Horoscope Today: ఆరోగ్యం విషయంలో వారు జాగ్రత్త.. 12 రాశుల వారికి రాశిఫలాలు
Today Horoscope (December 13, 2025): మేష రాశి వారికి అధికారుల ఆదరణ లభిస్తుంది. ఆర్థిక వ్యవహారాలు సంతృప్తికరంగా పురోగమిస్తాయి. వృషభ రాశి వారికి ఉద్యోగంలో బరువు బాధ్యతలు పెరిగే అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాలు అనుకూలంగా సాగిపోతాయి. మిథున రాశి వారికి ఉద్యోగంలో హోదా పెరిగే అవకాశం ఉంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి శనివారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..?

దిన ఫలాలు (డిసెంబర్ 13, 2025): మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1): వృత్తి, ఉద్యోగాల్లో సమర్థతను నిరూపించుకుంటారు. అధికారుల ఆదరణ లభిస్తుంది. ఆర్థిక వ్యవహారాలు సంతృప్తికరంగా పురోగమిస్తాయి. బంధుమిత్రులకు అండగా నిలబడతారు. వ్యాపారాల్లో పురోగతి సాధిస్తారు. ఇంటా బయటా అనుకూల వాతావరణం ఉంటుంది. బంధువుల నుంచి శుభ వార్తలు వింటారు. మీ మాటకు, చేతకు సర్వత్రా విలువ పెరుగుతుంది. దైవ కార్యాల్లో పాల్గొంటారు. కుటుంబ జీవితం సాఫీగా సాగిపోతుంది. ఆదాయానికి, ఆరోగ్యానికి లోటుండకపోవచ్చు.
వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2): ఉద్యోగంలో బరువు బాధ్యతలు పెరిగే అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాలు అనుకూలంగా సాగిపోతాయి. ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. ఇతరుల వ్యక్తిగత విషయాల్లో జోక్యం చేసుకోకపోవడం మంచిది. ఆర్థిక విషయాల్లో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. నిరుద్యోగులకు ఉద్యోగ యోగం కలిగే అవకాశం ఉంది. కొద్దిగా అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి. ఆర్థిక, ఆస్తి వ్యవహారాలు సజావుగా సాగిపోతాయి. ధనపరంగా ఎవరికీ వాగ్దానాలు చేయకపోవడం మంచిది.
మిథునం (మృగశిర, ఆర్ద్ర, పునర్వసు 1,2,3): ఉద్యోగంలో హోదా పెరిగే అవకాశం ఉంది. డాక్టర్లు, లాయర్లు, ఇంజనీర్లు తదితర వృత్తుల వారు బాగా బిజీ అయిపోతారు. వ్యాపారాలు ఆశాజనకంగా ముందుకు సాగుతాయి. ఆదాయానికి లోటుండదు. సామాజికంగా గౌరవ మర్యాదలు పెరుగుతాయి. నిరుద్యోగులకు ఆశించిన అవకాశాలు అందివస్తాయి. ఆస్తి సంబంధమైన వివాదం ఒకటి అనుకోకుండా పరిష్కారమవుతుంది. మంచి పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది. ఆస్తి, ఆర్థిక వ్యవహారాలలో పురోగతి ఉంటుంది.
కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష): ఉద్యోగ జీవితం ఉత్సాహంగా సాగిపోతుంది. వృత్తి, వ్యాపారాల్లో సమస్యలను అధిగమించి లాభాలు అందుకుంటారు. ఆర్థిక పరిస్థితి చాలావరకు అనుకూలంగా ఉంటుంది. దాదాపు ప్రతి ప్రయత్నమూ లాభిస్తుంది. దైవ, సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి. ప్రముఖుల నుంచి గౌరవాలు పొందుతారు. నిరుద్యోగులు తమకు అందిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవడం మంచిది. ఆరోగ్యం పరవాలేదు. కుటుంబ జీవితం సాఫీగా సాగిపోతుంది.
సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1): వృత్తి, ఉద్యోగాలు ఆశించిన విధంగా ప్రోత్సాహకరంగా ముందుకు సాగుతాయి. ఉద్యోగాల రీత్యా ప్రయాణాలు చేయడానికి అవకాశం ఉంది. వ్యాపారాలు బాగా బిజీగా సాగిపోతాయి. ఆర్థిక, వ్యక్తి గత సమస్యలు కొద్దిగా ఆందోళన కలిగిస్తాయి. కుటుంబ సభ్యుల నుంచి ఒత్తిడి ఉంటుంది. సొంత పనుల మీద ఎక్కువగా శ్రద్ద పెట్టడం అవసరం. అనారోగ్య సమస్యలు కొద్దిగా ఇబ్బంది పెట్టడం జరుగుతుంది. ఆర్థిక వ్యవహారాలు సాఫీగా సాగిపోతాయి. వృథా ఖర్చులు తగ్గించుకోవడం మంచిది.
కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2): ఉద్యోగంలో ఆశించిన ఆదరణ లభిస్తుంది. అధికారులు ప్రత్యేక బాధ్యతలు, లక్ష్యాలతో ప్రోత్సహిస్తారు. వృత్తి, వ్యాపారాల్లో యాక్టివిటీ పెరుగుతుంది. ఆర్థిక వ్యవహారాలు చక్కబడతాయి. కుటుంబ జీవితం ప్రశాంతంగా, సామరస్యంగా సాగిపోతుంది. అనుకోకుండా ఒకటి రెండు వ్యక్తిగత సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. మీ వ్యక్తిగత వ్యవహారాల్లో ఇతరుల జోక్యాన్ని నివారించడం మంచిది. దీర్ఘకాలిక అనారోగ్యం నుంచి ఉపశమనం లభిస్తుంది.
తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3): వృత్తి, ఉద్యోగాల్లో ప్రోత్సాహకర వాతావరణం ఉంటుంది. వ్యక్తిగత సమస్యల నుంచి దాదాపు పూర్తిగా విముక్తి లభిస్తుంది. వ్యాపారాల్లో పురోగతి వేగం పుంజుకుంటుంది. ఎటువంటి ముఖ్య వ్యవహారాన్నయినా తేలికగా పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితి గతం కంటే బాగా మెరుగ్గా ఉంటుంది. ఆదాయానికి, ఆరోగ్యానికి ఢోకా ఉండదు. ఎంత సానుకూల దృక్పథంతో వ్యవహరిస్తే అంత మంచిది. వ్యాపారాలు సాఫీగా, హ్యాపీగా సాగిపోతాయి. సర్వత్రా మీ మాట చెల్లుబాటు అవుతుంది.
వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట): వృత్తి, ఉద్యోగాలు ఉల్లాసంగా, ఉత్సాహంగా సాగిపోతాయి. కుటుంబంలో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. కొత్త ఆలోచనలు, కొత్త నిర్ణయాల వల్ల ప్రయోజనం ఉంటుంది. ఆదాయ వృద్ధికి సంబంధించిన ప్రయత్నాలు కలిసి వస్తాయి. ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. ప్రస్తుతానికి ఇతరులకు హామీలు ఉండడం, వాగ్దానాలు చేయడం ఏమంత శ్రేయస్కరం కాదు. కుటుంబ సభ్యుల నుంచి ఆశించిన సహాయ సహకారాలు అందుతాయి.
ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1): వృత్తి, ఉద్యోగాల్లో పనిభారం పెరిగినప్పటికీ ప్రతిఫలం ఉంటుంది. కొద్ది ప్రయత్నంతో వ్యక్తిగత సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. ఇతరుల వ్యక్తిగత విషయాలకు దూరంగా ఉండడం శ్రేయస్కరం. సొంత పనుల మీద శ్రద్ధ పెట్టడం మంచిది. మిత్రుల సహాయ సహకారాలతో ముఖ్యమైన పనుల్ని పూర్తి చేస్తారు. ఆదాయ వృద్ధికి అవకాశం ఉంది కానీ, ఖర్చులకు కళ్లెం వేయవలసిన అవసరం ఉంది. ఆరోగ్యానికి ఇబ్బందేమీ ఉండకపోవచ్చు. కుటుంబ జీవితం సాఫీగా, హ్యాపీగా సాగిపోతుంది.
మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2): ఉద్యోగంలో బరువు బాధ్యతలు పెరుగుతాయి. ఆశించిన ప్రతిఫలం కూడా లభిస్తుంది. ఇంటా బయటా ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది. ఆర్థికంగా కొద్దిపాటి అదృష్టం పట్టే అవకాశం ఉంది. రావలసిన డబ్బు చేతికి అందడం, బాకీలు వసూలు కావడం వంటివి జరుగుతాయి. కుటుంబంలో శుభ కార్యాలకు సంబంధించి ఆశించిన సమాచారం అందుకుంటారు. తోబుట్టువులతో ఆస్తి వివాదం పరిష్కార దిశగా సాగుతుంది. వ్యాపారాలు లాభసాటిగా పురోగమిస్తాయి. ఆరోగ్యం బాగానే ఉంటుంది.
కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3): వృత్తి, ఉద్యోగాల్లో పురోగతి ఉంటుంది. ఆదాయం పెరిగి కొన్ని ప్రధానమైన అవసరాలు తీరుతాయి. రావలసిన డబ్బు, రాదనుకున్న డబ్బు కూడా చేతికి అందుతుంది. మితిమీరిన ఔదార్యంతో ఇతరులకు సహాయం చేయడం జరుగుతుంది. బంధు మిత్రులతో విందులు, వినోదాల్లో పాల్గొంటారు. ప్రయాణాల వల్ల లాభం ఉంటుంది. కానీ జాగ్రత్తగా ఉండడం మంచిది. కుటుంబ విషయాల్లో జీవిత భాగస్వామితో సంప్రదించి నిర్ణయాలు తీసుకోవడం శ్రేయస్కరం. పిల్లల నుంచి శుభవార్త వింటారు.
మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి): ఉద్యోగంలో తగిన ప్రోత్సాహకాలు అందుతాయి. వృత్తి జీవితంలో గుర్తింపుతో పాటు డిమాండ్ పెరుగుతుంది. వ్యాపారాలు సజావుగా సాగిపోతాయి. వ్యక్తిగత సమస్యలు చాలావరకు పరిష్కారం అవుతాయి. ఆదాయానికి, ఆరోగ్యానికి ఢోకా ఉండకపోవచ్చు. కుటుంబం సభ్యుల విషయంలో తొందర పాటు నిర్ణయాలు తీసుకోవడం, తొందరపడి మాట్లాడడం వల్ల. కొద్దిగా ఇబ్బందులు ఎదుర్కునే అవకాశముంది. ఆర్థిక ప్రయత్నాలను కొనసాగించడం వల్ల అనుకూల ఫలితాలుంటాయి.



