Horoscope Today: మంగళవారం రాశిఫలాలు.. ఈరోజు ఈ రాశివారు ప్రయాణ సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవడం మేలు..
తమ దినఫలాల( Daily Horoscope) వైపు దృష్టి సారిస్తారు. ఈ నేపథ్యంలో ఈరోజు (జూలై 19వ తేదీ ) మంగళవారం రాశి ఫలాలు (Rashi Phalalu) ఎలా ఉన్నాయో తెలుసుకుందాం..!
Horoscope Today (19-07-2022): ఉద్యోగం, వ్యాపారం, విద్య ఇలా ఎవరైనా సరే రోజులో ఎక్కడివెళ్లాలన్నా, ఏ కొత్త పనులు మొదలు పెట్టాలన్నా..మంచి చెడుల గురించి ఆలోచిస్తారు. ఈరోజు తమకు ఎలా ఉంటుందో అని తెలుసుకోవడానికి ఆసక్తిని చూపిస్తున్నారు. దీంతో తమ దినఫలాల( Daily Horoscope) వైపు దృష్టి సారిస్తారు. ఈ నేపథ్యంలో ఈరోజు (జూలై 19వ తేదీ ) మంగళవారం రాశి ఫలాలు (Rashi Phalalu) ఎలా ఉన్నాయో తెలుసుకుందాం..!
మేష రాశి: ఈ రాశివారు ఈరోజు అధిక వ్యయం కాకుండా చూసుకోవాల్సి ఉంటుంది. శ్రమకు తగిన ఫలితాలను అందుకుంటారు. పరిచయం లేనివారితో జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది. ఇతరులతో కలహాలు ఏర్పడే అవకాశం ఉంది తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది.
వృషభ రాశి: ఈరోజు ఈ రాశివారు మానసికంగా సంతోషంగా గడుపుతారు. అనారోగ్య సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. తొందర పాటు పడకుండా జాగ్రత్త వహించాల్సి ఉంటుంది. ప్రయత్నాలు ఫలిస్తాయి.
మిధున రాశి: ఈ రోజు ఈ రాశివారు శ్రమ పెరగకుండా చూసుకోవాల్సి ఉంటుంది. కుటుంబ సభ్యుల సహకారంతో ముఖమైన పనులను ప్రారంభించండి. మానసిక విచారానికి కారణమయ్యే విషయాలకు దూరంగా ఉండండి.
కర్కాటక రాశి: ఈ రాశివారు కీలక సమస్యలను పరిష్కరించుకుంటారు. ఆరోగ్యపై శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. ముఖ్యమైన పనులను చేపట్టే సమయంలో అప్రమత్తంగా ఉండాలి.
సింహ రాశి: ఈరోజు ఈ రాశివారికి శుభకాలం. బంధు, మిత్రులతో కలిసి విందు, వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. చిత్త శుద్ధితో పనులను పూర్తి చేస్తారు. శారీరక శ్రమ పెరగకుండా చూసుకోవాల్సి ఉంటుంది.
కన్య రాశి: ఈ రాశివారు ఈరోజు శుభవార్త వింటారు. బంధు, మిత్రుల వలన మేలు జరుగుతుంది. శుభకార్యాల్లో పాల్గొంటారు. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు. చేపట్టిన పనులను పూర్తి చేయడానికి ఈరోజు అనుకూలం.
తుల రాశి: ఈ రోజు ఈ రాశివారికి కీలక విషయాల్లో మిత్రుల సహాయ సహకారాలు అందుతాయి.చేపట్టిన పనులు పూర్తి చేస్తారు. మిత్రులతో సంతోషంగా గడుపుతారు.
వృశ్చిక రాశి: ఈరోజు ఈ రాశివారు వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాలోని వారు అధిక శ్రమ చేయాల్సి ఉంటుంది. ఇతరులను కలుపుకుని వెళ్లడం వలన సమస్యలను అధిగమిస్తారు. అనవసరంగా ఆందోళన పడటం తగ్గించుకుంటే మంచిది. ప్రయాణాలు చేసే సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.
ధనస్సు రాశి: ఈరోజు ఈ రాశివారు మిశ్రమ ఫలితాలను అందుకుంటారు. శుభ వార్తలు వింటారు. అధిక వ్యయం అయ్యే సూచనలున్నాయి. స్థిర నిర్ణయాలు తీసుకోవడంలో ఇబ్బంది పడతారు.
మకర రాశి: ఈరోజు ఈ రాశివారు ప్రారంభించిన పనుల్లో ఆటంకాలు ఎదురైనా పూర్తి చేస్తారు. వృత్తి, వ్యాపార, ఉద్యోగ రంగంలోని వారు తగిన జాగ్రత్తలతో మెలగాల్సి ఉంటుంది. నమ్మినవారే ఇబ్బంది పెట్టె అవకాశం ఉంది.
కుంభ రాశి: ఈ రోజు ఈరాశివారు బంధు, మిత్రులతో విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆర్ధికంగా శుభఫలితాలను అందుకుంటారు. చేపట్టిన పనులలో విజయాన్ని సొంతం చేసుకుంటారు.
మీన రాశి: ఈరోజు ఈ రాశివారు ముఖ్యమైన విషయాల్లో తగిన ఆలోచనలు చేయాల్సి ఉంటుంది. వృత్తి, ఉద్యోగ రంగాల్లోని వారు శుభ ఫలితాలను అందుకుంటారు. మీ పని తీరుతో ఇతరులతో ప్రశంసలను అందుకుంటారు. కుటుంబ సభ్యుల సహకారం ఉంటుంది.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Note: (రాశిఫలాలు అనేవి నమ్మకం మీద ఆధారపడి ఉంటాయి. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించబడింది.)