AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Money Astrology: గురు, శుక్రుల పరస్పర వీక్షణ.. ఆ రాశుల వారికి ఆకస్మిక భాగ్య యోగం పక్కా.. !

గురు, శుక్రుల పరస్పర వీక్షణ వల్ల కొన్ని రాశుల వారికి ఆకస్మిక భాగ్య యోగం పట్టబోతోంది. అనుకోకుండా, అకస్మాత్తుగా భాగ్యవంతులు కావడానికి బాగా అవకాశం ఉంది. కొద్ది ప్రయత్నం చేయడం, ఆర్థిక పరిస్థితి మెరుగుపరచుకునే దిశగా ఒక్క అడుగైనా వేయడం వంటివి అంచనాలకు మించిన సత్ఫలితాలనిస్తాయి. ఈ రాశుల్లో మేషం, మిథునం, కన్య, తుల, ధనుస్సు, మకరం ఉన్నాయి. జనవరి 17లోగా తప్పకుండా వీరి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది.

Money Astrology: గురు, శుక్రుల పరస్పర వీక్షణ.. ఆ రాశుల వారికి ఆకస్మిక భాగ్య యోగం పక్కా.. !
Money Astrology
TV9 Telugu Digital Desk
| Edited By: Janardhan Veluru|

Updated on: Dec 06, 2023 | 8:37 PM

Share

గురు, శుక్రుల పరస్పర వీక్షణ వల్ల కొన్ని రాశుల వారికి ఆకస్మిక భాగ్య యోగం పట్టబోతోంది. అనుకోకుండా, అకస్మాత్తుగా భాగ్యవంతులు కావడానికి బాగా అవకాశం ఉంది. కొద్ది ప్రయత్నం చేయడం, ఆర్థిక పరిస్థితి మెరుగుపరచుకునే దిశగా ఒక్క అడుగైనా వేయడం వంటివి అంచనాలకు మించిన సత్ఫలితాలనిస్తాయి. ఈ రాశుల్లో మేషం, మిథునం, కన్య, తుల, ధనుస్సు, మకరం ఉన్నాయి. జనవరి 17లోగా తప్పకుండా వీరి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఆకస్మిక ధన లాభానికి బాగా అవకాశం ఉంది. వ్యక్తిగత జాతక చక్రం ఏమాత్రం అనుకూలంగా ఉన్నా వీరికి ఆర్థికంగా ఇక తిరుగుండదు.

