AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Horoscope Today: రాశి ఫలాలు.. ఈ రాశి వారు ఆ విషయాలలో జాగ్రత్తగా ఉండాలి..!

Horoscope Today: చాలా మందికి తమ భవిష్యత్తు గురించి తెలుసుకుంటుంటారు. ప్రతి రోజు ఉదయం ఆ రోజు భవిష్యత్తు ఎలా ఉంటుందని తెలుసుకునే ప్రయత్నం చేస్తారు...

Horoscope Today: రాశి ఫలాలు.. ఈ రాశి వారు ఆ విషయాలలో జాగ్రత్తగా ఉండాలి..!
Subhash Goud
|

Updated on: Feb 16, 2022 | 6:31 AM

Share

Horoscope Today: చాలా మందికి తమ భవిష్యత్తు గురించి తెలుసుకుంటుంటారు. ప్రతి రోజు ఉదయం ఆ రోజు భవిష్యత్తు ఎలా ఉంటుందని తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. ఏ పనులు చేపడితే ఎలాంటి ఫలితాలు ఉంటాయి.. ఎలా ముందుకు సాగాలి అనే విషయాలపై దృష్టి సారిస్తారు. దీంతో చాలా మంది తమ తమ రాశి ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుంటారు. ఫిబ్రవరి 16 (బుధవారం) రాశి ఫలాలు ఎలా ఉండనున్నాయో తెలుసుకుందాం.

మేష రాశి:

ఉపయోగకరమైన పనులను చేపడతారు. కీలక విషయాలలో పురోగతి సాధిస్తారు. ఆర్థిక ఇబ్బందులు తొలగుతాయి. ప్రయాణాల్లో జాగ్రత్తలు అవసరం.

వృషభ రాశి:

శ్రమతో కూడిన ఫలితాలు ఉంటాయి. ఇతరులను కలుపుకొని పోవడం వల్ల ఇబ్బందులు తొలగుతాయి. మనోబలం తగ్గకుండా చూసుకోవాలి.

మిథున రాశి:

బంధుమిత్రుల సలహాలు, సూచనలు పొందడం మంచిది. తోటి వారిత శుభకార్యక్రమాలలో పాల్గొంటారు. దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది.

కర్కాటక రాశి:

శ్రమకు తగిన ఫలితం ఉంటుంది. కొత్త వ్యాపారాలు ప్రారంభిస్తారు. శుభవార్తలు వింటారు. కొన్ని విషయాలు మిమ్మల్ని ఆనందపరుస్తాయి.

సింహ రాశి:

ఒక వార్త మీ ఇంట్లో ఆనందాన్ని కలిగిస్తుంది. కొన్ని విషయాలు మిమ్మల్ని నిరుత్సాహపరుస్తాయి. గిట్టని వారితో జాగ్రత్తగా ఉండటం మంచిది.

కన్య రాశి:

కీలక నిర్ణయాలు తీసుకుంటారు. చెప్పిన మాటలు వినకపోవడం మంచిది. ప్రయాణాలు చేస్తారు. శుభకార్యల్లో పాల్గొంటారు.

తుల రాశి:

మానసిక ప్రశాంతత పొందుతారు. బంధుమిత్రుల సలహాలు, సూచనలు పాటించడం మంచిది. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు.

వృశ్చిక రాశి:

అనుకోకుండా ధన లాభం కలుగుతుంది. వ్యాపారాలు ప్రారంభిస్తారు. ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది.

ధనుస్సు రాశి:

అభివృద్ధి వైపు దూసుకెళ్తారు. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. అవసరానికి సహాయం అందుకుంటారు. మంచి పేరు సంపాదించుకుంటారు.

మకర రాశి:

ప్రారంభించిన పనులలో ఆటంకాలు ఏర్పడతాయి. ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదు.

కుంభ రాశి:

చేపట్టే పనులలో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది. పెద్దల ఆశీర్వాదాలు అందుకుంటారు. దూర ప్రయాణాలు చేస్తారు.

మీన రాశి:

కీలక నిర్ణయాలు తీసుకుంటారు. కొన్ని పనులలో ఆటంకాలు ఎదురైనా ధైర్యంతో ముందుకు సాగుతారు. కుటుంబ సభ్యులతో కలిసి ఉండటం మంచిది.

ఇవి కూడా చదవండి:

Statue of Equality: సమతామూర్తిని సందర్శించే భక్తులకు ముఖ్య గమనిక.. ఈ విషయాలను గుర్తుపెట్టుకోండి….

Chankya Niti: ఈ నాలుగు అలవాట్లు ఉన్న వ్యక్తులు ఎప్పుడూ జీవితంలో ఓటమిని ఎదుర్కొంటారు అంటున్న చాణక్య..