Horoscope Today: వీరు ఖర్చులు పెరగకుండా చూసుకోవాలి.. ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండాలి.. నేటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే..

Horoscope Today: వీరు ఖర్చులు పెరగకుండా చూసుకోవాలి.. ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండాలి.. నేటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే..

Horoscope Today (12.05.2022): రోజులో ఏ పని మొదలు పెట్టాలన్నా సరే తమకు ఈరోజు ఎలా ఉంటుంది అని ఆలోచిస్తారు. వెంటనే తమ దినఫలాల(Horoscope) వైపు దృష్టి సారిస్తారు. ఈ క్రమంలో మేషం నుంచి మీనం వరకు అన్ని రాశుల వారికి మే 12 గురువారం రాశి ఫలాలు(Rashi Phalalu) ఎలా ఉన్నాయో తెలుసుకుందాం రండి.

Basha Shek

|

May 12, 2022 | 5:42 AM

Horoscope Today (12.05.2022): కొత్త పనులను మొదలు పెట్టాలన్నా, శుభకార్యాలు చేపట్టాలన్నా కొందరు తమ జాతకాలు, రాశిఫలాలను అనుసరించేవారు చాలామంది ఉన్నారు. అంతెందుకు రోజులో ఏ పని మొదలు పెట్టాలన్నా సరే తమకు ఈరోజు ఎలా ఉంటుంది అని ఆలోచిస్తారు. వెంటనే తమ దినఫలాల(Horoscope) వైపు దృష్టి సారిస్తారు. ఈ క్రమంలో మేషం నుంచి మీనం వరకు అన్ని రాశుల వారికి మే 12 గురువారం రాశి ఫలాలు(Rashi Phalalu) ఎలా ఉన్నాయో తెలుసుకుందాం రండి.

మేషం గొప్పవారితో పరిచయాలు ఏర్పడుతాయి. ముఖ్యమైన, కీలకమైన విషయాల్లో పురోగతి ఉంటుంది. మంచి పనులు ప్రారంభిస్తారు. మంచి పనులు చేపడతారు. గొప్ప వారితో సత్సాంగత్యం ఏర్పడుతుంది. కీలక విషయాల్లో పురోగతి ఉంటుంది. ఆంజనేయ స్వామిని ఆరాధించడం వల్ల సానుకూల ఫలితాలు పొందుతారు.

వృషభం శ్రమాధిక్యం ఉంటుంది. కీలక విషయాల్లో కుటుంబ సభ్యులు, సన్నిహితుల సలహాలు తీసుకోవడం వల్ల ఇబ్బందులు తగ్గుతాయి. ఇబ్బందులు ఎదురైనా మనోధైర్యం కోల్పోకూడదు. ఖర్చులు పెరగకుండా చూసుకోవాలి. ప్రయాణాల్లో జాగ్రత్తలు అవసరం. దుర్గా ధ్యాన శ్లోకం పఠిస్తే శుభం కలుగుతుంది.

మిథునం ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు ఎదురవుతాయి. బాగా శ్రమపడితే తప్ప పనులు పూర్తికావు. కీలక విషయాల్లో బాగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. అవసరమైతే పెద్దల సలహాలు తీసుకోవాలి. ఆహారం, ఆరోగ్యం విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలి. ఆంజనేయ స్వామిని దర్శించుకుంటే మేలు జరుగుతుంది.

కర్కాటకం వీరికి శుభ ఘడియలు నడుస్తున్నాయి. వృత్తి,ఉద్యోగ,వ్యాపారాల్లో సానుకూల ఫలితాలు అందుకుంటారు. అభివృద్ధికి సంబంధించిన ఒక వార్త వింటారు. కుటుంబీకులు, బంధు,మిత్రులతో కలిసి శుభకార్యక్రమాల్లో పాల్గొంటారు. కీలక విషయాల్లో కుటుంబీకుల సలహాలు పాటించడం మంచిది.

సింహం ఈ రాశివారు సమయస్ఫూర్తితో వ్యవహరిస్తారు. సందర్భోచితంగా కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ఇతరుల చెప్పుడు మాటలను వినకపోవడం మంచిది. ప్రయాణాలలో ఆటంకాలు ఎదురవుతాయి. సుబ్రహ్మణ్యస్వామిని పూజిస్తే సానుకూల ఫలితాలు అందుకుంటారు.

