Horoscope Today: ఆ రాశుల వారికి ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది.. 12 రాశుల వారికి మంగళవారం రాశిఫలాలు

దిన ఫలాలు (జనవరి 23, 2024): మేష రాశి వారికి అనుకోకుండా ఒకటి రెండు వ్యక్తిగత పరిష్కారం అవుతాయి. వృషభ రాశికి చెందిన నిరుద్యోగులకు ఇష్టమైన కంపెనీల నుంచి ఆఫర్లు అందే అవకాశం ఉంది. మిథున రాశికి చెందిన నిరుద్యోగులకు కొత్త ఉద్యోగావకాశాలు అందివస్తాయి. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి మంగళవారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..

Horoscope Today: ఆ రాశుల వారికి ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది.. 12 రాశుల వారికి మంగళవారం రాశిఫలాలు
Horoscope Today 23rd January 2024
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By: Janardhan Veluru

Updated on: Jan 23, 2024 | 5:01 AM

దిన ఫలాలు (జనవరి 23, 2024): మేష రాశి వారికి అనుకోకుండా ఒకటి రెండు వ్యక్తిగత పరిష్కారం అవుతాయి. వృషభ రాశికి చెందిన నిరుద్యోగులకు ఇష్టమైన కంపెనీల నుంచి ఆఫర్లు అందే అవకాశం ఉంది. మిథున రాశికి చెందిన నిరుద్యోగులకు కొత్త ఉద్యోగావకాశాలు అందివస్తాయి. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి మంగళవారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..

మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)

ఎటువంటి ప్రయత్నం తలపెట్టినా విజయవంతం అవుతుంది. అనుకోకుండా ఒకటి రెండు వ్యక్తిగత పరిష్కారం అవుతాయి. మనసులోని కోరికలు నెరవేరే అవకాశం ఉంది. బంధుమిత్రులతో కలిసి శుభ కార్యంలో పాల్గొంటారు. ప్రముఖ వ్యక్తులు కొందరు పరిచయం అవుతారు. వృత్తి, వ్యాపారాల్లో కీలక నిర్ణయాలు తీసుకుని లాభాలు గడిస్తారు. ఉద్యోగంలో అనుకూల వాతావరణం నెలకొంటుంది. ఆరోగ్యం జాగ్రత్తగా ఉండడం మంచిది. పిల్లలు పోటీ పరీక్షల్లో విజయాలు సాధి స్తారు.

వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)

వృత్తి, ఉద్యోగాలలో అనుకూల పరిస్థితులు నెలకొంటాయి. వ్యాపారాల్లో లాభాలు నిలకడగా ఉంటాయి. పట్టుదలగా పనులు పూర్తి చేస్తారు. ఆర్థిక లావాదేవీలు కలిసి వస్తాయి. నిరుద్యోగులకు ఇష్టమైన కంపెనీల నుంచి ఆఫర్లు అందే అవకాశం ఉంది. కుటుంబ పరిస్థితులు చాలావరకు చక్కబడతాయి. సొంత వ్యక్తులు సైతం స్వప్రయోజనాలకు వాడుకునే అవకాశం ఉంది. అనారోగ్య సూచనలున్నాయి. ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది.

మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)

ఉద్యోగంలో అధికార యోగానికి అవకాశం ఉంది. వృత్తి జీవితంలో తీరిక లేని పరిస్థితి ఏర్పడుతుంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. వ్యాపారాలు బలం పుంజుకుంటాయి. ఇంటా బయటా ఆదరణ, గౌరవ మర్యాదలు పెరుగుతాయి. బంధుమిత్రులతో విందు, వినోద కార్యక్రమాల్లో పాల్గొం టారు. ప్రముఖులతో సాన్నిహిత్యం పెరుగుతుంది. నిరుద్యోగులకు కొత్త ఉద్యోగావకాశాలు అందివస్తాయి. బంధువర్గంలో పెళ్లి సంబంధం కుదురుతుంది. ఆర్థిక పరిస్థితి చాలావరకు మెరుగ్గా ఉంటుంది.

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)

వృత్తి, ఉద్యోగాల్లో శ్రమాధిక్యత ఉంటుంది. ఇంటా బయటా బాగా ఒత్తిడి ఉండవచ్చు. ముఖ్యమైన వ్యవహారాలను పట్టుదలగా పూర్తి చేస్తారు. వ్యాపారాలు పరవాలేదనిపిస్తాయి. పిల్లల నుంచి శుభ వార్తలు వింటారు. కుటుంబ జీవితంలో అన్యోన్యత, సామరస్యం పెరుగుతాయి. ఉద్యోగ ప్రయత్నా లలో సానుకూల స్పందన ఉంటుంది. ఆర్థిక పరిస్థితి అనుకూలంగా, ఆశాజనకంగా ఉంటుంది. తోబుట్టువులతో సఖ్యత, సాన్నిహిత్యం పెరుగుతాయి. దైవ కార్యాల్లో పాల్గొనడం జరుగుతుంది.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)

