Horoscope Today: వీరు వివాదాలకు దూరంగా ఉండాలి. అనవసర ఖర్చులు కూడా.. గురవారం రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే?
Horoscope Today: ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలున్నాయి. చేపట్టిన కార్యక్రమాల్లో అడ్డంకులు ఎదురవుతాయి. అనుకోకుండా జరిగిన కొన్ని సంఘటనలు కాస్త నిరుత్సాహపరుస్తాయి.
మేషం కార్యదీక్ష, పట్టుదలతో అనుకున్నది సాధిస్తారు. స్నేహితుల సహకారంతో కీలక వ్యవహారాలు, పనుల్లో ముందడుగు వేస్తారు. శ్రీరామనామాన్ని జపించడం వల్ల మరిన్ని ఉత్తమ ఫలితాలు అందుకోవచ్చు.
వృషభం చేపట్టిన రంగాల్లో ప్రోత్సాహకరమైన వాతావరణం ఉంటుంది. ప్రయత్నకార్యసిద్ధి ఉంది. కీలక వ్యవహారాల్లో ముందడుగు వేస్తారు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని దర్శించుకుంటే మేలు జరుగుతుంది.
మిథునం ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలున్నాయి. చేపట్టిన కార్యక్రమాల్లో అడ్డంకులు ఎదురవుతాయి. అనుకోకుండా జరిగిన కొన్ని సంఘటనలు కాస్త నిరుత్సాహపరుస్తాయి. అనవసర ఖర్చులు పెరుగుతాయి. లక్ష్మీ దేవిని ఆరాధిస్తే మేలు జరుగుతుంది.
కర్కాటకం ముఖ్యమైన పనుల్లో అనుభవజ్ఞుల సలహాలు, సూచనలు తీసుకోవడం మంచిది. వివాదాలకు దూరంగా ఉండాలి. ప్రశాంతంగా ఆలోచించాలి. దుర్గాదేవిని పూజిస్తే మంచి ఫలితాలు అందుకుంటారు.
సింహం వృత్తి,ఉద్యోగాది రంగాల్లో అనుకూల ఫలితాలు పొందుతారు. సమాజంలో కీర్తిప్రతిష్టలు పెరుగుతాయి. కీలక వ్యవహారాల్లో ప్రణాళికలకు అనుగుణంగా ముందుడుగు వేస్తారు. గోవింద నామాలు పఠించడం వల్ల శుభం కలుగుతుంది.
కన్య వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో సానుకూల ఫలితాలు ఉన్నాయి. కీలక వ్యవహారాల్లో మరింత అప్రమత్తంగా ఉండాలి. అనవసర గొడవలు, వివాదాలకు దూరంగా ఉండాలి. ఇష్టదైవరాధన మాత్రం మానవద్దు.
తుల ఇష్టమైన వారితో కాలాన్ని గడుపుతారు. ప్రతిభకు తగ్గ ప్రశంసలు అందుకుంటారు. కీలక పనుల్లో డబ్బు చేతికి అందుతుంది. స్థిరమైన ఆలోచనలతో అనుకున్నది సాధిస్తారు. శ్రీలక్ష్మీ అష్టోత్తర శతనామావళి పఠించడం వల్ల మేలు కలుగుతుంది.
వృశ్చికం కీలక వ్యవహారాల్లో ఆటంకాలు ఎదురవుతాయి. మనోధైర్యం తగ్గకుండా చూసుకోవాలి. ఓర్పు, సహనం చాలా అవసరం. నవగ్రహధ్యాన శ్లోకం పఠిస్తే శుభం కలుగుతుంది.
ధనస్సు వీరికి శుభకాలం నడుస్తోంది. మనోధైర్యంతో అనుకున్న ఫలితాలు సాధిస్తారు. ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు అందుకుంటారు. ఇష్టదేవతా శ్లోకాలు పఠిస్తే మేలు జరుగుతుంది.
మకరం ఈ రాశివారికి సానుకూల ఫలితాలు ఉన్నాయి. మరింత ఉత్సాహంగా పనిచేయాలి. ఆరోగ్యం కూడా బాగా సహకరిస్తుంది. శ్రీరామ నామాన్ని స్మరించడం వల్ల మరిన్ని ఉత్తమ ఫలితాలు పొందుతారు.
కుంభం చేపట్టిన పనుల్లో ఆటంకాలు ఎదురవుతాయి. కీలక వ్యవహారాల్లో పెద్దల సలహాలు తీసుకోవడం మంచిది. కొన్ని విషయాలు నిరుత్సాహ పరుస్తాయి. బంధు, మిత్రులను కలుస్తారు. దత్తాత్రేయ స్తోత్రం చదివితే మంచిది.
మీనం ఈ రాశివారికి మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. చేపట్టిన పనులలో ఆటంకాలు ఎదురైనా అధిగమించే ప్రయత్నం చేస్తారు. భవిష్యత్తు ప్రణాళికలపై ఆలోచిస్తారు. అయితే కొన్ని విషయాల్లో అస్థిర ఆలోచనలతో ఇబ్బందులు పడతారు. ఇష్టదేవతలను పూజిస్తే మంచిది.
NOTE: (రాశిఫలాలు అనేవి నమ్మకం మీద ఆధారపడి ఉంటాయి. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించబడింది.)
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.