Horoscope Today: వారికి ఆకస్మిక ధన లాభానికి అవకాశం ఉంది.. 12 రాశుల వారికి శుక్రవారంనాటి రాశిఫలాలు..

దిన ఫలాలు (నవంబర్ 24, 2023): మేష రాశి వారికి చేపట్టిన పనులు చురుకుగా ముందుకు సాగుతాయి. వృషభ రాశి వారి ఆర్థిక పరిస్థితి చాలావరకు అనుకూలంగా ఉంటుంది. మంచి పరిచయాలు ఏర్పడతాయి. మిథున రాశి వారికి వృత్తి, ఉద్యోగాలు సాఫీగా సాగిపోతాయి. ముఖ్యంగా ఉద్యోగాల్లో ప్రాధాన్యం పెరుగుతుంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి శుక్రవారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..

Horoscope Today: వారికి ఆకస్మిక ధన లాభానికి అవకాశం ఉంది.. 12 రాశుల వారికి శుక్రవారంనాటి రాశిఫలాలు..
Horoscope Today 24th November 2023
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By: TV9 Telugu

Updated on: Nov 24, 2023 | 12:51 PM

దిన ఫలాలు (నవంబర్ 24, 2023): మేష రాశి వారికి చేపట్టిన పనులు చురుకుగా ముందుకు సాగుతాయి. వృషభ రాశి వారి ఆర్థిక పరిస్థితి చాలావరకు అనుకూలంగా ఉంటుంది. మంచి పరిచయాలు ఏర్పడతాయి. మిథున రాశి వారికి వృత్తి, ఉద్యోగాలు సాఫీగా సాగిపోతాయి. ముఖ్యంగా ఉద్యోగాల్లో ప్రాధాన్యం పెరుగుతుంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి శుక్రవారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..

మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)

చేపట్టిన పనులు చురుకుగా ముందుకు సాగుతాయి. ఆదాఝం నిలకడగా ఉంటుంది కానీ వృథా ఖర్చులు పెరుగుతాయి. ఉద్యోగ, వివాహ ప్రయత్నాలకు సానుకూల స్పందన లభిస్తుంది. ఆధ్యా త్మిక చింతన పెరుగుతుంది. వృత్తి, ఉద్యోగాలు ప్రశాంతంగా, ఆశాజనకంగా కొనసాగుతాయి. వ్యాపా రాల్లో లాభాలు పెరుగుతాయి. కొ్ందరు బంధువులకు అండగా నిలబడతారు. మంచి వ్యక్తులు పరిచయం అవుతారు. ఒకటి రెండు వ్యక్తిగత సమస్యలు పరిష్కారం అవుతాయి. ఆరోగ్యం పరవా లేదు.

వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)

ఆర్థిక పరిస్థితి చాలావరకు అనుకూలంగా ఉంటుంది. మంచి పరిచయాలు ఏర్పడతాయి. చేపట్టిన పనులలో పురోగతి సాధిస్తారు. బంధువుల నుంచి శుభవార్తలు అందుతాయి. వ్యాపారాలు లాభ సాటిగా సాగిపోతాయి. ఉద్యోగాల పరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది. ఇతరులకు సహాయం అంది స్తారు. కొందరు మిత్రుల బాధ్యతలను నెత్తిన వేసుకోకపోవడం మంచిది. సతీమణి నుంచి సహాయసహకారాలు ఉంటాయి. పిల్లల నుంచి ఆశించిన సమాచారం అందుతుంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది.

మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)

వృత్తి, ఉద్యోగాలు సాఫీగా సాగిపోతాయి. ముఖ్యంగా ఉద్యోగాల్లో ప్రాధాన్యం పెరుగుతుంది. ఇంటా బయటా అనుకూల వాతావరణం ఉంటుంది. ఆర్థిక లావాదేవీలు, స్పెక్యులేషన్ లాభిస్తాయి. డాక్టర్లు, లాయర్లు తదితర వృత్తుల వారికి అంచనాలకు మించి సంపాదన పెరుగుతుంది. ముఖ్య మైన ప్రయత్నాలు విజయవంతంగా నెరవేరుతాయి. కుటుంబ సభ్యులతో ఆలయాలను సందర్శి స్తారు. వ్యాపారాలు పుంజుకుంటాయి. ఒకటి రెండు తొందరపాటు నిర్ణయాల వల్ల ఇబ్బంది పడతారు.

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)

మనసులోని కోరికలు నెరవేరుతాయి. రోజంతా ప్రశాంతంగా గడిచిపోతుంది. వృత్తి, ఉద్యోగాలు సానుకూలంగా సాగిపోతాయి కానీ, అధికారులతో కాస్తంత ఆచితూచి వ్యవహరించడం మంచిది. ముఖ్యమైన వ్యవహారాలు అనుకూలంగా పూర్తవుతాయి. ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. వ్యక్తిగతంగా ఒకటి రెండు కీలక సమస్యల నుంచి బయటపడతారు. వృత్తి, వ్యాపారాల్లో మంచి అభివృద్ధి ఉంటుంది. ఉద్యోగంలో పనితీరుతో అందరినీ ఆకట్టుకుంటారు. ఆరోగ్యం బాగానే ఉంటుంది.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)

వృత్తి, ఉద్యోగాల్లో సానుకూల వాతావరణం ఉంటుంది. అధికారుల నుంచి ఆదరణ లభిస్తుంది. కొత్త ప్రోత్సాహకాలు అందుకుంటారు. వ్యాపారాల్లో ఆశించిన స్థాయిలో పురోగతి ఉంటుంది. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఆస్తి వివాదాలు ఒక కొలిక్కి వస్తాయి. ఆర్థిక పరిస్థితి బాగానే మెరుగుపడుతుంది. రావలసిన డబ్బు చేతికి అందుతుంది. ఇంటా బయటా పరిస్థితులు అను కూలంగా ఉంటాయి. సతీమణితో కలిసి వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది.

కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)

వృత్తి, ఉద్యోగాల్లో కొద్దిపాటి సమస్యలు ఉండవచ్చు. కొన్ని పొరపాట్లు జరిగే అవకాశం ఉంది. వ్యాపారాలు లాభసాటిగా ముందుకు సాగుతాయి. ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా సాగుతుంది. ముఖ్యమైన అవసరాలు తీరిపోతాయి. తోబుట్టువులతో సఖ్యత పెరుగుతుంది. చేపట్టిన పనుల్లో విజయం సాధిస్తారు. కొందరు ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్ర మాల్లో పాల్గొంటారు. గృహ, వాహన సౌకర్యాలకు ప్లాన్ చేస్తారు. ఆరోగ్యానికి ఇబ్బందేమీ ఉండదు.

తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)

ఆదాయ ప్రయత్నాలు కలసి వస్తాయి. ఇంటా బయటా కాస్తంత ఒత్తిడి ఉండే అవకాశం ఉంది. సంపాదనలో సహోద్యోగుల కంటే ముందడుగు వేస్తారు. బంధువులలో ఒకరికి ఆర్థిక సహాయం చేయాల్సి వస్తుంది. వృత్తి జీవితంలో క్షణం కూడా తీరిక లేని పరిస్థితి ఏర్పడుతుంది. వ్యాపారాల్లో కొత్త ఆలోచనలు ప్రవేశపెట్టి, ఆశించిన ప్రయోజనాలు పొందుతారు. ఉద్యోగ జీవితం ఉత్సాహంగా, ఉల్లాసంగా సాగిపోతుంది. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు.

