Zodiac Signs: కీలక గ్రహాల సానుకూలత.. ఆ రాశుల వారికి త్వరలో కష్టనష్టాల నుంచి విముక్తి..!
సాధారణంగా ప్రతి వ్యక్తీ ఏదో ఒక సమస్యతో అవస్థలు పడుతుంటాడు. డబ్బు రావడం, ప్రమోషన్లు లభించడం వంటి విషయాలను పక్కనపెట్టి మౌలికంగా కొన్ని కష్టనష్టాల నుంచి, సమస్యల నుంచి సమీప భవిష్యత్తులో బయటపడడం ఎలా అన్నదే వారికి ప్రధానమైపోతుంది. జాతకపరంగా ఇటువంటి కష్టనష్టాల్లో ఉన్నవారు వీటి నుంచి బయటపడతారా లేదా అన్నది గ్రహ సంచారాన్ని బట్టి తెలుసుకోవచ్చు.

zodiac signs
సాధారణంగా ప్రతి వ్యక్తీ ఏదో ఒక సమస్యతో అవస్థలు పడుతుంటాడు. డబ్బు రావడం, ప్రమోషన్లు లభించడం వంటి విషయాలను పక్కనపెట్టి మౌలికంగా కొన్ని కష్టనష్టాల నుంచి, సమస్యల నుంచి సమీప భవిష్యత్తులో బయటపడడం ఎలా అన్నదే వారికి ప్రధానమైపోతుంది. జాతకపరంగా ఇటువంటి కష్టనష్టాల్లో ఉన్నవారు వీటి నుంచి బయటపడతారా లేదా అన్నది గ్రహ సంచారాన్ని బట్టి తెలుసుకోవచ్చు. కొంత ఆ రాశుల తత్వాన్ని బట్టి కూడా ఆధారపడి ఉంటుంది. ఈ ఏడాది అయిదు రాశుల వారు ప్రధాన కష్టనష్టాల భారం నుంచి, ఒత్తిడి నుంచి బయటపడే అవకాశం ఉంది. ఇందులో మేషం, వృషభం, సింహం, కుంభ రాశులవారున్నారు. వారు ఏ విధంగా వీటి నుంచి బయటపడగలుగుతారన్నది ఇక్కడ పరిశీలిద్దాం.
- మేషం: నిర్భయంగా, ధైర్యంగా ఉండే మేష రాశివారు సాధారణంగా సమస్యలను ఎదుర్కుంటారే తప్ప వాటి నుంచి పారిపోయే ప్రయత్నం చేయరు. ఈ రాశిలో ప్రస్తుతం రవి, శుక్రులు ఉన్నందువల్ల, ద్వితీయ స్థానంలో గురు సంచారం వల్ల ఈ రాశివారు కొత్త పథకాలు, వ్యూహాలతో ఆర్థిక సమస్యలను పరిష్కరించుకుంటారు. కొద్దిగా ఆలస్యంగానే అయినా వృత్తి, ఉద్యోగాల్లో ఆశించిన స్థానాలను అందుకుంటారు. నమ్మక ద్రోహం చేసిన వారి మీద ప్రతీకారం తీర్చుకునే అవకాశం కూడా ఉంది.
- వృషభం: ఒక పద్ధతి ప్రకారం, ప్రణాళిక ప్రకారం వ్యవహరించే ఈ రాశివారికి మే మధ్య నుంచి కొన్ని సమ స్యలు, కష్టనష్టాల నుంచి విముక్తి లభిస్తుంది. ద్రోహం చేసిన బంధుమిత్రులెవరన్నది తెలుసుకుని వారిని దూరం పెట్టడం జరుగుతుంది. హామీల ద్వారా నష్టపోయిన సొమ్మును రాబట్టుకోవడం జరుగుతుంది. వృత్తి, ఉద్యోగాల్లోనే కాక, వ్యాపారాల్లో తమను ఇబ్బంది పెడుతున్న వారి మీద కొద్ది ప్రయత్నంతో విజయం సాదించే అవకాశం ఉంది. అవమానాలకు జవాబు చెప్పడం జరుగుతుంది.
- సింహం: నువ్వు నా జోలికి రావద్దు, నేను నీ జోలికి రాను అనే తత్వం కలిగి ఉండే సింహ రాశివారికి గురు, రవుల బలం కారణంగా ఒక ప్రణాళిక ప్రకారం ఆర్థిక సమస్యల నుంచి బయటపడే సూచనలున్నాయి. ఆర్థికంగా తనను మోసం చేసిన వ్యక్తుల మీద విజయం సాధించడం జరుగుతుంది. ఆస్తి వ్యవహారాల్లోనూ, ఆర్థికపరంగానూ తాము ఇంత కాలం నుంచి అనుభవిస్తున్న కష్టనష్టాల నుంచి వీరు కొద్ది ప్రయత్నంతో త్వరలో బయటపడడానికి, కొత్త జీవితం ప్రారంభించడానికి అవకాశముంది.
- వృశ్చికం: సుఖ సంతోషాలకు సంబంధించిన స్థానంలో శని సంచారం చేస్తున్నందువల్ల, ఈ రాశివారు అనేక విధాలుగా నష్టపోవడం జరుగుతుంది. ఆస్తి విషయంలో, జీతభత్యాల విషయంలో, కొంత కుటుంబ పరంగా ఈ రాశివారు పడుతున్న కష్ట నష్టాల నుంచి బయటపడడానికి అవకాశముంది. సప్త మంలో గురు గ్రహం సంచారం వల్ల జీవితంలో సానుకూల మార్పులు చోటు చేసుకోవడం ప్రారంభం అవుతుంది. ఆర్థిక, కుటుంబ, ఆస్తి విషయాలు త్వరలో తప్పకుండా చక్కబడతాయి.
- కుంభం: కిందపడ్డా విజయం నాదేనన్నట్టుగా వ్యవహరించే ఈ రాశివారిని ఏలిన్నాటి శని ప్రభావం వల్ల ప్రతివారూ ఏదో రూపేణా మోసగించడం, అతిగా ఉపయోగించుకోవడం జరుగుతుంటుంది. ప్రస్తుతం ఈ రాశివారికి శుభ గ్రహాలు అనుకూలంగా ఉంటున్నందువల్ల, దెబ్బకు దెబ్బ అన్న ట్టుగా వ్యవహరించడం ప్రారంభమవుతుంది. ఆర్థిక సమస్యల నుంచి క్రమంగా బయటపడడం, సొంత బలాన్ని పెంచుకోవడం వంటివి జరుగుతాయి. కుటుంబ సమస్యల నుంచి కూడా విముక్తి లభిస్తుంది.



