Horoscope Today: వీరికి ఊహించంత డబ్బు, అనుకోని శుభవార్తలు.. సోమవారం రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే
వృత్తి, ఉద్యోగాల్లో ప్రాధాన్యం పెరుగుతుంది. అధికారులతో బాధ్యతలను పంచుకునే అవకాశం ఉంది. జీతభత్యాలు బాగా వృద్ధి చెందుతాయి. ఏలిన్నాటి శని ప్రభావం వల్ల కొద్దిగా మానసిక ఒత్తిడి ఉంటుంది. స్వల్ప అనారోగ్యానికి అవకాశం ఉంది. ముఖ్యమైన వ్యవహారాలను నిదానంగా పూర్తి చేస్తారు.

మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)
గ్రహ బలం బాగా అనుకూలంగా ఉన్నందువల్ల రోజంతా బాగా సానుకూలంగా, సంతృప్తికరంగా గడిచిపోతుంది. కొద్ది ప్రయత్నంతో ముఖ్యమైన వ్యవహారాలు, పనులన్నీ పూర్తవుతాయి. ఆర్థిక పరిస్థితి బాగానే ఉంటుంది కానీ, కుటుంబ ఖర్చులు పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాల్లో ముఖ్య మైన నిర్ణయాలు తీసుకుని అమలు చేస్తారు. ఉద్యోగంలో మీ సలహాలు, సూచనలకు అధికారులు ప్రాధాన్యం ఇస్తారు. కుటుంబ సభ్యులతో విహార యాత్ర చేస్తారు. షేర్లు, స్పెక్యులేషన్లు బాగా లాభిస్తాయి.
వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)
వృత్తి, ఉద్యోగాల్లో పనిభారం కాస్తంత ఎక్కువగానే ఉన్నా అంచనాలకు మించిన ఫలితం ఉంటుంది. అధికారుల ఆదరణ లభిస్తుంది. వ్యాపారాలు కొద్దిపాటి లాభాలతో ముందుకు సాగు తాయి. ఆదాయం బాగానే ఉంటుంది. మంచి పరిచయాలు కలుగుతాయి. ఇంటా బయటా మీ సలహాలు, సూచనలకు విలువ ఏర్పడుతుంది. నిరుద్యోగులకు ఆశించిన ఆఫర్లు అందుతాయి. బంధుమిత్రులతో విందులు, వినోదాల్లో పాల్గొం టారు. ఎదురు చూస్తున్న శుభవార్తలు వింటారు.
మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)
రోజంతా ఉత్సాహంగా, హుషారుగా గడిచిపోతుంది. ఆర్థిక పరిస్థితి బాగా మెరుగుపడుతుంది. రావ లసిన డబ్బు వసూలవుతుంది. బంధుమిత్రులకు ఆర్థికంగా సహాయపడగల స్థితిలో ఉంటారు. ఉద్యోగంలో అనుకూలతలు పెరుగుతాయి. వృత్తి వ్యాపారాలు లాభసాటిగా ముందుకు సాగు తాయి. ఒకటి రెండు వ్యక్తిగత సమస్యలు పరిష్కారం అవుతాయి. కుటుంబ సభ్యుల మీద ఎక్కు వగా ఖర్చు చేస్తారు. ఇష్టమైన మిత్రులతో ఎంజాయ్ చేస్తారు. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది.
కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)
వృత్తి, ఉద్యోగాల్లో కొద్దిపాటి ఇబ్బందులు ఉండే అవకాశం ఉంది. ముఖ్యంగా ఉద్యోగంలో బాగా ఒత్తిడి, శ్రమ పెరుగుతాయి. వ్యాపారం మీద మరింత శ్రద్ధ పెట్టడం అవసరం. చేపట్టిన పనులన్ని టినీ విజయవంతంగా పూర్తి చేస్తారు. ముఖ్యమైన వ్యవహారాల్లో మిత్రుల సహాయం లభిస్తుంది. కుటుంబ సభ్యులతో ఆలయాలు సందర్శిస్తారు. ఆర్థిక విషయాల్లో ఎవరినీ గుడ్డిగా నమ్మకపోవడం మంచిది. ఎవరికీ వాగ్దానాలు చేయవద్దు. పెళ్లి, ఉద్యోగ ప్రయత్నాల్లో ఆశించిన శుభవార్తలు వింటారు.
సింహం (మఖ, పుబ్బ, హస్త 1)
ఆర్థిక, ఆస్తి వ్యవహారాలతో పాటు, ఆర్థిక లావాదేవీలు కూడా సవ్యంగా సాగిపోతాయి. ఆదాయానికి లోటుండకపోవచ్చు. ఆరోగ్యం కూడా మెరుగ్గా ఉంటుంది. కుటుంబ జీవితం చీకూ చింతా లేకుండా సాగిపోతుంది. వ్యక్తిగత సమస్యలు తగ్గుముఖం పడతాయి. నిరుద్యోగులకు ఉద్యోగ యోగం పడు తుంది. వృత్తి, వ్యాపారాలు లాభాల బాటపడతాయి. ఉద్యోగంలో ఒత్తిడి బాగా తగ్గుతుంది. ముఖ్య మైన వ్యవహారాలు తేలికగా పూర్తవుతాయి. పెళ్లి ప్రయత్నాలు తప్పకుండా సఫలం అవుతాయి.
కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)
ధన స్థానం బాగా బలంగా ఉన్నందువల్ల ఆర్థిక పరిస్థితి ఇదివరకటి కంటే బాగా మెరుగుపడు తుంది. అదనపు ఆదాయ ప్రయత్నాలు ఉత్సాహంగా సాగుతాయి. మొండి బాకీలను, బకాయి లను వసూలు చేసుకుంటారు. ఇతరుల మీద ఆధారపడకుండా ఆర్థిక వ్యవహారాల్ని జాగ్రత్తగా నిర్వహించడం మంచిది. ముఖ్యమైన వ్యవహారాలు, పనులు సవ్యంగా పూర్తవుతాయి. వ్యాపారాభివృద్ధికి అవకాశం ఉంది. ఉద్యోగం బాగా సాఫీగా సాగిపోతుంది. వృత్తి జీవితంలో డిమాండ్ పెరుగు తుంది.
తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)
శుభ గ్రహాల బలం బాగా అనుకూలంగా ఉన్నందువల్ల ఆదాయ వృద్ధి సూచనలున్నాయి. జీత భత్యాల్లో ఆశించిన పెరుగుదలకు అవకాశం ఉంది. వృత్తి, ఉద్యోగాల్లో తప్పకుండా స్థిరత్వం లభిస్తుంది. అనుకున్న పనులు, ప్రయత్నాలు అనుకున్నట్టు పూర్తవుతాయి. ఒకటి రెండు వ్యక్తిగత సమస్యలు కొద్ది ప్రయత్నంతో పరిష్కారమవుతాయి. నిరుద్యోగులకు విదేశాల నుంచి ఆశించిన సమాచారం అందుతుంది. ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టాలి. కుటుంబం మీద ఖర్చు బాగా పెరుగుతుంది.
వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట)
సాధారణంగా ఏ పని తలపెట్టినా విజయం సాధిస్తారు. శుభవార్తలు ఎక్కువగా వినడం జరుగు తుంది. వృత్తి, ఉద్యోగాలు ఉత్సాహంగా ముందుకు సాగుతాయి. వ్యాపారాల్లో సొంత నిర్ణయాల వల్ల ఆశించిన ప్రయోజనం ఉంటుంది. మిత్రులతో కలిసి ఒక శుభ కార్యంలో పాల్గొంటారు. రాదనుకుని వదిలేసుకున్న డబ్బు, బకాయిలు చేతికి అందుతాయి. స్థిరాస్తి వివాదం నుంచి బయటపడతారు. కుటుంబ జీవితం ప్రశాంతంగా, హ్యాపీగా సాగిపోతుంది. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలు సఫలమవుతాయి.
ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)
ఆదాయానికి, ఆరోగ్యానికి లోటుండదు. ముఖ్యంగా ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. ఉద్యో గంలో హోదా పెరగడానికి అవకాశం ఉంది. డాక్టర్లు, లాయర్లు తదితర వృత్తుల వారికి అంచనాలకు మించి డిమాండ్, రాబడి పెరుగుతాయి. వ్యాపారాలు బాగా బిజీగా సాగిపోతాయి. కొన్ని ముఖ్య మైన వ్యవహారాలను కొద్ది శ్రమతో చక్కబెడతారు. నిరుద్యోగులకు ఆశించిన ఉద్యోగం లభించే అవ కాశం ఉంది. బంధువుల్లో మంచి పెళ్లి సంబంధం కుదురుతుంది. పిల్లలు ఆశించిన పురోగతి సాధిస్తారు.
మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2)
ధన స్థానం, భాగ్య స్థానం బలంగా ఉన్నందువల్ల ఆదాయానికి లోటుండకపోవచ్చు. అనుకోకుండా డబ్బు కలిసి వచ్చే అవకాశం కూడా ఉంది. ఇతరులకు సహాయపడగల స్థితిలో ఉంటారు. ఉద్యోగ జీవితం సాఫీగా, హ్యాపీగా సాగిపోతుంది. వృత్తి, వ్యాపారాల్లో యాక్టివిటీ బాగా పెరుగుతుంది. ఉద్యోగ ప్రయత్నాల్లో శుభవార్తలు వింటారు. బంధువుల నుంచి ఒకటి రెండు శుభవార్తలు వింటారు. ఆర్థిక లావాదేవీల్లో జాగ్రత్తగా ఉండడం మంచిది. ఆర్థిక, ఆస్తి వ్యవహారాలు బాగా చక్కబడతాయి.
కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)
వృత్తి, ఉద్యోగాల్లో ప్రాధాన్యం పెరుగుతుంది. అధికారులతో బాధ్యతలను పంచుకునే అవకాశం ఉంది. జీతభత్యాలు బాగా వృద్ధి చెందుతాయి. ఏలిన్నాటి శని ప్రభావం వల్ల కొద్దిగా మానసిక ఒత్తిడి ఉంటుంది. స్వల్ప అనారోగ్యానికి అవకాశం ఉంది. ముఖ్యమైన వ్యవహారాలను నిదానంగా పూర్తి చేస్తారు. వ్యాపారాల్లో సామాన్య లాభాలు కనిపిస్తాయి. కుటుంబ జీవితం సాఫీగా సాగిపో తుంది. నిరుద్యోగులకు ఉద్యోగం లభించే సూచనలున్నాయి. పిల్లల నుంచి శుభవార్తలు వింటారు.
మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)
రాశ్యధిపతి గురువు పంచమ స్థానంలో ఉచ్ఛ స్థితిలో ఉన్నందువల్ల ఆదాయం బాగా వృద్ధి చెందే అవకాశం ఉంది. ఒకటి రెండు ముఖ్యమైన ఆర్థిక సమస్యలు పరిష్కారం అవుతాయి. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలకు సమయం అనుకూలంగా ఉంది. వృత్తి, వ్యాపారాల్లో సంపాదనకు లోటుండదు. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. ఉద్యోగ జీవితం నల్లేరు మీద బండిలా సాగిపో తుంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది. నష్టదాయక వ్యవహారాలకు కాస్తంత దూరంగా ఉండడం మంచిది.



