్తగా ఉండాలి.