Rashi Phalalu: ఆ రాశి ఉద్యోగులకు ఆశించిన ఆఫర్లు.. 12 రాశుల వారికి రాశిఫలాలు
Horoscope Today (November 10, 2025): మేష రాశి వారు శుభవార్తలు ఎక్కువగా ఉంటారు. ఉద్యోగ జీవితం చాలావరకు సానుకూలంగా సాగిపోతుంది. వృషభ రాశి వారికి కుటుంబ పరిస్థితులు బాగా అనుకూలంగా ఉంటాయి. ఆస్తి వ్యవహారాల్ని చాలావరకు చక్కబెడతారు. మిథున రాశి వారికి ఉద్యోగంలో ఒకటి రెండు పొరపాట్లు చోటు చేసుకునే అవకాశం ఉంది. అధికారులతో జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి సోమవారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..?

దిన ఫలాలు (నవంబర్ 10, 2025): మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1): శుభవార్తలు ఎక్కువగా ఉంటారు. ఉద్యోగ జీవితం చాలావరకు సానుకూలంగా సాగిపోతుంది. సహోద్యోగుల సహాయంతో ప్రధాన లక్ష్యాలను సకాలంలో పూర్తి చేస్తారు. వృత్తి జీవితం బిజీగా సాగి పోతుంది. వ్యాపారాల్లో లాభాలు నిలకడగా పురోగమిస్తాయి. కొద్దిగా శ్రమతో పనులన్నీ సజావుగా పూర్తవుతాయి. అదనపు ఆదాయ ప్రయత్నాలు ఆశించిన స్థాయిలో కలిసి వస్తాయి. పిల్లలు చదువుల్లో పురోగతి సాధిస్తారు. నిరుద్యోగులకు విదేశాల నుంచి కూడా మంచి ఆఫర్లు అందుతాయి.
వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2): ఉద్యోగంలో శ్రమాధిక్యత, అధికారుల నుంచి ఒత్తిడి ఉన్నప్పటికీ సకాలంలో బాధ్యతలను పూర్తి చేస్తారు. వృత్తి, వ్యాపారాల్లో కొద్దిపాటి మార్పులు చేసి ఆర్థికంగా లబ్ధి పొందుతారు. కుటుంబ పరిస్థితులు బాగా అనుకూలంగా ఉంటాయి. ఆస్తి వ్యవహారాల్ని చాలావరకు చక్కబెడతారు. చేపట్టిన పనులన్నిటీనీ పూర్తి చేస్తారు. వ్యక్తిగత సమస్యలు తగ్గుముఖం పడతాయి. ఆరోగ్యం బాగానే ఉంటుంది. అనేక మార్గాల్లో ఆదాయం పెరిగే అవకాశం ఉంది. నిరుద్యోగులు శుభవార్తలు వింటారు.
మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3): ఉద్యోగంలో ఒకటి రెండు పొరపాట్లు చోటు చేసుకునే అవకాశం ఉంది. అధికారులతో జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది. ఆస్తి వివాదాల్లో సమస్యలు తలెత్తవచ్చు. ఆర్థిక వ్యవహారాల్లో ఎవరినీ గుడ్డిగా నమ్మకపోవడం మంచిది. వృత్తి, ఉద్యోగాలకు రోజంతా సమయం అనుకూలంగా ఉంది. పదోన్నతికి కూడా అవకాశం ఉంది. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాల్లో ఒకటి రెండు శుభవార్తలు వింటారు. ఆరోగ్యం, ఆదాయం నిలకడగా సాగిపోతాయి. సొంత పనుల మీద బాగా శ్రద్ధ పెట్టడం అవసరం.
కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష): వృత్తి, ఉద్యోగాలలో శ్రమాధిక్యత ఉంటుంది. ప్రాధాన్యానికి, ప్రాభవానికి లోటుండదు. లాభదాయక పరిచయాలు ఏర్పడతాయి. వ్యాపారాల్లో నష్టాలు బాగా తగ్గుతాయి. ఆదాయం ఆశించిన స్థాయిలో పెరుగుతుంది కానీ, కుటుంబ ఖర్చులు కూడా సిద్ధంగా ఉంటాయి. ఒకరిద్దరు మిత్రులకు ఆర్థి కంగా సహాయం చేయాల్సి వస్తుంది. గృహ, వాహన సౌకర్యాల మీద దృష్టి పెడతారు. నిరుద్యోగులతో పాటు ఉద్యోగులకు కూడా ఆశించిన ఆఫర్లు అందుతాయి. ఆరోగ్యం నిలకడగా సాగిపోతుంది.
సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1): అనుకున్న పనులు నిరాటంకంగా సాగిపోతాయి. వృత్తి, ఉద్యోగాలు సానుకూలంగా సాగిపోతాయి. వ్యాపారాల్లో ఆశించిన లాభాలు అందుతాయి. ప్రతి పనిలోనూ వ్యయ ప్రయాసలుంటాయి. తలపెట్టిన వ్యవహారాలు నిదానంగా పూర్తవుతాయి. కుటుంబ జీవితం సాఫీగా సాగిపోతుంది. ఆహార, విహారాల్లో కొద్దిగా జాగ్రత్తగా ఉండడం మంచిది. రావలసిన డబ్బు చేతికి అందుతుంది. ప్రస్తుతానికి ఎవరితోనూ ఆర్థిక లావాదేవీలు పెట్టుకోవద్దు. ఒకటి రెండు వ్యక్తిగత సమస్యలు పరిష్కారం కావచ్చు.
కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2): వృత్తి, ఉద్యోగాల్లో అధికారులు బాగా ప్రాధాన్యం ఇస్తారు. ఇంటా బయటా మీ మాటకు విలువ ఉంటుంది. వ్యాపారాల్లో లాభాలు సామాన్యంగా ఉంటాయి. ఆదాయానికి లోటుండదు. ఆకస్మిక ధన ప్రాప్తికి కూడా అవకాశం ఉంది. అనవసర ఖర్చులు ఇబ్బంది పెట్టే సూచనలున్నాయి. ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండడం మంచిది. నిరుద్యోగులకు ఆశించిన ఆఫర్లు అందే అవకాశం ఉంది. కొద్ది ఒకటి రెండు వ్యక్తిగత సమస్యలు చాలావరకు తగ్గిపోతాయి. ఎవరినీ గుడ్డిగా నమ్మ వద్దు.
తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3): ఉద్యోగంలో మీ పని తీరుతో అధికారులను బాగా ఆకట్టుకుంటారు. ప్రతిభా పాటవాలు, నైపుణ్యాలు వృద్ధి చెందుతాయి. వృత్తి, వ్యాపారాల్లో కొన్ని మార్పులు చేపట్టి ఆర్థికంగా ప్రయోజనం పొందు తారు. ఆదాయానికి ఏమాత్రం లోటుండదు. ఆరోగ్య సమస్యలు కూడా ఏమీ ఉండకపోవచ్చు. వ్యక్తి గత సమస్యల నుంచి కొద్దిగా బయటపడే అవకాశం ఉంది. ఆస్తి వ్యవహారాల్లో జీవిత భాగస్వామితో కలిసి నిర్ణయాలు తీసుకోవడం మంచిది. కొందరు మిత్రుల వల్ల ఆర్థిక నష్టం కలుగుతుంది.
వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట): ఉద్యోగంలో అధికారుల నుంచి ఆశించిన ఆదరణ లభిస్తుంది. వృత్తి జీవితంలో విశ్రాంతి ఉండని పరిస్థితి ఏర్పడుతుంది. వ్యాపారాల్లో పెట్టుబడికి, శ్రమకు తగ్గ ప్రతిఫలం అందుకుంటారు. నిరుద్యోగులకు ఆశించిన సమాచారం అందే అవకాశం ఉంది. పెళ్లి ప్రయత్నాలు సఫలమవుతాయి. స్తోమతకు మించి బంధుమిత్రులకు ఆర్థిక సహాయం చేస్తారు. ఇంటా బయటా ఒత్తిడి ఉండే అవకాశం ఉంది. ముఖ్యమైన పనులన్నిటినీ కొద్ది శ్రమతో పూర్తి చేస్తారు. ఆరోగ్యం బాగానే ఉంటుంది.
ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1): రోజంతా ఉత్సాహంగా, ఉల్లాసంగా గడిచిపోతుంది. దాదాపు ప్రతి ప్రయత్నమూ విజయవంతం అవుతుంది. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. వృత్తి, ఉద్యోగాల్లో అదనపు బాధ్యతలు పెరుగుతాయి. అధికారుల నుంచి ఆశించిన గుర్తింపు లభిస్తుంది. ఆస్తి, ఆర్థిక వ్యవహారాలను సకలంలో చక్కబెడతారు. నిరుద్యోగులకు దూర ప్రాంతంలో ఉద్యోగం లభించే అవకాశం ఉంది. పెళ్లి ప్రయత్నాలు చేపట్టడానికి ఇది బాగా అనుకూల సమయం. ఆరోగ్యం బాగా మెరుగ్గా ఉంటుంది.
మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2): ఒకటి రెండు వ్యక్తిగత సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. ఆర్థికంగా అనుకూలతలు పెరుగుతాయి. ఉద్యోగంలో అధికారులకు మీ మీద బాగా నమ్మకం పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాల్లో రాబడికి కొరత ఉండదు. ఏ ప్రయత్నం తలపెట్టినా తప్పకుండా కలిసి వస్తుంది. ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టడం మంచిది. ఇంటా బయటా కొద్దిగా ఒత్తిడి ఉంటుంది. ముఖ్యమైన వ్యవహారాల్ని నిదానంగా పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. పిల్లలు ఘన విజయాలు సాధిస్తారు.
కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3): వృత్తి, ఉద్యోగాలు ఉత్సాహంగా, ప్రోత్సాహకరంగా సాగిపోతాయి. పదోన్నతికి సంబంధించి శుభవార్త వింటారు. వ్యాపారాల్లో ఆర్థిక సమస్యల ఒత్తిడి నుంచి చాలావరకు విముక్తి లభిస్తుంది. అనుకో కుండా వ్యక్తిగత సమస్యలు తగ్గుముఖం పడతాయి. కుటుంబంలో ఒకటి రెండు శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. మంచి పరిచయాలు ఏర్పడతాయి. ముఖ్యమైన పనులు, వ్యవహారాలు ఆశించిన విధంగా పూర్తయి ఊరట చెందుతారు. ఆదాయంతో పాటు ఖర్చులు పెరుగుతాయి.
మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి): వృత్తి, ఉద్యోగాల్లో అధికారులు ఎక్కువగా ఈ రాశివారి మీద ఆధారపడతారు. బరువు బాధ్యతలు పెరగడం వల్ల విశ్రాంతి దూరం అవుతుంది. వ్యాపారాల్లో కష్టనష్టాలు కొద్దిగా తగ్గే అవకాశం ఉంది. ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. ఆర్థిక పరిస్థితి బాగా మెరుగుపడుతుంది. ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టడం మంచిది. తల్లితండ్రుల జోక్యంతో ఆర్థిక వివాదం ఒకటి పరిష్కారమవుతుంది. ముఖ్యమైన వ్యవహారాల్లో జీవిత భాగస్వామి సలహాలు ఉపకరిస్తాయి. నిరుద్యోగులకు ఉద్యోగ యోగం పడుతుంది.



