Job Astrology: కీలక గ్రహాల ప్రభావం.. ఈ రాశుల వారికి స్వదేశంలోనే మంచి ఉద్యోగాలు..!

ఉద్యోగ కారకుడు శనీశ్వరుడు అనుకూలంగా ఉన్నా, శుభ గ్రహాలు అనుకూలంగా ఉన్నా విదేశీ సంబంధమైన యోగాలు ఏర్పడతాయి. ప్రస్తుతం శనీశ్వరుడు స్వస్థానమైన కుంభ రాశిలో ఉండడం, గురు, శుక్రులు వృషభ రాశిలో సంచారం చేస్తుండడం వంటి కారణాల వల్ల నిరుద్యోగులకు స్వదేశంలోనే మంచి ఉద్యోగం లభించే అవకాశం ఉంది.

Job Astrology: కీలక గ్రహాల ప్రభావం.. ఈ రాశుల వారికి స్వదేశంలోనే మంచి ఉద్యోగాలు..!
Job Astrology 2024
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By: Janardhan Veluru

Updated on: May 24, 2024 | 6:32 PM

ఉద్యోగ కారకుడు శనీశ్వరుడు అనుకూలంగా ఉన్నా, శుభ గ్రహాలు అనుకూలంగా ఉన్నా విదేశీ సంబంధమైన యోగాలు ఏర్పడతాయి. ప్రస్తుతం శనీశ్వరుడు స్వస్థానమైన కుంభ రాశిలో ఉండడం, గురు, శుక్రులు వృషభ రాశిలో సంచారం చేస్తుండడం వంటి కారణాల వల్ల నిరుద్యోగులకు స్వదేశంలోనే మంచి ఉద్యోగం లభించే అవకాశం ఉంది. వృషభ, కుంభ రాశులు స్థిర రాశులైనందువల్ల స్వదేశీ ఉద్యోగాల్లో చేరే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. స్థిర రాశులైన వృషభం, సింహం, వృశ్చికం, కుంభ రాశులతో పాటు, ద్విస్వభావ రాశులైన కన్య, ధనుస్సు రాశుల వారికి కూడా స్వదేశీ ఉద్యోగాలే కలిసి వస్తాయి. వచ్చే ఏడాది మే వరకూ గురువు, శని స్థిర రాశుల్లోనే సంచారం చేస్తున్నందువల్ల ఈ రాశులకు విదేశీ ఉద్యోగావకాశాలకన్నా స్వదేశీ ఉద్యోగావకాశాలు ఎక్కువగా ఉంటాయి.

  1. వృషభం: ఈ రాశి స్థిర రాశి కావడం, ఉద్యోగ స్థానాధిపతి, ఉద్యోగ కారకుడు అయిన శనీశ్వరుడు స్థిర రాశి లోనే ఉండడం వల్ల వీరికి స్వదేశంలో తప్ప విదేశాల్లో ఉద్యోగం లభించే అవకాశం ఉండదు. సాధా రణంగా స్థాన చలనాలకు, ఉద్యోగం మారడానికి కూడా అవకాశం ఉండకపోవచ్చు. ఈ రాశివారు ఓ ఏడాది పాటు స్వదేశంలోనే ఉద్యోగ ప్రయత్నాలు చేయడం వల్ల ఉపయోగం ఉంటుంది. ఇప్పటికే విదేశాల్లో ఉద్యోగం చేసుకుంటున్నవారు మాత్రం అక్కడే స్థిరపడే అవకాశం కనిపిస్తోంది.
  2. సింహం: ఈ రాశివారికి ఉద్యోగ కారకుడు శని సప్తమ స్థానంలో స్థిర రాశిలో సంచారం చేస్తుండడం, దశమ స్థానం కూడా స్థిర రాశే కావడం, ఆ రాశిలో గురు, శుక్రులు సంచారం చేస్తుండడం వల్ల, ఈ రాశి వారు తప్పకుండా స్వదేశంలోనే, సొంత ఊర్లోనే మంచి ఉద్యోగం సంపాదించుకునే సూచనలు న్నాయి. కొద్ది ప్రయత్నంతో వీరు ఉద్యోగం సంపాదించుకోవడం జరుగుతుంది. అదనపు ఆదాయ మార్గాలు ఏర్పడడానికి కూడా అవకాశం ఉంది. ఉద్యోగ మూలక ధన లాభం ఎక్కువగా ఉంది.
  3. కన్య: ఉద్యోక కారకుడైన శని ఆరవ స్థానం, అంటే సేవా స్థానంలో స్థిర రాశిలో ఉండడం, భాగ్య స్థానంలో శుభ గ్రహాలైన గురు, శుక్రులు ఉండడం వల్ల ఈ రాశివారు ఉద్యోగపరంగా విదేశాలకు వెళ్లే అవ కాశం లేదు. సొంత ఊర్లోనే ఉద్యోగం లభించే అవకాశం ఉంది. సొంత ఊర్లోనే ఉద్యోగం వల్ల బాగా కలిసి వస్తుంది. ఉద్యోగరీత్యా విదేశాలకు వెళ్లి వచ్చే అవకాశం మాత్రమే కనిపిస్తోంది. సాధారణంగా ఇంటర్వ్యూలు, పోటీ పరీక్షల్లో నెగ్గి ప్రభుత్వ ఉద్యోగం సంపాదించుకునే సూచనలు కూడా ఉన్నాయి.
  4. వృశ్చికం: ఈ రాశివారికి ఉద్యోగ కారకుడైన శని ఉద్యోగ స్థానాన్ని స్వక్షేత్రం నుంచి వీక్షించడం, సప్తమంలో ధన కారకుడు గురువు స్థిర రాశిలో ఉండడం వంటి కారణాల వల్ల స్వదేశంలోనే దూర ప్రాంతంలో స్థిరమైన ఉద్యోగం లభించే అవకాశం ఉంది. ఉద్యోగమూలక ధన లాభం ఈ రాశివారికి అత్యధికంగా ఉంది. ఉద్యోగం మారడానికి గానీ, స్థాన చలనానికి గానీ అవకాశం లేదు. ఉద్యోగ భద్రతకు, స్థిర త్వానికి లోటుండదు. ఏడాది పాటు విదేశీ ఉద్యోగావకాశాలు లభించే సూచనలు కనిపించడం లేదు.
  5. ధనుస్సు: ఉద్యోగ కారకుడైన శని ఈ రాశివారికి తృతీయ స్థానంలో ఉండడం, సేవా స్థానమైన ఆరవ స్థానంలో రాశ్యధిపతి గురువు శుక్రుడితో సంచారం చేయడం వల్ల ప్రయాణాలకు, బదిలీలకు అవ కాశం లేని ఉద్యోగంలో చేరే అవకాశం ఉంటుంది. విదేశాల్లో ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేయడం కన్నా స్వదేశాల్లో ఉద్యోగాల కోసం ప్రయత్నించడం వల్ల సత్వర ఫలితాలు అందుతాయి. ఉద్యోగంలో జీతభత్యాల కంటే అదనపు రాబడి బాగా ఎక్కువగా ఉండే అవకాశం కూడా ఉంది.
  6. కుంభం: ఈ స్థిర రాశిలోనే రాశ్యధిపతి శని సంచరిస్తూ, ఉద్యోగ స్థానాన్ని వీక్షించడం, చతుర్థంలో ఉన్న గురు, శుక్రులు కూడా ఉద్యోగ స్థానాన్ని వీక్షిస్తున్నందువల్ల ఈ రాశివారికి తప్పకుండా స్థిరమైన ఉద్యోగం స్వదేశంలోనే లభించే అవకాశం ఉంది. ఉద్యోగమూలక ధన లాభం ఎక్కువగా కనిపి స్తోంది. ఉద్యోగంలో ఈ రాశివారికి ధన యోగాలతో పాటు స్థిరత్వం, భద్రత కూడా లభిస్తాయి. విదేశాల్లో ఉద్యోగాలు చేస్తున్నవారు అక్కడే స్థిరపడడం జరుగుతుంది. ఉద్యోగంలో ప్రాధాన్యం ఉంటుంది.