  1. మేషం: ఈ రాశిలో ఉన్న గురువుతో సప్తమంలో స్వస్థానంలో ఉన్న శుక్రుడికి శుభ వీక్షణ ఏర్పడినందు వల్ల ఈ రాశివారికి లక్ష్మీదేవి అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది. దాదాపు ప్రతి ఆర్థిక ప్రయ త్నమూ సఫలం అవుతుంది. ఆస్తిపాస్తులు కలిసి వస్తాయి. ఆస్తి విలువ పెరుగుతుంది. ఆస్తి వివాదాలు పరిష్కారం అవుతాయి. అదనపు ఆదాయ ప్రయత్నాల వల్ల అంచనాలకు మించిన లాభం కలుగుతుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో ఆదాయం, రాబడి కూడా బాగా పెరిగే సూచనలున్నాయి.
  2. మిథునం: ఈ రెండు గ్రహాల పరస్పర వీక్షణ వల్ల ఈ రాశివారికి లాభ స్థానం బాగా బలోపేతం అయింది. దీనివల్ల దాదాపు పట్టుకున్నదల్లా బంగారం అవుతుంది. ప్రతి ఆర్థిక ప్రయత్నమూ, ప్రతి ఆర్థిక వ్యవహారమూ కలిసి వస్తుంది. కుటుంబపరంగా కూడా ఆదాయ వృద్ధి ఉంటుంది. అనేక విధాలుగా ఆదాయం పెరుగుతుంది. తల్లితండ్రుల నుంచి ఆస్తి కలిసి రావడం, ఆస్తి వివాదాలు సానుకూలంగా పరిష్కారం కావడం జరుగుతుంది. వృత్తి, ఉద్యోగాలపరంగా రాబడి మూడు నాలుగు రెట్లు పెరుగుతుంది.
  3. కన్య: ఈ రాశివారికి ధన స్థానం మీద శుభ గ్రహాల దృష్టి పడడంతో పాటు, సుఖ స్థానంలో రాశ్యధిపతి బుధుడు ఉండడం వల్ల ఆస్తుల విలువ బాగా పెరిగి, భూ సంబంధమైన స్థిరాస్తుల క్రయ విక్ర యాల్లో లాభాలు పండించుకుని ఐశ్వర్యవంతులయ్యే అవకాశం ఉంది. గృహ యోగం ఏర్పడు తుంది. రాజకీయాలు, రియల్ ఎస్టేట్, మద్యం తదితర వ్యాపారాల్లో రాబడి బాగా పెరిగే అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాలు బాగా అనుకూలంగా మారతాయి. ఉద్యోగంలో జీతభత్యాలు పెరుగుతాయి.
  4. తుల: ఈ రాశిలో ఉన్న శుక్రుడితో సప్తమంలో ఉన్న గురువుకు శుభ వీక్షణ ఏర్పడడం వల్ల తప్ప కుండా ఆకస్మిక ధన ప్రాప్తి కలుగుతుంది. లాటరీలు, జూదాలు, స్పెక్యులేషన్, షేర్లు వంటివి దాదాపు కనక వర్షం కురిపిస్తాయి. ఏ ప్రయత్నం తలపెట్టినా విజయవంతం అయి, ఆర్థికంగా లాభం చేకూరుతుంది. కొత్తవారితో వ్యాపారం ప్రారంభించి లబ్ధి పొందే అవకాశం కూడా ఉంది. వృత్తి, ఉద్యోగాల్లో అదనపు సంపాదనకు అవకాశం ఏర్పడుతుంది. లాభదాయక పరిచయాలు ఏర్పడతాయి.
  5. ధనుస్సు: ఈ రాశికి అధిపతి అయిన గురువు పంచమంలో ఉండి, లాభస్థానంలో ఉన్న శుక్రుడితో శుభ వీక్షణ కలిగి ఉండడం వల్ల తప్పకుండా వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో ఆర్థికంగా ఉన్నత స్థానానికి చేరే అవకాశం ఉంది. ఈ రాశివారికి ఆస్తి విలువ పెరుగుతుంది. తండ్రి వైపు నుంచి ఆస్తి కలిసి వస్తుంది. మొత్తం మీద ఆదాయం పెరిగి, జీవితాంతం సుఖపడడానికి మార్గం సుగమం అవు తుంది. జీవిత భాగస్వామికి కూడా వృత్తి, ఉద్యోగాల్లో జీతభత్యాలు, రాబడి పెరిగే సూచనలున్నాయి.
  6. మకరం: ఈ రాశివారికి చతుర్థ, దశమ స్థానాల్లో గురు, శుక్ర వీక్షణ ఏర్పడడంతో పాటు లాభ స్థానంలో రవి, కుజుల యుతి కూడా కొనసాగుతున్నందువల్ల ఆర్థిక పరిస్థితి, ఆదాయ పరిస్థితి గణనీయంగా పెరుగుతుంది. ఆర్థికపరంగా జీవితం చాలావరకు మారిపోతుంది. బాగా ఆదాయాన్నిచ్చే సరికొత్త ఆదాయ మార్గాలు అందివస్తాయి. రావలసిన డబ్బు చేతికి అందుతుంది. ఆస్తి కలిసి వస్తుంది. పెట్టుబడులు, మదుపులకు తగిన ప్రతిఫలం లభిస్తుంది. సతీమణికి కూడా ఆదాయ వృద్ధి ఉంటుంది.