Malefic Planets: అనుకూల ఫలితాలు ఇవ్వనున్న పాపగ్రహాలు.. ఆ రాశుల వారికి శుభ యోగాలు పక్కా!

గురు, శుక్ర, బుధ గ్రహాలు అనుకూలంగా ఉన్నప్పుడే శుభ యోగాలు చోటు చేసుకోవడం, అదృష్టం పట్టడం వంటివి జరుగుతాయి. పాప గ్రహాలైన శనీశ్వరుడు, కుజుడు, రవి, రాహువు గ్రహాలు అనుకూలంగా వ్యవహరించడమనేది అరుదుగా జరుగుతుంటుంది. ఈ పాప గ్రహాలన్నీ శుభ ఫలితాలివ్వడం వల్ల ఆరు రాశుల వారికి నవంబర్ చివరి వారం నుంచి డిసెంబర్ ఆఖరు వరకు మంచి శుభ యోగాలు అనుభవానికి రాబోతున్నాయి.

Malefic Planets: అనుకూల ఫలితాలు ఇవ్వనున్న పాపగ్రహాలు.. ఆ రాశుల వారికి శుభ యోగాలు పక్కా!
Malefic Planets In Astrology
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By: Janardhan Veluru

Updated on: Nov 23, 2023 | 7:08 PM

సాధారణంగా శుభ గ్రహాలు మాత్రమే అనుకూలంగా ఉంటాయి. అంటే, గురు, శుక్ర, బుధ గ్రహాలు అనుకూలంగా ఉన్నప్పుడే శుభ యోగాలు చోటు చేసుకోవడం, అదృష్టం పట్టడం వంటివి జరుగుతాయి. పాప గ్రహాలైన శనీశ్వరుడు, కుజుడు, రవి, రాహువు గ్రహాలు అనుకూలంగా వ్యవహరించడమనేది అరుదుగా జరుగుతుంటుంది. ఈ పాప గ్రహాలన్నీ శుభ ఫలితాలివ్వడం వల్ల ఆరు రాశుల వారికి నవంబర్ చివరి వారం నుంచి డిసెంబర్ ఆఖరు వరకు మంచి శుభ యోగాలు అనుభవానికి రాబోతున్నాయి. అవిః వృషభం, మిథునం, కన్య, తుల, మకరం, కుంభం. ఇప్పుడు చోటు చేసుకునే ఈ శుభ ఫలితాల ప్రభావం ఎక్కువ కాలం ఉండబోవడం మరో విశేషం. ఈ ఆరు రాశుల్లో ఏయే రాశుల వారికి ఏ విధంగా కలిసి వచ్చేదీ ఇక్కడ పరిశీలిద్దాం.

