AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Horoscope Today: ఈరాశివారు షేర్లు, పెట్టుబడుల విషయాల్లో జాగ్రత్తలు అవసరం.. రాశి ఫలాలు..

Rasi Phalalu on april 29th 2021: మన దేశంలో ఇప్పటికీ రాశిఫలాలను నమ్మేవారి సంఖ్య అధికంగానే ఉంటుంది.

Horoscope Today: ఈరాశివారు షేర్లు, పెట్టుబడుల విషయాల్లో జాగ్రత్తలు అవసరం.. రాశి ఫలాలు..
Horoscope Today
Rajitha Chanti
|

Updated on: Apr 29, 2021 | 7:09 AM

Share

Rasi Phalalu on april 29th 2021: మన దేశంలో ఇప్పటికీ రాశిఫలాలను నమ్మేవారి సంఖ్య అధికంగానే ఉంటుంది. తమ రోజూను ప్రారంభించే ముందు తమ జీవితంలో ఏం జరగబోతుందో తెలుసుకోవాలని ఆసక్తి చూపిస్తుంటారు. అందులో భాగంగానే రాశి ఫలాలను తెలుసుకుంటుంటారు. మరీ ఈరోజు (ఏప్రిల్ 29న) రాశిఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందామా.

మేషరాశి..

ఈరోజు వీరు ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. అనవసరమైన ఖర్చులు తగ్గించుకోవడం మంచిది. అష్టలక్ష్మీ స్త్రోత్ర పారాయణం మేలు చేస్తుంది.

వృషభరాశి..

ఈరోజు వీరు షేర్లు, పెట్టుబడుల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. నవగ్రహ అర్చన మేలు చేస్తుంది.

మిథున రాశి..

ఈరోజు వీరికి పలు రకాల ఆహ్వానాలు అందుతాయి. షేర్లు, పెట్టుబడుల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. నవగ్రహ అర్చన మేలు చేస్తుంది.

కర్కాటక రాశి…

వీరికి ఈరోజు ఉద్యోగాల విషయంలో అనుకొని చిక్కులు వచ్చే సూచనలు ఉన్నవి. జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. శివాభిషేకం మంచి ఫలితాలను ఇస్తుంది.

సింహరాశి..

ఈరోజు వీరు పిల్లల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. ఆహార విషయంలో జాగ్రత్తలు అవసరం. ధన్వంతరీ స్త్రోత్ర పారాయణం మేలు చేస్తుంది.

కన్యరాశి..

ఈరోజు వీరికి ఆర్థిక విషయాలు నిరుత్సహాపరుస్తాయి. స్నేహితులతో మాట పట్టింపులు ఏర్పడుతుంటాయి. ఆంజనేయ స్వామిని పూజించడం మంచిది.

తులారాశి..

ఈరోజు వీరికి ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తుంటాయి. చిన్ననాటి స్నేహితులను కలుస్తుంటారు. విందు కార్యక్రమాల్లో పాల్గోంటారు. ఇంద్రకృత మహలక్ష్మీ స్త్రోత్ర పారాయణం మేలు చేస్తుంది.

వృశ్చిక రాశి..

వీరికి ఈరోజు నూతన వ్యక్తులతో పరిచయాలు కలుగుతుంటాయి. పనుల్లో ఆటంకాలు ఉంటాయి. జాగ్రత్తలు తీసుకోవాలి. గణపతి సంకటనష స్తోత్రపారాయణం మేలు చేస్తుంది.

ధనుస్సు రాశి…

వీరు ఈరోజు వ్యక్తిగత కార్యక్రమాలు దగ్గరుండి పూర్తిచేసుకుంటారు. అలాగే రావాల్సిన బాకీలను వసూలు చేసుకుంటారు. మహగణపతి దర్శనం చేసుకొని, గరికను సమర్పించడం మేలు చేస్తుంది.

మకర రాశి…

ఈరోజు వీరు కొద్దిపాటి సమస్యలు ఉంటాయి. అనారోగ్య సంబంధమైన భావాలు తగ్గించుకోవాలి. ధన్వంతరీ స్తోత్ర పారాయణం మేలు చేస్తుంది.

కుంభరాశి..

ఈరోజు వీరు ఆలయాలు, ఆశ్రయాలు సందర్శిస్తుండాలి. రాజకీయపరమైన ఇబ్బందులు ఉంటాయి. లలితా అమ్మవారి దర్శనం మేలు చేస్తుంది.

మీనరాశి…

ఈరోజు వీరు సామాజిక గౌరవాలు కోల్పోకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. అంతేకాకుండా పిల్లల ఆరోగ్య, చదువుల విషయంలో శ్రద్ధ చూపడం మంచిది. పంచామృతాలతో పరమేశ్వరునికి అభిషేకం నిర్వహించడం మంచిది.

Also Read: పాత కాయిన్స్‏కు డిమాండ్.. ఈ కాయిన్ మీ దగ్గర ఉంటే మీరు లక్షాధికారి అయినట్లే… ఎలాగో తెలుసా..

ఏసీలు ఆఫ్ చేసి… కిటికీలు, తలుపులు తెరిస్తే కరోనాను కట్టడి చేయవచ్చా ? .. అధ్యాయనాల్లో బయటపడిన ఆసక్తికర విషయాలు..