Numerology: ఈ తేదీల్లో పుట్టినవారికి ప్రేమంటేనే పెద్ద పరీక్ష.. పాస్ కావడం కష్టమేనట..!
సంఖ్యాశాస్త్రం ప్రకారం కొన్ని తేదీల్లో పుట్టినవాళ్లకు ప్రేమలో కొంత అస్థిరత కనిపిస్తుంది. ముఖ్యంగా నెల ఏదైనా 5, 14, 23 తేదీల్లో పుట్టినవారి మూల సంఖ్య 5 అవుతుంది. వీరిపై బుధుడు అనే గ్రహం ప్రభావం ఉంటుంది. ఈ సంఖ్య ఉన్నవారు చురుకుగా ఆలోచిస్తారు. మాటలపై మంచి నియంత్రణ ఉంటుంది. వ్యాపారంలో విజయం సాధించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కానీ ప్రేమ విషయాల్లో అదృష్టం అంతగా కలిసి రాదు. ప్రేమలోకి చాలా వేగంగా ప్రవేశిస్తారు. కానీ ఎక్కువసార్లు ఆ సంబంధాలు నిలవవు. కొన్నిసార్లు వాళ్లే విసుగుతో విడిపోతారు లేదా పరిస్థితులు వారి ప్రేమను ముగింపుకు తీసుకెళ్తాయి.

ప్రేమలో మళ్ళీ మళ్ళీ మోసపోతున్న వాళ్ళను చూసి ఆశ్చర్యపోవచ్చు. వారు నిజమైన ప్రేమ కోరుకుంటారు కానీ సంబంధాలు బలంగా నిలవవు. వారి ప్రేమ తిరిగి తిరిగి దూరమవుతుంది. దీనికి కారణం వారి వ్యక్తిత్వం, ఆలోచన విధానం, జీవిత దృష్టిని ప్రభావితం చేసే మూల సంఖ్య. సంఖ్యాశాస్త్రం ఇది పుట్టిన తేదీ ఆధారంగా తెలియజేస్తుంది. ఇది పురాతన పద్ధతి అయినా.. వ్యక్తి జీవితంలో కొన్ని నిజాలు బయటపడతాయి.
మీ పుట్టిన తేదీని తీసుకొని అంకెలను కలిపితే మూలసంఖ్య వస్తుంది. ఉదాహరణకి 5 లేదా 23వ తేదీ అయితే 5 వస్తుంది. ఇది బుధుని సంకేతం. బుధుడు తెలివితేటలు, తర్కం, సంభాషణకు ప్రతీకగా నిలుస్తాడు.
మూలసంఖ్య 5 ఉన్నవారు బాగా చురుకుగా ఉంటారు. విషయాలను త్వరగా గ్రహించగలరు. వారు పరిస్థితిని గమనించి తగినట్లుగా మార్చుకుంటారు. వాళ్ల మాటల్లో స్పష్టత, ఆలోచనల్లో లోతు ఉంటుంది. అందుకే చాలా మంది వాళ్ల సలహా విలువైనదిగా భావిస్తారు.
కొత్తగా ప్రయత్నించడం, రిస్క్ తీసుకోవడం వీరి సహజ లక్షణం. సాంప్రదాయ మార్గాల కంటే కొత్త మార్గాల్లో ప్రయోగాలు చేయడం ఇష్టపడతారు. వ్యాపార రంగంలో ఇది వారికి ప్రయోజనం కలిగిస్తుంది. వారు తక్కువ సమయంలోనే మంచి స్థాయికి ఎదుగుతారు.
ఈ సంఖ్య కలిగినవారు మాట్లాడటంలో ప్రత్యేకంగా ఉంటారు. వాళ్ళ మాట వినడం ఆనందంగా ఉంటుంది. మాట్లాడేటప్పుడు తేలికగా తమ అభిప్రాయం చెప్పగలరు. వాళ్ళ మాట వినే వారు ప్రభావితులవుతారు. సమావేశాల్లో కానీ, వ్యక్తిగతంగా కానీ, ఎక్కడైనా తమ ముద్ర వేయగలుగుతారు.
వారు ఎంత తెలివిగా ఉన్నా ప్రేమ విషయంలో స్థిరంగా ఉండడం కష్టం అవుతుంది. సంబంధాలు ఎక్కువ కాలం నిలబడవు. కొన్నిసార్లు విసుగు కారణం అవుతుంది. మరికొన్నిసార్లు పరిస్థితులే అడ్డంకులు సృష్టిస్తాయి. నిజమైన ప్రేమ దొరకడానికి వారు నిరీక్షించాలి. చాలా సార్లు ఇలా జరిగే అవకాశం తక్కువగా ఉంటుంది.
సంబంధం తలకిందులైనా.. వీరు అక్కడే ఆగిపోరు. ఒకసారి బాధపడినా.. మళ్ళీ మానసికంగా నిలబడగలరు. నవ్వుతూ ముందుకు సాగగలరు. ఇదే వారి ప్రత్యేకత. ఈ మనోధైర్యం వల్లే వారికి కొత్త అవకాశాలు వస్తుంటాయి.
