Tirumala: తిరుమల శ్రీవారికి భక్తురాలు కోటి విరాళం..
చెన్నై భక్తురాలు సౌమ్య టీటీడీ ట్రస్టులకు కోటి రూపాయలు విరాళంగా ఇచ్చారు. అన్నప్రసాదం, ప్రాణదానం ట్రస్టులకు సమానంగా చెక్కు అందజేశారు. అలాగే, చెన్నైకి చెందిన లోటస్ ఆటో వర్డ్ భక్తులు శ్రీవారి సేవకు రూ.10 లక్షల విలువైన రెండు ఎలక్ట్రిక్ కార్లను విరాళంగా సమర్పించారు. భక్తుల ఉదారతకు టీటీడీ అధికారులు కృతజ్ఞతలు తెలిపారు.
వడ్డీకాసులవాడికి విరాళాలు వెల్లువెత్తుతున్నాయి. తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి ట్రస్టులకు ఓ భక్తురాలు భారీ విరాళం అందజేశారు. చెన్నైలోని ఈరోడ్‌కు చెందిన సౌమ్య అనే భక్తురాలు ఏకంగా రూ. కోటి రూపాయలు విరాళంగా అందజేసి తన భక్తిని చాటుకున్నారు. ఈ మేరకు ఆమె విరాళానికి సంబంధించిన చెక్కును టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరికి అందజేశారు. ఈ విరాళాన్ని రెండు కీలకమైన ట్రస్టులకు సమానంగా విభజించి ఇచ్చారు. శ్రీవారి నిత్యాన్నప్రసాదం ట్రస్టుకు రూ.50 లక్షలు, ప్రాణదానం ట్రస్టుకు మరో రూ.50 లక్షల చొప్పున విరాళంగా అందించారు. భక్తురాలి ఉదారతకు టీటీడీ తరఫున అదనపు ఈవో వెంకయ్య చౌదరి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా దాత సౌమ్యను శాలువాతో సత్కరించారు. అనంతరం ఆమెకు స్వామివారి ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. స్వామివారి సేవలకు భక్తులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి విరాళాలు అందించడం అభినందనీయమని టీటీడీ అధికారులు పేర్కొన్నారు. అలాగే తిరుమల శ్రీవారికి చెన్నైకి చెందిన భక్తులే రెండు కార్లను రెండు కార్లను డొనేట్ చేశారు. చెన్నై కి చెందిన లోటస్ ఆటో వర్డ్ ప్రైవేట్ లిమిటెడ్ కు చెందిన భక్తులు రూ. 10 లక్షల విలువైన ఎలక్ట్రిక్ కార్లను టిటిడి అధికారులకు అందజేశారు. అనంతరం కార్లు డొనేట్ చేసిన భక్తులను సత్కరించి వేద ఆశీర్వచనం అందించారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
కారును ఢీకొన్న విమానం.. ఫ్లోరిడా రోడ్డుపై షాకింగ్ ఘటన
Akhanda 2 Review: లాజిక్స్ లేవమ్మా.. అన్నీ గూస్ బంప్సే!’ అఖండ2 మూవీ రివ్యూ
కొండ అంచున సెల్ఫీ.. కట్ చేస్తే… 130 అడుగుల నుండి
కారును ఢీకొన్న విమానం.. ఫ్లోరిడా రోడ్డుపై షాకింగ్ ఘటన
కొండ అంచున సెల్ఫీ.. కట్ చేస్తే... 130 అడుగుల నుండి
నన్ను చంపండి ప్లీజ్.. కారుణ్య మరణం కోరుకునే చీమ!
ఇంటి డాబాపై భారీ వేప చెట్టు..! దీని వయస్సు 100 సంవత్సరాలు
వాహనదారులకు అలర్ట్.. ఇలాంటివారికి నో పెట్రోల్
నలభై ఏళ్లుగా వెలుగుతూనే ఉన్న దీపాలు.. ఎక్కడంటే
అయ్యో .. ఇలాంటి కష్టం ఎవరికీ రావద్దు