వృశ్చికం (విశాఖ, అనూరాధ, జ్యేష్ట)

వ్యయ ప్రయాసలతో కొన్ని ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు. ఆదాయం నిలకడగా ఉంటుంది కానీ, ఖర్చులు బాగా పెరుగుతాయి. కుటుంబ వ్యవహారాల్లో సతీమణితో సంప్రదించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది. వృత్తి, వ్యాపారాలలో అంచనాలకు మించి లాభాలు అందుకుంటారు. నిరు ద్యోగులకు కొత్త ఆఫర్లు అంది వస్తాయి. పెళ్లి ప్రయత్నాలలో సానుకూల స్పందన లభిస్తుంది. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు చాలావరకు అనుకూలిస్తాయి. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండడం మంచిది.

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)

ఆర్థిక లావాదేవీలు ఉత్సాహం కలిగిస్తాయి. బంధువులతో విభేదాలు తొలగిపోతాయి. చేపట్టిన పనులు వేగంగా పూర్తవుతాయి. కుటుంబ సభ్యులతో కలిసి దైవ కార్యాల్లో పాల్గొంటారు. వృత్తి, ఉద్యోగాల్లో దూసుకు పోతారు. వ్యాపారాల్లో ఆశించిన ధన లాభం ఉంటుంది. అదనపు సంపాద నకు కూడా బాగా అవకాశం ఉంది. వ్యాపారాలు ఆశాజనకంగా ముందుకు వెడతాయి. ఆరోగ్యం పరవాలేదనిపిస్తుంది. అనుకోకుండా ఒకటి రెండు వ్యక్తిగత సమస్యలు పరిష్కారం అవుతాయి.

మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2)

ముఖ్యమైన వ్యవహారాలను, పనులను విజయవంతంగా పూర్తి చేసి కొత్త పనులు చేపడతారు. ఆర్థిక ప్రయత్నాల్లో చురుకుగా ముందుకు సాగుతాయి. ఆకస్మిక ధన లాభానికి అవకాశం ఉంది. వృత్తి, ఉద్యోగాలు మరింత ఉత్సాహవంతంగా సాగుతాయి. ఉద్యోగంలో ప్రోత్సాహకాలు, ప్రతిఫలాలు ఉంటాయి. వ్యాపారాలలో కార్యకలాపాలు బాగా పెరుగుతాయి. ఒకటి రెండు లావాదేవీలు అంచనాలకు మించిన సత్ఫలితాలనిస్తాయి. ఆరోగ్యం విషయంలో కాస్తంత జాగ్రత్తగా ఉండడం మంచిది.

కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)

ముఖ్యమైన వ్యవహారాల్లో అవాంతరాలు తప్పకపోవచ్చు. ఆకస్మిక ప్రయాణ సూచనలున్నాయి. వృథా ఖర్చులకు కళ్లెం వేయడం మంచిది. కుటుంబ సభ్యులతో సరదాగా కాలక్షేపం చేస్తారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. వ్యాపారాలు, ఉద్యోగాలలో ధనాదాయం పెరిగే అవకాశం ఉంది. ఆరోగ్యానికి ఇబ్బందేమీ ఉండదు. కుటుంబ సభ్యుల సహ కారంతో పెండింగ్ పనులన్నిటినీ పూర్తి చేయగలుగుతారు. ఉద్యోగ, వివాహ ప్రయత్నాల్లో ఆశిం చిన సానుకూల స్పందన లభిస్తుంది.

మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)

వృత్తి సంబంధమైన పనులనే కాక, సొంత పనులను కూడా ఉత్సాహంగా పూర్తి చేస్తారు. ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా ముందుకు సాగుతాయి. కుటుంబ వ్యవహారాల్లో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. బంధుమిత్రుల నుంచి ఆశించిన ఆహ్వానాలు అందుతాయి. స్థిరాస్తి వ్యవహారాల్లో ప్రయోజనాలు పొందుతారు. ఉద్యోగ వాతావరణం చాలావరకు అనుకూలంగా ఉంటుంది. కొందరిని అతిగా నమ్మడం వల్ల డబ్బు నష్టపోయే అవకాశం ఉంది. స్వల్ప అనారోగ్య సమస్యలుంటాయి.