  1. వృషభం: ఈ రాశివారికి దశమ కేంద్రంలో శనీశ్వరుడు స్వస్థానంలో సంచారం చేస్తుండడం, సప్తమ స్థానంలో రవి, కుజులు ప్రవేశించడంతో పాటు లాభ స్థానంలో రాహు సంచారం కూడా బాగా అనుకూలంగా ఉంది. ఫలితంగా ఉద్యోగ, లాభస్థానాలు బలపడి వృత్తి, ఉద్యోగాలపరంగా అనేక శుభ యోగాలు కలగజేసే అవకాశం ఉంది. సప్తమ స్థానంలో రవి, కుజులు కలవడం వల్ల తప్పకుండా అధికార యోగం పడుతుంది. గతంలో ఎన్నడూ లేనంతగా బాగా ఆదాయం కలిసి వచ్చే అవకాశం ఉంటుంది.
  2. మిథునం: ఈ రాశివారికి భాగ్య స్థానంలో ఉన్న భాగ్యాధిపతి శనీశ్వరుడు, దశమ స్థానంలో ఉన్న రాహువు తప్పకుండా ఒకటి రెండు శుభ యోగాలు కలగజేసే అవకాశం ఉంది. వృత్తి, ఉద్యోగాలలోనే కాక, సామాజికంగా కూడా ప్రాధాన్యం, ప్రాభవం పెరుగుతాయి. ఇక ఆరవ స్థానంలో సంచరిస్తున్న రవి, కుజుల వల్ల మహా భాగ్య యోగం, విపరీత రాజయోగం పడతాయి. శత్రు, రోగ, రుణ బాధల నుంచి ఆశించిన దాని కంటే ఎక్కువగా ఉపశమనం లభిస్తుంది. ఆదాయ ప్రయత్నాలన్నీ సక్సెస్ అవుతాయి.
  3. కన్య: ఈ రాశికి ఆరవ స్థానంలో ఉన్న శనీశ్వరుడు తప్పకుండా రాజయోగం కలిగిస్తాడు. వృత్తి, ఉద్యో గాల్లో ఎవరెంత అడ్డుపడినప్పటికీ ప్రమోషన్లు లేదా అధికారం తప్పకపోవచ్చు. వ్యాపారాల్లో సైతం ఊహించని పురోగతి ఉంటుంది. మనసులోని కోరికలు నెరవేరుతాయి. ఇక మూడవ స్థానంలో రవి, కుజులు ఉండడం వల్ల ఏ ప్రయత్నం తలపెట్టినా, ఏ పని ప్రారంభించినా అతి తేలికగా విజయాలు సిద్ధిస్తాయి. ఉద్యోగ స్థిరత్వంతో పాటు ఆర్థిక స్థిరత్వం కూడా లభించే అవకాశం ఉంది.
  4. తుల: ఈ రాశికి ఆరవ స్థానంలో రాహువు, అయిదవ స్థానంలో శనీశ్వరుడు, ద్వితీయ స్థానంలో రవి, కుజులు సంచారం చేస్తున్నందువల్ల మహా భాగ్య యోగం పట్టింది. ఈ రాశివారికి పట్టిందల్లా బంగారం అవుతుంది. ఏ ప్రయత్నం తలపెట్టినా విజయవంతం అవుతుంది. జీవితం నల్లేరు మీద బండిలా సాగిపోతుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో ఆదాయం పెరగడంతో పాటు, ఆకస్మిక ధన లాభానికి కూడా అవకాశం ఉంది. కుటుంబంలో ఎటువంటి సమస్యలున్నా పరిష్కారం అవుతాయి.
  5. మకరం: ఈ రాశికి ధన స్థానంలో రాశ్యధిపతి శనీశ్వరుడు సంచరించడం, రాహువు తృతీయ స్థానంలో ఉండడం, లాభ స్థానంలో రవి, కుజులు ప్రవేశించడం వల్ల జీవితంలో ఊహించని శుభ పరిణామాలు చోటుచేసుకునే వీలుంది. వృత్తి, ఉద్యోగాల్లో ప్రతిభా పాటవాలు బాగా వెలుగులోకి వస్తాయి. సామాజికంగా మంచి గుర్తింపు లభిస్తుంది. ఆదాయానికి లోటుండదు. ఆదాయ మార్గాలు కలిసి వస్తాయి. వ్యక్తిగతంగా కూడా డిమాండ్ పెరుగుతుంది. వ్యక్తిగత సమస్యలు పరిష్కారం అవుతాయి.
  6. కుంభం: ఈ రాశివారికి రాశిలో సంచారం చేస్తున్న శనీశ్వరుడి వల్ల ఏలిన్నాటి శని ఫలితాల కంటే శుభ యోగాలే ఎక్కువగా అనుభవానికి వస్తాయి. ధన స్థానంలో ఉన్న రాహువు, దశమ స్థానంలో ఉన్న రవి, కుజుల వల్ల వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల పరంగా ధనాదాయం బాగా పెరిగే అవకాశం ఉంది. ఆర్థికంగా ఆశించిన స్థాయిలో స్థిరత్వం లభిస్తుంది. అనేక మార్గాలలో ఆదాయం పెరుగు తుంది. సమాజంలో మీ మాటకు, చేతకు విలువ పెరుగుతుంది. మనసులోని కోరికలు నెరవేరుతాయి.