వృత్తి, వ్యాపారాలు సజావుగా, లాభదాయకంగా సాగిపోతాయి. ఉద్యోగంలో అనుకూలతలు పెరుగు తాయి. ఆర్థిక వ్యవహారాలు, ప్రయత్నాల్లో ఆశించిన పురోగతి ‍సాధిస్తారు. చిన్ననాటి స్నేహితులతో విందు, వినోదాల్లో పాల్గొంటారు. కొందరు బంధువులు లేదా తోబుట్టువుల నుంచి శుభవార్తలు అందుతాయి. నిరుద్యో గులకు ఇష్టమైన ఉద్యోగాల నుంచి ఆఫర్లు వస్తాయి. పెళ్లి ప్రయత్నాలలో సానుకూలత కనిపిస్తుంది. దూర ప్రాంతాలలో ఉంటున్న పిల్లలు చూడడానికి వచ్చే అవకాశం ఉంది.

కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)

వృత్తి, ఉద్యోగాల్లో ప్రతిభాపాటవాలకు ఆశించిన గుర్తింపు లభిస్తుంది. ముఖ్యమైన వ్యవహారాల్లో కార్యసిద్ధి కలుగుతుంది. వ్యాపారాలు ఆశించిన విధంగా రాణిస్తాయి. అన్ని రంగాల వారికి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. కుటుంబంలో జీవిత భాగస్వామితో అన్యోన్యత పెరుగుతుంది. ఆహార విహారాల్లో తప్పనిసరిగా జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. నిరుద్యోగుల ఉద్యోగ ప్రయత్నాలు, అవివాహితుల పెళ్లి ప్రయత్నాలు ఒక కొలిక్కి వస్తాయి. ఒకటి రెండు శుభవార్తలు వింటారు.

తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)

వృత్తి, ఉద్యోగాల్లో మీ మాట బాగా చెల్లుబాటు అవుతుంది. వ్యాపారాలు నిలకడగా సాగిపోతాయి. ఆరోగ్యం బాగుంటుంది. ఆదాయం మెరుగ్గా ఉంటుంది. కానీ, అనవసర ఖర్చులు బాగా పెరుగు తాయి. పిల్లలు చదువుల్లో శుభవార్తలు తీసుకు వస్తారు. సునాయాసంగా కొన్ని ముఖ్యమైన వ్యవహారాలను పూర్తి చేస్తారు. నిరుద్యోగులకు దూర ప్రాంతం నుంచి ఉద్యోగానికి సంబంధించిన ఆఫర్ వస్తుంది. పెళ్లి ప్రయత్నాల విషయంలో తప్పకుండా సానుకూల స్పందన ఉంటుంది.

వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట)

వృత్తి, ఉద్యోగ, వ్యాపార వ్యవహారాలు నిలకడగా సాగిపోతాయి. ఇంటా బయటా బాగా ఒత్తిడి ఉంటుంది. తలపెట్టిన వ్యవహారాలు, పనులు నిదానంగా పూర్తవుతాయి. ఆహార, విహారాల్లో జాగ్రత్తలు పాటించాలి. ఆర్థికంగా ఉత్సాహకరమైన వాతావరణం ఉంటుంది. ఉద్యోగానికి, పెళ్లి ప్రయ త్నాలకు, ఆర్థిక విషయాలకు సంబంధించి ఒకటి రెండు శుభవార్తలు వినే అవకాశం ఉంది. వృత్తి, ఉద్యోగాల్లో ఆశించిన విధంగా స్థిరపడతారు. ఒక వ్యక్తిగత సమస్య నుంచి చాలావరకు బయటపడ తారు.

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)

ఆర్థిక వ్యవహారాలు బాగా అనుకూలంగా సాగిపోతాయి. ఏ పని లేదా ప్రయత్నం తలపెట్టినా విజయం సాధిస్తారు. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. దాదాపు అన్ని రంగాల వారికి కలిసి వచ్చే కాలం ఇది. వృత్తి, వ్యాపారాల్లో సంపాదన, లాభాలు పెరుగుతాయి. అనారోగ్యం నుంచి చాలావరకు బయటపడతారు. కుటుంబ సభ్యులతో కలిసి పుణ్య కార్యాల్లో పాల్గొంటారు. ఉద్యోగంలో సంతృప్తికర వాతావరణం ఉంటుంది. ఉద్యోగ, వివాహ ప్రయత్నాలు ఒక కొలిక్కి వస్తాయి.

మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2)

వృత్తి, ఉద్యోగాలు మరింత ఉత్సాహంగా, ఆశాజనకంగా ముందుకు సాగుతాయి. వ్యాపారంలో లాభాలు నిలకడగా ఉంటాయి. తలపెట్టిన పనుల్లో కార్యసిద్ధి కలుగుతుంది. ప్రముఖులతో పరిచ యాలు లాభసాటిగా సాగుతాయి. చిన్ననాటి మిత్రుల కలయిక ఆనందం కలిగిస్తుంది. కుటుం బంతో కలిసి విహార యాత్రకు ప్లాన్ చేస్తారు. ఇష్టమైన బంధువులతో శుభకార్యంలో పాల్గొంటారు. ఉద్యోగ, వివాహ ప్రయత్నాల్లో సానుకూల స్పందన లభిస్తుంది. స్వల్ప అనారోగ్య సూచనలు న్నాయి.

కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)

వృత్తి, వ్యాపారాల్లో శ్రమ, ఒత్తిడి ఉన్నప్పటికీ, ప్రతిఫలం ఉంటుంది. కొద్దిపాటి వ్యయ ప్రయాసలతో ముఖ్యమైన కార్యకలాపాలు పూర్తవుతాయి. కుటుంబ సభ్యులతో మాట పట్టింపులు వచ్చే సూచనలు ఉన్నాయి. ఆహార, విహారాల్లో జాగ్రత్తగా ఉండడం మంచిది. రాదనుకున్న డబ్బు చేతికి వస్తుంది. మొండి బాకీలు వసూలు అవుతాయి. ఆర్థిక పరిస్థితి బాగా మెరుగుపడుతుంది. ఇతరులకు ఆర్థికంగా సహాయం చేస్తారు. నిరుద్యోగులకు దూర ప్రాంతం నుంచి ఆఫర్ వస్తుంది.

మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)

వృత్తి, ఉద్యోగాల్లో బాధ్యతలు బాగా పెరిగే అవకాశం ఉంది. అధికారులకు అండగా ఉంటారు. వ్యాపారంలో ఆశించిన స్థాయిలో లాభాలు పెరుగుతాయి. ఆర్థిక పరిస్థితికి ఢోకా ఉండదు. ఆరోగ్యం బాగానే ఉంటుంది. కొన్ని వ్యక్తిగత పనుల మీద ఎక్కువగా తిరగాల్సి వస్తుంది. నిరుద్యోగులకు మంచి ఆఫర్లు అందివస్తాయి. పరిచయస్థులలో వివాహ సంబంధం కుదిరే సూచనలున్నాయి. బంధువు లతో మాట పట్టింపులు రాకుండా చూసుకోవాలి. పిల్లలు చదువుల్లో వృద్ధిలోకి వస్తారు.

ప్రాణం మీదకు తెచ్చిన ఫ్లెక్సీ.. ముగ్గురు మృతి!
ప్రాణం మీదకు తెచ్చిన ఫ్లెక్సీ.. ముగ్గురు మృతి!
పొట్టకొవ్వును కరిగించే 3 సాధారణ చిట్కాలు.. బెస్ట్ రిజల్ట్ మీసొంతం
పొట్టకొవ్వును కరిగించే 3 సాధారణ చిట్కాలు.. బెస్ట్ రిజల్ట్ మీసొంతం
మ్యాచ్ ఉందని పిలిస్తే.. ఆడటానికి వెళ్లాడు.. పాపం గ్రౌండ్‌లోనే
మ్యాచ్ ఉందని పిలిస్తే.. ఆడటానికి వెళ్లాడు.. పాపం గ్రౌండ్‌లోనే
ఓర్నీ.. నోరూరించే మ్యాంగో.. ఇప్పుడు కూడా అందుబాటులో..
ఓర్నీ.. నోరూరించే మ్యాంగో.. ఇప్పుడు కూడా అందుబాటులో..
చేదు జ్ఞాపకాల సునామీకి 20 ఏళ్లు..!
చేదు జ్ఞాపకాల సునామీకి 20 ఏళ్లు..!
బాక్సింగ్ డే టెస్ట్: కోహ్లీ కమ్ బ్యాక్ ఇన్నింగ్స్ కోసం వెయిటింగ్
బాక్సింగ్ డే టెస్ట్: కోహ్లీ కమ్ బ్యాక్ ఇన్నింగ్స్ కోసం వెయిటింగ్
మెల్‌బోర్న్ టెస్ట్ మ్యాచ్‌లో మారిన టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్?
మెల్‌బోర్న్ టెస్ట్ మ్యాచ్‌లో మారిన టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్?
కుంభమేళాకి భారీ ఏర్పాట్లు ఫస్ట్ టైం అండర్‌వాటర్‌ డ్రోన్ల వినియోగం
కుంభమేళాకి భారీ ఏర్పాట్లు ఫస్ట్ టైం అండర్‌వాటర్‌ డ్రోన్ల వినియోగం
ఈ సీజన్‌లో పండ్లు, కూరగాయలు చేర్చుకోండి శరీరంలో నీటి కొరత ఉండదు
ఈ సీజన్‌లో పండ్లు, కూరగాయలు చేర్చుకోండి శరీరంలో నీటి కొరత ఉండదు
నిత్య పెళ్లి కూతురు ఖతర్నాక్ స్కెచ్.. ఏడో పెళ్లిలో గుట్టురట్టు..!
నిత్య పెళ్లి కూతురు ఖతర్నాక్ స్కెచ్.. ఏడో పెళ్లిలో గుట్టురట్టు..!