AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Horoscope Today: హమ్మయ్య.. వ్యక్తిగత సమస్యల నుంచి వారికి విముక్తి..12 రాశుల వారికి రాశిఫలాలు

Today Horoscope (March 09, 2026): మేష రాశి వారికి ఈ రోజు ఉద్యోగంలో మరింత అనుకూల వాతావరణం ఉంటుంది. అదనపు ఆదాయ మార్గాలు విస్తరిస్తాయి. వృషభ రాశికి చెందిన వారికి వృత్తి, వ్యాపారాల్లో సొంత ఆలోచనలు లాభాలనిస్తాయి. ఇంటా బయటా అనుకూలతలు బాగా పెరుగుతాయి. మిథున రాశి వారికి ఉద్యోగంలో కొన్ని అదనపు బాధ్యతల వల్ల విశ్రాంతి కరవవుతుంది. కుటుంబంలో పండగ వాతావరణం నెలకొంటుంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి సోమవారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..?

Horoscope Today: హమ్మయ్య.. వ్యక్తిగత సమస్యల నుంచి వారికి విముక్తి..12 రాశుల వారికి రాశిఫలాలు
Daily Horoscope 09 March 2026
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Mar 09, 2026 | 5:31 AM

Share

దిన ఫలాలు (మార్చి 9, 2026): మేష రాశి వారికి ఈ రోజు ఉద్యోగంలో మరింత అనుకూల వాతావరణం నెలకొనే అవకాశముంది. వృషభ రాశికి చెందిన వారికి ఇంటా బయటా అనుకూలతలు బాగా పెరుగే సూచనలు ఉన్నాయి.  మిథున రాశి వారికి కుటుంబంలో పండగ వాతావరణం నెలకొంటుంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి సోమవారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..?

మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)

ఉద్యోగంలో మరింత అనుకూల వాతావరణం ఉంటుంది. వృత్తి, వ్యాపారాలు లాభాలపరంగా వృద్ధి చెందుతాయి. కుటుంబ సభ్యులతో విహార యాత్రకు ప్లాన్ చేస్తారు. అదనపు ఆదాయ మార్గాలు విస్తరిస్తాయి. ముఖ్యమైన వ్యవహారాలు సంతృప్తికరంగా పూర్తవుతాయి. నిరుద్యోగులకు ఆశించిన సమాచారం అందుతుంది. కొందరు మిత్రులకు అండగా నిలబడతారు. ఆహార, విహారాల్లో వీలైనంత జాగ్రత్తగా ఉండడం మంచిది. పెళ్లి ప్రయత్నాల్లో ఆశించిన సానుకూల స్పందన లభిస్తుంది.

వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)

ఉద్యోగులకు అధికారులు మీ మీద ఎక్కువగా ఆధారపడడం జరుగుతుంది. వృత్తి, వ్యాపారాల్లో సొంత ఆలోచనలు లాభాలనిస్తాయి. ఇంటా బయటా అనుకూలతలు బాగా పెరుగుతాయి. ముఖ్య మైన పనులు, వ్యవహారాలు సకాలంలో, సంతృప్తికరంగా పూర్తవుతాయి. ఆర్థిక పరిస్థితి గతం కంటే చాలా వరకు మెరుగ్గా ఉంటుంది. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండడం మంచిది. వ్యక్తిగత సమస్యలు తగ్గుముఖం పడతాయి. ప్రస్తుతానికి ప్రయాణాలు పెట్టుకోవద్దు. శుభవార్తలు వింటారు.

మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)

ఉద్యోగంలో కొన్ని అదనపు బాధ్యతల వల్ల విశ్రాంతి కరవవుతుంది. వృత్తి, వ్యాపారాలు లాభదాయకంగా సాగిపోతాయి. కుటుంబంలో పండగ వాతావరణం నెలకొంటుంది. ఆధ్యాత్మిక విషయాలపై ఆసక్తి పెరుగుతుంది. తలపెట్టిన పనులు నిదానంగా పూర్తవుతాయి. పిల్లలు చదువుల్లో విజయాలు సాధిస్తారు. స్వల్ప అనారోగ్యానికి అవకాశం ఉంది. నిరుద్యోగులకు మంచి కంపెనీల నుంచి ఆఫర్లు అందుతాయి. ఉద్యోగం మారే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ప్రయాణాలు లాభిస్తాయి.