పెద్ద పండుగ వేళ ఏపీలో వానలు.. ఇదిగో వెదర్ రిపోర్ట్..
పెద్ద పండుగ వేళ ఏపీలో వానలు.. ఇదిగో వెదర్ రిపోర్ట్..
ఖర్చు చేసింది రూ. 7 వేలు.. ఇంటికి పట్టుకెళ్లింది రూ. 90 లక్షలు
ఖర్చు చేసింది రూ. 7 వేలు.. ఇంటికి పట్టుకెళ్లింది రూ. 90 లక్షలు
తమన్ మ్యూజిక్ దెబ్బకు కిందపడిన స్పికర్లు..
తమన్ మ్యూజిక్ దెబ్బకు కిందపడిన స్పికర్లు..
ఉదయాన్నే నానబెట్టిన అంజీర్ తింటే ఏమవుతుందో తెలుసా..? ఈ సమస్యలన్నీ
ఉదయాన్నే నానబెట్టిన అంజీర్ తింటే ఏమవుతుందో తెలుసా..? ఈ సమస్యలన్నీ
కారులో కనిపించింది చూసి కంగుతిన్న పోలీసులు
కారులో కనిపించింది చూసి కంగుతిన్న పోలీసులు
ప్రభాస్ అభిమానులకు బ్యాడ్ న్యూస్.. ది రాజా సాబ్‌ లేటెస్ట్ అప్డేట్
ప్రభాస్ అభిమానులకు బ్యాడ్ న్యూస్.. ది రాజా సాబ్‌ లేటెస్ట్ అప్డేట్
ప్రధాని మోదీ తొలి పాడ్‌కాస్ట్‌లో పంచుకున్న ఆసక్తికర విషయాలు
ప్రధాని మోదీ తొలి పాడ్‌కాస్ట్‌లో పంచుకున్న ఆసక్తికర విషయాలు
ప్రమాణ స్వీకారానికి ముందు ట్రంప్‌కు బిగ్‌ రిలీఫ్‌.. దోషే కానీ..
ప్రమాణ స్వీకారానికి ముందు ట్రంప్‌కు బిగ్‌ రిలీఫ్‌.. దోషే కానీ..
కేవలం 4 గంటల్లోనే పర్సనల్ లోన్.. ప్రభుత్వ ఈ పథకం గురించి తెలుసా?
కేవలం 4 గంటల్లోనే పర్సనల్ లోన్.. ప్రభుత్వ ఈ పథకం గురించి తెలుసా?
అవిసె గింజలతో ఆరోగ్యమే కాదు, రెట్టింపు అందం మీ సొంతం..!ఇలా వాడితే
అవిసె గింజలతో ఆరోగ్యమే కాదు, రెట్టింపు అందం మీ సొంతం..!ఇలా వాడితే