Sun Transit: సూర్యుడి అనుగ్రహం.. ఇక ఆ రాశుల వారికి దశ తిరిగినట్టే..!
డిసెంబర్ 15 నుండి జనవరి 14 వరకు రవి ధనూ రాశిలోకి సంచారం చేయనున్నాడు. ఈ గోచారం మేషం, సింహం, తుల, వృశ్చికం, ధనుస్సు, కుంభ రాశులవారికి అనూహ్యమైన అదృష్టాన్ని, ఐశ్వర్యాన్ని, విజయాలను అందిస్తుంది. ఉద్యోగ, వ్యాపారాలలో పురోగతి, ఆర్థిక లాభాలుంటాయి. సూర్యుని అనుగ్రహం కోసం ఆదిత్య హృదయం పఠించడం శుభకరం.

Sun Transit
గ్రహ రాజైన రవి అనుగ్రహం కలిగితే ఏ రాశివారైనా అందలాలు ఎక్కడం, ఒక వెలుగు వెలగడం ఖాయం. ఈ నెల(డిసెంబర్) 15 నుంచి జనవరి 14 వరకూ ధనూ రాశిలో సంచారం చేయబోతున్న రవి వల్ల కొన్ని రాశులవారు తప్పకుండా ఒక వెలుగు వెలిగే అవకాశం ఉంది. అధికారానికి, ఐశ్వర్యానికి, విజయాలకు, సాఫల్యాలకు కారకుడైన రవి తనకు బాగా ఇష్టమైన ధనూ రాశిలో సంచారం చేయడం వల్ల ఎటువంటి కోరికనైనా తీర్చే అవకాశం ఉంది. ఈ రవి గ్రహాన్ని మరింతగా సంతృప్తి పరచడానికి ఆదిత్య హృదయం పఠించడం మంచిది. రవి ధనూ రాశి సంచారం వల్ల మేషం, సింహం, తుల, వృశ్చికం, ధనుస్సు, కుంభ రాశులవారి దశ తప్పకుండా తిరుగుతుంది.
- మేషం: ఈ రాశికి అత్యంత శుభుడైన రవి భాగ్య స్థానంలోకి ప్రవేశించడం వల్ల ఈ రాశివారికి ప్రభుత్వ మూలక గుర్తింపు లభిస్తుంది. ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్నవారు తప్పకుండా విజ యాలు సాధిస్తారు. ఉద్యోగులు, నిరుద్యోగులకు విదేశీ ఆఫర్లు అందుతాయి. ఆదాయం ఇబ్బడి ముబ్బడిగా వృద్ధి చెందుతుంది. పిత్రార్జితం లభిస్తుంది. ప్రముఖులతో సన్నిహిత సంబంధాలు ఏర్పడతాయి. వృత్తి, ఉద్యోగాలరీత్యా విదేశాలకు వెళ్లడం జరుగుతుంది. ఆరోగ్యం మెరుగు పడుతుంది.
- సింహం: రాశ్యధిపతి రవి పంచమ స్థాన స్థితి వల్ల మనసులోని కోరికలు చాలావరకు నెరవేరుతాయి. ఉద్యో గంలో సమర్థతకు గుర్తింపుగా పదోన్నతులు లభిస్తాయి. నైపుణ్యాలు వృద్ధి చెందుతాయి. పోటీ పరీక్షలు, ఇంటర్వ్యూల్లో ఘన విజయాలు సాధిస్తారు. ప్రభుత్వ ఉద్యోగం లభించే అవకాశం ఉంది. సంతాన యోగం కలుగుతుంది. వృత్తి, వ్యాపారాలు నల్లేరు మీద బండిలా సాగిపోతాయి. కుటుంబంలో శుభ కార్యాలు జరుగుతాయి. షేర్లు, స్పెక్యులేషన్లు, ఆర్థిక లావాదేవీలు బాగా లాభిస్తాయి.
- తుల: ఈ రాశికి లాభాధిపతి అయిన రవి తృతీయ స్థాన సంచారం వల్ల పట్టిందల్లా బంగారం అవుతుంది. ఎటువంటి ప్రయత్నమైనా తప్పకుండా నెరవేరుతుంది. ఉద్యోగంలో ఊహించని పదోన్నతులు కలుగుతాయి. వృత్తి, వ్యాపారాలు బాగా బిజీగా సాగిపోతాయి. ప్రయాణాలు బాగా లాభిస్తాయి. వృత్తి, ఉద్యోగాలరీత్యా విదేశాలకు వెళ్లడం జరుగుతుంది. పోటీ పరీక్షలు, ఇంటర్వ్యూల్లో ఘన విజయాలు సాధిస్తారు. పెళ్లి, ఉద్యోగ ప్రయత్నాలు సక్సెస్ అవుతాయి. ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది.
- వృశ్చికం: దశమాధిపతి రవి ధన స్థానంలో ప్రవేశించడం వల్ల ఈ రాశివారికి ఉద్యోగంలో పదోన్నతులు కలగడంతో పాటు జీతభత్యాలు అంచనాలను మించి పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాల్లో రాబడి అపారంగా వృద్ధి చెందుతుంది. రాజకీయ ప్రాబల్యం కలుగుతుంది. షేర్లు, స్పెక్యులేషన్లు విపరీతంగా లాభిస్తాయి. మాటకు విలువ పెరుగుతుంది. రావలసిన సొమ్ము చేతికి అందుతుంది. ఆకస్మిక ధన ప్రాప్తికి అవకాశం ఉంది. రాజపూజ్యాలు కలుగుతాయి. వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు.
- ధనుస్సు: భాగ్యాధిపతి రవి ఈ రాశిలో సంచారం చేయడం వల్ల రాజపూజ్యాలు ఎక్కువగా ఉంటాయి. రాజకీయ ప్రముఖులతో సన్నిహిత సంబంధాలు ఏర్పడతాయి. ఉద్యోగంలో పదోన్నతులు కలుగుతాయి. ఉద్యోగులు, నిరుద్యోగులకు విదేశీ ఆఫర్లు కూడా అందుతాయి. ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్నవారు పోటీ పరీక్షలు, ఇంటర్వ్యూల్లో విజయాలు సాధిస్తారు. వృత్తి, ఉద్యోగాల కారణంగా విదేశాలకు వెళ్లడం జరుగుతుంది. ఆదాయం వృద్ది చెందుతుంది. సంతాన ప్రాప్తి కలుగుతుంది.
- కుంభం: ఈ రాశికి లాభస్థానంలో రవి ప్రవేశం వల్ల ఈ రాశివారికి వృక్తిగత పురోగతికి బాగా ఎక్కువగా ఉంటుంది. ఉద్యోగంలో అధికార యోగం పడుతుంది. వృత్తి, వ్యాపారాల్లో యాక్టివిటీ, రాబడి పెరుగుతాయి. మరింత మంచి ఉద్యోగంలోకి మారడానికి అవకాశం ఉంది. పట్టిందల్లా బంగారం అవుతుంది. అనేక వైపుల నుంచి ఆదాయం వృద్ధి చెందుతుంది. పిత్రార్జితం లభిస్తుంది. ఆస్తి వివాదాలు అనుకూలంగా పరిష్కారమవుతాయి. ఆరోగ్య లాభం కలుగుతుంది. శుభవార్తలు ఎక్కువగా వింటారు.



