AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rahu Dosha: రాహువుతో ఆ రాశుల వారికి ప్రమాదం! పరిహారాలు ఏంటో తెలుసుకోండి

Rahu Power Boost Effects: రాహువు తన బలం పెంచుకోవడంతో నవంబర్ 20 నుండి ఫిబ్రవరి వరకు మిథునం, కర్కాటకం, తుల, వృశ్చికం, మీనం రాశుల వారికి ప్రమాదం పొంచి ఉంది. ఆర్థిక నష్టాలు, ఆరోగ్య సమస్యలు, సంబంధాలలో విభేదాలు ఎదురవుతాయి. రాహు దోష నివారణకు సుబ్రహ్మణ్యాష్టకం పఠించడం, రాహువుకు పూజలు చేయించడం వంటి పరిహారాలు పాటించడం శుభదాయకం.

Rahu Dosha: రాహువుతో ఆ రాశుల వారికి ప్రమాదం! పరిహారాలు ఏంటో తెలుసుకోండి
Rahu Power Boost Impact
TV9 Telugu Digital Desk
| Edited By: Janardhan Veluru|

Updated on: Nov 09, 2025 | 8:11 PM

Share

అత్యంత పాప గ్రహంగా పేరున్న రాహువుకు ఈ నెల(నవంబర్) 20 నుంచి ఫిబ్రవరి వరకు బలం బాగా పెరుగుతోంది. ప్రస్తుతం కుంభ రాశిలో సంచారం చేస్తున్న రాహువు తన సొంత నక్షత్రమైన శతభి షంలోకి ప్రవేశించడం వల్ల ఈ వక్ర గ్రహానికి బలం పెరుగుతుంది. రాహువుకు బలం పెరగడం వల్ల కొన్ని రాశులకు యోగాలు పట్టే అవకాశం ఉన్నా, మిథునం, కర్కాటకం, తుల, వృశ్చికం, మీన రాశులకు మాత్రం కష్టనష్టాలు కలిగించే అవకాశం ఉంది. ఆర్థిక నష్టాలు, మోసాలు, నమ్మక ద్రోహాలు, నయవంచనలు వంటివి అనుభవానికి వస్తాయి. ఈ రాశుల వారు సుబ్రహ్మణ్యాష్టకాన్ని పఠించడం, రాహువుకు పూజలు చేయించడం వల్ల రాహు దోషం పరిహారమయ్యే అవకాశం ఉంది.

  1. మిథునం: ఈ రాశికి భాగ్య స్థానంలో సంచారం చేస్తున్న రాహువుకు బలం పెరగడం వల్ల వ్యక్తిగత పురోగతికి అడుగడుగునా ఆటంకాలు, అవరోధాలు ఏర్పడే అవకాశం ఉంది. ఉద్యోగంలో పదోన్నతులు ఆగిపోవడం, వృత్తి, వ్యాపారాలు మందకొడిగా సాగడం వంటివి జరుగుతాయి. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాల్లో ఆశాభంగాలు ఎక్కువగా ఉంటాయి. తండ్రి ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది. వైవాహిక జీవితంలో విభేదాలు, వివాదాలు తలెత్తుతాయి. ఆర్థికంగా శ్రమ ఎక్కువ ఫలితం బాగా తక్కువగా ఉంటుంది.
  2. కర్కాటకం: ఈ రాశికి అష్టమ స్థానంలో సంచారం చేస్తున్న రాహువు వల్ల ఆదాయం ఎక్కువగా వృద్ధి చెందే అవకాశం ఉండదు. రావలసిన డబ్బు ఒకపట్టాన చేతికి అందదు. ఆస్తి వివాదాలు బాగా ముదిరి పోయే అవకాశం ఉంటుంది. అర్థం కాని, రోగ నిర్ధారణ చేయలేని, చికిత్సకు అందని అనా రోగ్యాలు ఇబ్బంది పెడతాయి. జీవిత భాగస్వామితో సమస్యలు తలెత్తుతాయి. ఆర్థిక, వ్యక్తిగత సమస్యలు ఒత్తిడి కలిగిస్తాయి. ప్రయాణాల వల్ల నష్టాలు కలుగుతాయి. దుర్వార్తలు ఎక్కువగా వింటారు.
  3. తుల: ఈ రాశికి పంచమ స్థానంలో సంచారం చేస్తున్న రాహువుకు బలం పెరగడం వల్ల బంధుమిత్రులు, సన్నిహితుల వల్ల ఆర్థికంగా నష్టపోవడం గానీ, మోసపోవడం గానీ జరుగుతుంది. ఆర్థిక, ఆస్తి వ్యవహారాల్లో పొరపాట్లు జరిగే అవకాశం ఉంది. ఉద్యోగంలో ప్రాభవం తగ్గుతుంది. పిల్లల వల్ల సమస్యలు తలెత్తుతాయి. దగ్గర బంధువుల ఆరోగ్యానికి సంబంధించి ఆందోళనకర సమాచారం అందుతుంది. మిత్రులు శత్రువులుగా మారడం జరుగుతుంది. అనారోగ్యానికి అవకాశం ఉంది.
  4. వృశ్చికం: ఈ రాశికి చతుర్థ స్థానంలో ఉన్న రాహువుకు బలం పెరగడం వల్ల సుఖ నాశనం జరుగుతుంది. కుటుంబంలో సుఖ సంతోషాలు బాగా తగ్గుతాయి. మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ఆర్థిక, వ్యక్తిగత సమస్యలు ఇబ్బంది పెడతాయి. తోబుట్టువులతో ఆస్తి వివాదాలు తలెత్తుతాయి. తల్లి ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది. ప్రయాణాల వల్ల డబ్బు నష్టం తప్ప ప్రయోజనం ఉండదు. ఉద్యోగ ప్రయత్నాలు సానుకూలంగా సాగకపోవచ్చు. తరచూ అనారోగ్యాలు బాగా ఇబ్బంది పెడతాయి.
  5. మీనం: ఈ రాశికి వ్యయ స్థానంలో సంచారం చేస్తున్న రాహువుకు బలం పెరగడం వల్ల అనారోగ్యాలు ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది. వైద్య ఖర్చులు బాగా పెరుగుతాయి. బంధుమిత్రుల వల్ల ఆర్థి కంగా బాగా నష్టపోవడం జరుగుతుంది. కొందరు సన్నిహితులు నమ్మకద్రోహానికి పాల్పడతారు. విదేశీ ఉద్యోగాలకు ప్రయత్నించి భంగపడతారు. ఆర్థిక వ్యవహారాల్లో, ఆర్థిక లావాదేవీల్లో జాగ్రత్తగా ఉండడం మంచిది. రహస్య శత్రువులు తయారవుతారు. ఉద్యోగంలో జూనియర్లు పెత్తనం చెలాయిస్తారు.