Dhana Yogas: రెండు ధన యోగాలు.. ఆ రాశుల వారు అపర కుబేరులు కాబోతున్నారు!
డిసెంబర్ 12, 13, 14 తేదీల్లో చంద్ర మంగళ, గజకేసరి అనే రెండు శక్తివంతమైన ధన యోగాలు ఏర్పడుతున్నాయి. ఈ యోగాల ప్రభావంతో మేషం, మిథునం, కన్య, వృశ్చికం, ధనుస్సు, మీన రాశుల వారికి విశేషమైన ఆర్థిక లాభాలు, ఉద్యోగ పురోగతి, పేరు ప్రఖ్యాతులు, ఉన్నత పదవులు లభించనున్నాయి. మీ జీవితంలో అదృష్టం, శుభ పరిణామాలు చూడండి.

Dhana Yogas
ఈ నెల (డిసెంబర్) 12, 13, 14 తేదీల్లో ఏక కాలంలో రెండు ధన యోగాలు చోటు చేసుకుంటున్నాయి. చంద్రుడు కన్యా రాశిలో ప్రవేశించడంతో చంద్ర మంగళ యోగం, గజకేసరి యోగం కలుగుతున్నాయి. ధనూ రాశిలో ఉన్న కుజుడికి కేంద్రంలో చంద్రుడి సంచారం వల్ల చంద్ర మంగళ యోగం, మిథున రాశిలో ఉన్న గురువుకి కేంద్రంలో చంద్రుడి సంచారం వల్ల గజకేసరి యోగం కలగడం వల్ల మేషం, మిథునం, కన్య, వృశ్చికం, ధనుస్సు, మీన రాశుల వారికి రాజపూజ్యాలు కలగడం, పేరు ప్రఖ్యాతులు పెరగడం, ఆదాయం వృద్ధి చెందడం, అధికార యోగం పట్టడం వంటివి జరిగే అవకాశం ఉంది.
- మేషం: భాగ్య స్థానంలో ఉన్న రాశ్యధిపతి కుజుడితో చంద్ర మంగళ యోగం, తృతీయంలో ఉన్న గురువుతో గజకేసరి యోగం ఏర్పడడంవల్ల ఈ రాశివారు మూడు రోజుల పాటు ఏ నిర్ణయం తీసుకున్నా, ఏ ప్రయత్నం చేపట్టినా తప్పకుండా సక్సెస్ అవుతుంది. ఉద్యోగంలో పురోగతి ఉంటుంది. వృత్తి, వ్యాపారాల్లో యాక్టివిటీ బాగా పెరుగుతుంది. షేర్లు, స్పెక్యులేషన్ల వంటివి అంచనాలకు మించి లాభాలనిస్తాయి. ఉద్యోగులు, నిరుద్యోగులకు మంచి విదేశీ ఆఫర్లు అందే అవకాశం ఉంది.
- మిథునం: ఈ రాశిలో ఉన్న గురువుతో గజకేసరి యోగం, ఈ రాశికి సప్తమ స్థానంలో ఉన్న కుజుడితో చంద్ర మంగళ యోగం ఏర్పడినందువల్ల అనేక మార్గాల్లో ఆదాయం బాగా వృద్ధి చెందే అవకాశం ఉంది. పట్టిందల్లా బంగారం కావడంతో పాటు ఆకస్మిక ధన ప్రాప్తికి కూడా బాగా అవకాశం ఉంది. ఉద్యోగంలో పదోన్నతులు కలుగుతాయి. జీతభత్యాలు అంచనాలకు మించి పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాలు లాభాల బాట పడతాయి. సంపన్న కుటుంబంతో పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది.
- కన్య: ఈ రాశికి దశమంలో ఉన్న గురువుతో గజకేసరి యోగం, చతుర్థ స్థానంలో ఉన్న కుజుడితో చంద్ర మంగళ యోగం ఏర్పడడం వల్ల ఉద్యోగంలో తప్పకుండా ఉద్యోగంలో పదోన్నతి కలుగుతుంది. అధికార యోగానికి అవకాశమున్న మరో సంస్థలోకి మారే అవకాశం ఉంది. ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. కుటుంబంలో శుభకార్యాలు పెరగడానికి, సుఖ సంతోషాలు వృద్ధి చెందడానికి అవకాశం ఉంది. ఆస్తిపాస్తులు కలిసి వస్తాయి. గృహ, వాహన యోగాలు కలిగే అవకాశం కూడా ఉంది.
- వృశ్చికం: ఈ రాశికి ధన స్థానంలో చంద్ర మంగళ యోగం, ధన స్థానాధిపతి గురువుతో గజకేసరి యోగం కలగడం వల్ల ఈ రాశివారికి అనేక మార్గాల్లో ఆదాయం వృద్ధి చెందే అవకాశం ఉంది. షేర్లు, స్పెక్యులేషన్ల వంటివి బాగా లాభించడంతో పాటు, రావలసిన సొమ్ము రావడం, బాకీలు వసూలు కావడం వంటివి కూడా జరుగుతాయి. ఆస్తి వివాదాలు పరిష్కారమై విలువైన ఆస్తి చేతికి అందుతుంది. ఉద్యోగంలో జీతభత్యాలు, వృత్తి, వ్యాపారాల్లో రాబడి పెరుగుతాయి. ఆరోగ్య లాభం కలుగుతుంది.
- ధనుస్సు: ఈ రాశిలో ఉన్న కుజుడితో చంద్ర మంగళ యోగం, సప్తమ స్థానంలో ఉన్న గురువుతో గజకేసరి యోగం ఏర్పడడం వల్ల వ్యక్తిగతంగానూ, కుటుంబపరంగానూ శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. సంపన్న కుటుంబానికి చెందిన వ్యక్తితో ప్రేమలో పడడం లేదా పెళ్లి కావడం జరుగుతుంది. నిరుద్యోగులకు విదేశీ అవకాశాలు ఎక్కువగా అందుతాయి. ఉద్యోగంలో శీఘ్ర పురోగతి కలుగుతుంది. సంతాన ప్రాప్తికి అవకాశం ఉంది. అత్యంత ప్రముఖులతో సైతం పరిచయాలు పెరుగుతాయి.
- మీనం: ఈ రాశికి చతుర్థంలో గజకేసరి యోగం, దశమంలో చంద్ర మంగళ యోగం ఏర్పడడం వల్ల ఉద్యో గంలో పదోన్నతులకు, జీతభత్యాల పెరుగుదలకు అవకాశం ఉంది. మరింత మంచి ఉద్యోగంలోకి మారే సూచనలున్నాయి. వృత్తి, ఉద్యోగాలరీత్యా ఇతర దేశాలకు వెళ్లడం జరుగుతుంది. ఉద్యోగులకు బాగా డిమాండ్ పెరుగుతుంది. నిరుద్యోగులకు విదేశీ ఆఫర్లు అందుతాయి. కొద్దిపాటి ప్రయత్నంతో అత్యధికంగా లాభం పొందుతారు. వృత్తి, వ్యాపారాల్లో యాక్టివిటీ బాగా పెరుగుతుంది.
Follow Us