కర్కాటకం (పునర్వసు 4, పు‌ష్యమి, ఆశ్లేష)

వృత్తి, ఉద్యోగాల్లో సానుకూల వాతావరణం ఉంటుంది. అధికారులను మీ పనితీరుతో బాగా ఆకట్టుకుంటారు. ఇష్టమైన బంధువుల రాకపోకలుంటాయి. ఆదాయానికి లోటుండదు. నిరుద్యోగులకు దూర ప్రాంతం నుంచి శుభవార్త అందవచ్చు. పెళ్లి ప్రయత్నాలు చాలావరకు సానుకూలపడతాయి. చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తవుతాయి. ఆర్థిక పరిస్థితి ఉత్సాహంగా సాగిపోతుంది. ఒకటి రెండు వ్యక్తిగత సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. ఎవరికీ హామీలు ఉండవద్దు.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)

ఉద్యోగంలో ఒకటి రెండు సమస్యలుంటాయి. అధికారులతో ఆచితూచి వ్యవహరించడం చాలా మంచిది. వృత్తి జీవితం సామాన్యంగా సాగిపోతుంది. ఆదాయం నిలకడగా ఉంటుంది కానీ, ఇంటి ఖర్చులు పెరుగుతాయి. ఆర్థిక వ్యవహారాల్లో ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టడం శ్రేయస్కరం. కుటుంబ సభ్యులతో కలిసి విహారానికి వెళ్లడం జరుగుతుంది. వ్యాపారం పరవాలేదనిపిస్తుంది. బంధుమిత్రులకు ఆర్థికంగా సహాయం చేస్తారు. ఎవరికీ గుడ్డిగా నమ్మవద్దు.

కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)

ఉద్యోగంలో ఉత్సాహవంతమైన వాతావరణం ఉంటుంది. వృత్తి, వ్యాపారాలలో అంచనాలకు మించి లాభాలు గడిస్తారు. ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. పెండింగ్ పనులు పూర్తయి ఊరట లభిస్తుంది. కుటుంబ సభ్యులతో సరదాగా గడుపుతారు. ఆర్థిక సమస్యల నుంచి చాలావరకు బయటపడతారు. ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగ ప్రయత్నాలు కలిసి వస్తాయి. పెళ్లి ప్రయత్నాల్లో చికాకులుంటాయి. వ్యక్తిగత సమస్య ఒకటి పరిష్కారమవుతుంది.

తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)

ఉద్యోగాల్లో ప్రాధాన్యం, ప్రాభవం పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాలు వృద్ధి చెందుతాయి. వృత్తి జీవితంలో క్షణం కూడా తీరిక ఉండని పరిస్థితి ఏర్పడుతుంది. ఆర్థిక విషయాలకు సమయం బాగా అనుకూలంగా ఉంది. తక్కువ శ్రమతో ఎక్కువ లాభాలు పొందుతారు. నిరుద్యోగులు శుభవార్తలు వింటారు. ఆదాయానికి లోటుండకపోవచ్చు. కుటుంబం మీద ఎక్కువగా ఖర్చు చేయడం జరుగుతుంది. కుటుంబ పరిస్థితులు సాఫీగా, సానుకూలంగా సాగుతాయి. ఆరోగ్యం బాగానే ఉంటుంది.

వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట)

ఉద్యోగపరంగా శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. వృత్తి, వ్యాపారాల్లో సామాన్య లాభాలుంటాయి. కుటుంబ సభ్యుల నుంచి అన్ని విషయాల్లోనూ ఆశించిన సహాయ సహకారాలు లభిస్తాయి. ఒకటి రెండు ముఖ్యమైన ఆర్థిక సమస్యలు తగ్గుముఖం పడతాయి. మంచి పరిచయాలు ఏర్పడుతాయి. తలపెట్టిన వ్యవహారాల్లో సానుకూలంగా పూర్తవుతాయి. నిరుద్యోగులకు ఆశించిన శుభ వార్తలు అందుతాయి. ఆహార, విహారాల్లోనూ, ప్రయాణాల్లోనూ వీలైనంత జాగ్రత్తగా ఉండాలి.

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)

ఉద్యోగంలో అధికారుల నుంచి ఊహించని ప్రోత్సాహం, ఆదరణ లభిస్తాయి. వృత్తి, వ్యాపారాల్లో అంచనాలకు మించి లాభాలు అందే అవకాశం ఉంది. చేపట్టిన పనులు, వ్యవహారాలు సకాలంలో, ఆశించిన విధంగా పూర్తవుతాయి. ఇంటా బయటా గౌరవ మర్యాదలు పెరుగుతాయి. కుటుంబ సభ్యులతో ఇష్టమైన ఆలయాల దర్శనాలు చేసుకుంటారు. నిరుద్యోగులకు మంచి ఆఫర్లు అందుతాయి. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. ఆరోగ్యం బాగా మెరుగుపడుతుంది.

మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2)

వృత్తి, ఉద్యోగాల్లో పనిభారం కాస్తంత ఎక్కువగానే ఉంటుంది. విశ్రాంతి బాగా తగ్గుతుంది. అయితే, ఆశించిన స్థాయిలో ప్రతిఫలం ఉంటుంది. ఉద్యోగపరంగా శుభవార్తలు అందుతాయి. వృత్తి జీవితంలో మార్పులు చోటు చేసుకుంటాయి. వ్యాపారాల్లో ఆశించిన లాభాలుంటాయి. స్వల్ప అనారోగ్యానికి అవకాశం ఉంది. ఉద్యోగం మారడానికి చేసే ప్రయత్నాలు ఫలించవచ్చు. కొందరు బంధువుల వల్ల ఇబ్బందులుంటాయి. ఆర్థిక వ్యవహారాల్లో ఎంతో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది.

కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)

ఉద్యోగం సాదా సీదాగా సాగిపోతుంది. వృత్తి, వ్యాపారాల్లో ఆశించిన పురోగతి ఉంటుంది. అదనపు ఆదాయ మార్గాల ద్వారా ఆశించిన ధనం సంపాదించడం జరుగుతుంది. ముఖ్యమైన పనులు నిదానంగా పూర్తవుతాయి. మీ నుంచి ఆర్థికంగా సహాయం పొందినవారు ముఖం చాటేస్తారు. ప్రస్తుతానికి ఆర్థిక లావాదేవీలు పెట్టుకోవద్దు. ఇంటా బయటా ఒత్తిడి ఉంటుంది. ఆదాయం నిలకడగా ఉంటుంది. కుటుంబ పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. ఆరోగ్యం పరవాలేదనిపిస్తుంది.

మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)

వృత్తి, ఉద్యోగాలు సానుకూలంగా సాగిపోతాయి. ఆర్థిక వ్యవహారాలు అనుకూలంగా సాగిపోతాయి. ఉచిత సహాయాలు, దానధర్మాలు తగ్గించుకోవడం మంచిది. మిత్రుల వల్ల ధన నష్టం జరిగే అవకాశం ఉంది. ఆదాయానికి లోటుండదు. ఇప్పుడు తీసుకునే నిర్ణయాల వల్ల మంచి ఫలితాలుంటాయి. ఆరోగ్యానికి, ఆదాయానికి ఢోకా ఉండదు. కొందరు బంధువులకు ఆర్థికంగా సహాయం చేస్తారు. కుటుంబ సభ్యుల సాయంతో ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు. ప్రయాణాలు లాభిస్తాయి.

Follow Us