కన్య కృషికి తగ్గ ఫలితాలు ఉన్నాయి. కీలక వ్యవహారాల్లో కుటుంబీకులు, పెద్దల సలహాలు, సూచనలు తీసుకోవడం వల్ల మంచి ఫలితాలు అందుకుంటారు. పరమేశ్వరుడిని దర్శించుకుంటే శుభం కలుగుతుంది.

తుల ఈరాశి వారికి పనిలో శ్రమ పెరుగుతుంది. కానీ కొన్ని సందర్భాల్లో సర్దుకుపోయే తత్వం గొప్ప ఫలితాలను తెచ్చి పెడుతుంది. వ్యాపారంలో అనుభవజ్ఞుల సలహాలు పాటించడం మంచిది. దుర్గాధ్యానం వల్ల మేలు చేకూరుతుంది.

వృశ్చికం భవిష్యత్తు ప్రణాళికలకు సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకుంటారు. కుటుంబీకులతో కలిసి శుభకార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆదాయానికి తగ్గట్లే ఖర్చులుంటాయి. ప్రయాణాలు ఫలిస్తాయి. శివనామస్మరణ వల్ల సానుకూల ఫలితాలు అందుకుంటారు.

ధనస్సు వీరికి శుభ ఘడియలు నడుస్తున్నాయి. కాలాన్ని మంచి పనుల కోసం వినియోగించండి. ఇష్టదైవారాధనతో గొప్ప ఫలితాలను అందుకుంటారు. కొన్ని సంఘటనలు మానసిక ఆనందాన్ని కలిగిస్తాయి. ఆంజనేయస్వామిని దర్శించుకోవడం శుభం కలుగుతుంది.

మకరం ఆలోచనాలు, నిర్ణయాల్లో స్థిరంగా ఉండాలి. కుటుంబీకులు, బంధువులతో ప్రేమగా వ్యవహరించాలి. కొన్ని సమస్యలు ఎదురవుతాయి. అయినా మనోధైర్యాన్ని కోల్పోకుండా ముందుకు సాగాలి. ఆంజనేయ స్వామిని పూజిస్తే మంచి జరుగుతుంది.

కుంభం మనసు పెట్టి పనిచేస్తే విజయం మీదే. స్నేహితుల సహకారం లాభిస్తుంది. శ్రమాధిక్యం తప్పదు. ఆరోగ్యం విషయంలో అప్రమత్తంగా ఉండాలి. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. దత్తాత్రేయ స్వామిని ఆరాధించడం వల్ల మేలే చేకూరుతుంది.

మీనం ఆయా రంగాల్లో తోటివారి సహాయ సహకారాలు లభిస్తాయి. కుటుంబీకులు, బంధు,మిత్రులతో సంతోషంగా గడుపుతారు. సమయస్ఫూర్తితో సమస్యలను పరిష్కరించుకుంటారు. ప్రయాణాలు ఫలిస్తాయి. గణపతి దేవుడిని పూజిస్తే శుభం కలుగుతుంది.

Note: (రాశిఫలాలు అనేవి నమ్మకం మీద ఆధారపడి ఉంటాయి. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించబడింది.)

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం క్లిక్ చేయండి..

Also Read:

ఇవి కూడా చదవండి

Gastroenteritis: అక్కడ భారీగా పెరుగుతోన్న గ్యాస్ట్రో ఎంటెరిటిస్ కేసులు.. బాధితులతో నిండిపోతున్న ఆస్పత్రులు.. కారణమేంటంటే..

RR vs DC, IPL 2022: దంచికొట్టిన మార్ష్‌, వార్నర్‌.. RRపై ఢిల్లీ సూపర్‌ విక్టరీ.. ప్లే ఆఫ్‌ అవకాశాలు సజీవం..

Sarkaru Vaari Paata: సర్కారు వారి పాటకు తెలంగాణ సర్కార్‌ మరో గుడ్‌ న్యూస్‌.. ఆ థియేటర్లలో ఉదయం 4 నుంచే స్పెషల్ షోలు..

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu