AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Horoscope Today: ఆర్థికంగా వారు ఏ ప్రయత్నం తలపెట్టినా సఫలం..12 రాశుల వారికి రాశిఫలాలు

దిన ఫలాలు (నవంబర్ 9, 2025): మేష రాశి వారికి వృత్తి, ఉద్యోగాల్లో అప్రయత్న ధన లాభముంటుంది. వృత్తి, వ్యాపారాలు మూడు పువ్వులు ఆరు కాయలుగా ‍సాగిపోతాయి. వృషభ రాశి వారికి ఆదాయం వృద్ధి చెంది ఆర్థిక సమస్యల నుంచి చాలావరకు బయటపడతారు. మిథున రాశి వారికి వృత్తి, ఉద్యోగాల్లో సానుకూల వాతావరణం ఉంటుంది. వ్యాపారాలు సాఫీగా, ఉత్సాహంగా సాగిపోతాయి. మేష, వృషభ రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి ఆదివారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..?

Horoscope Today: ఆర్థికంగా వారు ఏ ప్రయత్నం తలపెట్టినా సఫలం..12 రాశుల వారికి రాశిఫలాలు
Rashi Phalalu 09 November 2025
TV9 Telugu Digital Desk
| Edited By: Janardhan Veluru|

Updated on: Nov 09, 2025 | 5:31 AM

Share

దిన ఫలాలు (నవంబర్ 9, 2025): మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1): ఎటువంటి ప్రయత్నమైనా సత్ఫలితాలనిస్తుంది. పలుకుబడి, గౌరవమర్యాదలు పెరుగుతాయి. కష్టార్జితానికి లోటుండదు కానీ, మిత్రుల మీద వృథా ఖర్చు చేయడం జరుగుతుంది. వృత్తి, ఉద్యోగాల్లో అప్రయత్న ధన లాభముంటుంది. వృత్తి, వ్యాపారాలు మూడు పువ్వులు ఆరు కాయలుగా ‍సాగిపోతాయి. అనేక విధాలుగా ఆర్థికంగా లబ్ధి పొందుతారు. ప్రయాణాల వల్ల లాభాలుంటాయి. ఉన్నతస్థాయి వారితో పరిచయాలు ఏర్పడతాయి. వ్యక్తిగత సమస్య ఒకటి పరిష్కారం అవుతుంది.

వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2): ఆదాయం వృద్ధి చెంది ఆర్థిక సమస్యల నుంచి చాలావరకు బయటపడతారు. గృహ, వాహన ప్రయత్నాలకు సమయం అనుకూలంగా ఉంది. శత్రువులు కూడా మిత్రులుగా మారి అండగా నిలబడతారు. ఆదాయ మార్గాలు అనుకూలంగా ఉన్నాయి. ముఖ్యమైన వ్యవహారాలలో జీవిత భాగస్వామి సలహాలు, సూచనలు తీసుకోవడం మంచిది. నిరుద్యోగులకు ఆఫర్లు అందుతాయి. పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. వృత్తి, ఉద్యోగాలలోనూ, వ్యాపారంలోనూ స్థిరత్వం లభిస్తుంది.

మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3): వృత్తి, ఉద్యోగాల్లో సానుకూల వాతావరణం ఉంటుంది. వ్యాపారాలు సాఫీగా, ఉత్సాహంగా సాగిపోతాయి. రావలసిన సొమ్ము చేతికి అందుతుంది. కుటుంబంలో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఇంటా బయటా కొద్దిగా ఒత్తిడి ఉన్నప్పటికీ, చేపట్టిన పనుల్ని విజయవంతంగా పూర్తి చేస్తారు. ఆదాయానికి, ఆరోగ్యానికి ఇబ్బందేమీ ఉండదు. నిరుద్యోగులకు ఒకటి రెండు అవకాశాలు లభిస్తాయి. పిల్లలు పురోగతి సాధిస్తారు. పరిచయస్థులలో మంచి పెళ్లి సంబంధం కుదరవచ్చు.

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష): ఉద్యోగ జీవితం ఉత్సాహంగా, ఉల్లాసంగా సాగిపోతుంది. వృత్తి రంగంలో కొద్దిగా ఒత్తిడి, శ్రమ తప్పక పోవచ్చు. వ్యాపారాలు నిలకడగా ముందుకు సాగుతాయి. ఆదాయం బాగానే వృద్ది చెందుతుంది. ఇష్టమైన బంధుమిత్రులతో సరదాగా కాలక్షేపం చేస్తారు. ఆర్థిక వ్యవహారాల్లో కుటుంబ సభ్యుల నుంచి సహకారం లభిస్తుంది. మనసులోని కోరికలు నెరవేరుతాయి. ఒక వ్యక్తిగత సమస్యకు పరిష్కారం లభిస్తుంది. సన్నిహితులతో వాదోపవాదాలకు దిగవద్దు. మంచి పరిచయాలు ఏర్పడతాయి.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1): సమయస్ఫూర్తిగా వ్యవహరించి వ్యక్తిగత సమస్యలను పరిష్కరించుకుంటారు. పెండింగ్ పనులను పట్టుదలగా పూర్తి చేస్తారు. ఆర్థిక, ఆస్తి వ్యవహారాలను చక్కబెడతారు. ఇంటా బయటా బాగా ఒత్తిడి ఉన్నప్పటికీ అదనపు ఆదాయ ప్రయత్నాలను పట్టుదలగా కొనసాగిస్తారు. వృత్తి, ఉద్యో గాల మీద శ్రద్ధ పెరుగుతుంది. వ్యాపారాలు బిజీగా సాగిపోతాయి. ఆదాయం నిలకడగా సాగిపోతుంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది. ప్రతి విషయాన్నీ జీవిత భాగస్వామితో చర్చించడం మంచిది.

కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2): ఆరోగ్యానికి, ఆదాయానికి లోటుండదు. ఆర్థిక పరిస్థితి చాలావరకు మెరుగుపడుతుంది. ఆర్థికంగా ఏ ప్రయత్నం తలపెట్టినా సఫలం అవుతుంది. కుటుంబ జీవితం సంతృప్తికరంగా ముందుకు సాగుతుంది. నిరుద్యోగులకు మంచి ఆఫర్ అందుతుంది. వ్యక్తిగత, ఆర్థిక సమస్యల నుంచి అనుకో కుండా ఉపశమనం లభిస్తుంది. వృత్తి, ఉద్యోగాలు చాలా వరకు అనుకూలంగా వ్యాపారాలు ఆర్థికంగా కలిసి వస్తాయి. కొందరు బంధువుల వ్యక్తిగత విషయాల్లో తలదూర్చకపోవడం మంచిది.

తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3): ఆదాయ వృద్దికి సమయం బాగా అనుకూలంగా ఉంటుంది. అనుకున్న పనులు సకాలంలో, సంతృప్తికరంగా పూర్తవుతాయి. తోబుట్టువులతో ఆస్తి వివాదాలను సమయస్ఫూర్తిగా పరిష్కరించుకుంటారు. వృత్తి, ఉద్యోగాలలో ఆశించిన ప్రోత్సాహకాలను అందుకుంటారు. ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండడం మంచిది. వ్యాపారాల్లో కొన్ని ప్రధానమైన సమస్యలు తొలగిపోతాయి. ఆర్థిక లావా దేవీలు ఆశాజనకంగా సాగుతాయి. నిరుద్యోగులు కొత్త అవకాశాలను అందిపుచ్చుకుంటారు.

వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట): వ్యక్తిగత, ఆర్థిక సమస్యల నుంచి కొంత వరకు విముక్తి లభిస్తుంది. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. ఆర్థిక వ్యవహారాలు సజావుగా పూర్తవుతాయి. ఆస్తి వివాదాల్లో ఆచితూచి వ్యవహరించడం మంచిది. అదనపు ఆదాయం పెరిగే అవకాశం ఉంది. వృత్తి, ఉద్యోగాలలో వివాదాస్పద అంశాలకు దూరంగా ఉండడం మంచిది. కుటుంబ సభ్యుల మీద ఖర్చులు పెరుగుతాయి. వ్యాపారాలు నిలకడగా సాగిపోతాయి. ఆర్థిక పరిస్థితి చాలావరకు మెరుగ్గా ఉంటుంది.

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాడ 1): ఆర్థిక ప్రయత్నాలు విజయవంతం అవుతాయి. ఆదాయం బాగుంటుంది. ఏ రంగంలో ఉన్నవా రైనా పురోగతి ఉంటుంది. వృత్తి, వ్యాపారాలలో ఇప్పుడు తీసుకునే నిర్ణయాలు ఆశించిన ఫలితా లనిస్తాయి. ఆస్తి వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండడం మంచిది. తలపెట్టిన పనుల్లో కొద్దిగా శ్రమాధిక్యత ఉంటుంది. నిరుద్యోగులు తమ ప్రయత్నాల్లో విజయాలు సాధిస్తారు. పిల్లల విషయంలో శుభ వార్తలు వింటారు. కుటుంబ జీవితం సాఫీగా సాగిపోతుంది. మంచి పెళ్లి సంబంధం కుదురుతుంది.

మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2): వృత్తి, ఉద్యోగాల్లో అధికారుల నుంచి ఆశించిన ప్రోత్సాహం లభిస్తుంది. ఉత్సాహంతో బాధ్యతలను పూర్తి చేస్తారు. వ్యాపారాలు నిలకడగా ముందుకు సాగుతాయి. ఆర్థిక ప్రయత్నాలు బాగా కలిసి వస్తాయి. ఆదాయం వృద్ది చెందుతుంది. బంధువులతో సాన్నిహిత్యం పెరుగుతుంది. కొందరు స్నేహితుల వల్ల డబ్బు నష్టపోయే అవకాశం ఉంది. ఆహార, విహారాల్లో జాగ్రత్తగా ఉండడం మంచిది. దాంపత్యంలో అన్యోన్యత పెరుగుతుంది. పిల్లల నుంచి ఆశించిన శుభవార్తలు వింటారు.

కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3): ఉద్యోగంలో కాస్తంత ఒత్తిడి ఉండే అవకాశం ఉంది. అలవికాని లక్ష్యాలను అప్పగించే సూచనలున్నాయి. వృత్తి జీవితంలో ఏమాత్రం తీరిక లేని పరిస్థితి ఏర్పడుతుంది. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. నిరుద్యోగులు విదేశాల నుంచి ఆశించిన సమాచారం వింటారు. తలపెట్టిన పనుల్ని సకాలంలో పూర్తి చేస్తారు. రియల్ ఎస్టేట్, లిక్కర్, రాజకీయాలు, ఇతర బిజినెట్ రంగాలలో ఉన్న వారికి అనుకూల వాతావరణం కనిపిస్తోంది. ఆస్తి సంబంధమైన వివాదాలు సర్దుమణుగుతాయి.

మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి): వ్యక్తిగతంగా ఆశించిన పురోభివృద్ధి ఉంటుంది. ఉద్యోగంలో అధికారులు కొన్ని ప్రత్యేక బాధ్యతలు అప్పగిస్తారు. డాక్టర్లు, లాయర్లు తదితర వృత్తి నిపుణులకు గుర్తింపుతో పాటు డిమాండ్ పెరుగుతుంది. కొత్త వ్యాపారాల్లో సైతం ఆశించిన లాభాలు కనిపిస్తాయి. ఇష్టమైన బంధువులు ఇంటికి వచ్చే అవకాశం ఉంది. అదనపు ఆదాయ ప్రయత్నాలు ఆశించిన దాని కంటే ఎక్కువగా సత్ఫలితాలనిస్తాయి. ఆర్థిక లావాదేవీలు, స్పెక్యులేషన్ బాగా లాభిస్తాయి. అరుదైన గౌరవాలు లభిస్తాయి.

జనాలు రోడ్డు మీదకి వచ్చి టపాసులు కాల్చుతున్నారంటే.. అర్థమైందిలే..
జనాలు రోడ్డు మీదకి వచ్చి టపాసులు కాల్చుతున్నారంటే.. అర్థమైందిలే..
వామ్మో.. స్నానం చేయకుండా టిఫిన్ తింటే ఇంత డేంజరా.. గరుడపురాణం..
వామ్మో.. స్నానం చేయకుండా టిఫిన్ తింటే ఇంత డేంజరా.. గరుడపురాణం..
పార్లర్‌కి వెళ్లాల్సిన పనే లేదు ఈ టిప్స్‌తో మెరిసే చర్మం మీ సొంతం
పార్లర్‌కి వెళ్లాల్సిన పనే లేదు ఈ టిప్స్‌తో మెరిసే చర్మం మీ సొంతం
యశస్వి జైస్వాల్ సరికొత్త రికార్డు.. కోహ్లీ, రోహిత్ సరసన చోటు
యశస్వి జైస్వాల్ సరికొత్త రికార్డు.. కోహ్లీ, రోహిత్ సరసన చోటు
అనంత్ అంబానీ ధరించిన వాచ్ ధర ఎంతో తెలిస్తే మతిపోతుంది!
అనంత్ అంబానీ ధరించిన వాచ్ ధర ఎంతో తెలిస్తే మతిపోతుంది!
ఒక రాత్రి.. రెండు ప్రాణాలు.. తల్లీకొడుకుల మరణం వెనక ఏం జరిగింది?
ఒక రాత్రి.. రెండు ప్రాణాలు.. తల్లీకొడుకుల మరణం వెనక ఏం జరిగింది?
ముద్దుగున్న పొద్దుతిరుగుడుతో పుష్కలమైన ఆరోగ్యం.. విత్తనాలే కాదు..
ముద్దుగున్న పొద్దుతిరుగుడుతో పుష్కలమైన ఆరోగ్యం.. విత్తనాలే కాదు..
మళ్లీ విజృంభిస్తున్న కోహ్లీ ఫాంకు సీక్రెట్ అదేనట
మళ్లీ విజృంభిస్తున్న కోహ్లీ ఫాంకు సీక్రెట్ అదేనట
నిజంగా జీలకర్ర నీరు తాగితే పొట్ట తగ్గుతుందా.. అపోహలు కాదు..
నిజంగా జీలకర్ర నీరు తాగితే పొట్ట తగ్గుతుందా.. అపోహలు కాదు..
ఇంటి అద్దె ఎగ్గొట్టడానికి ఇంత దారుణమా..?
ఇంటి అద్దె ఎగ్గొట్టడానికి ఇంత దారుణమా..?