AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Horoscope Today: ఈ రాశివారికి జీతాలు పెరగవచ్చట.. శనివారం రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే?

వృత్తి, ఉద్యోగాల్లో అధికారులు మీ మీద ఎక్కువగా ఆధారపడతారు. జీతభత్యాలకు సంబంధించి శుభవార్తలు వింటారు. ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. కొత్త ప్రయత్నాలు చేపట్టడానికి సమయం అనుకూలంగా ఉంది. నిరుద్యోగులకు మంచి ఆఫర్లు అందుతాయి. పెళ్లి ప్రయత్నాలు..

Horoscope Today: ఈ రాశివారికి జీతాలు పెరగవచ్చట.. శనివారం రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే?
Horoscope Today
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Apr 06, 2024 | 7:31 AM

Share

మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)

కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. విహార యాత్రకు వెళ్లడం జరుగుతుంది. వృత్తి, ఉద్యోగాల్లో సానుకూల పరిస్థితులుంటాయి. ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది. చేపట్టిన పనుల్లో విజయాలు సాధిస్తారు. వ్యాపారాల్లో లాభాలు నిలకడగా ఉంటాయి. సేవా కార్యక్రమాలపై ఆసక్తి పెరుగుతుంది. ఇతరులకు మేలు జరిగే పనులు చేస్తారు. నిరుద్యోగులకు మంచి అవకాశాలు అందుతాయి. విద్యార్థులు మంచి ఫలితాలు సాధిస్తారు. ప్రేమ వ్యవహారాలు హ్యాపీగా గడిచి పోతాయి.

వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)

చేపట్టిన వ్యవహారాలు మందకొడిగా, నిరాసక్తంగా సాగుతాయి. కుటుంబ పరిస్థితులు కొద్దిగా చిరాకు కలిగిస్తాయి. ఆదాయం నిలకడగా ఉన్నప్పటికీ ఖర్చులు అదుపు తప్పుతాయి. నిరుద్యో గులకు మంచి అవకాశాలు అంది వస్తాయి. ఆకస్మిక ప్రయాణ సూచనలున్నాయి. వృత్తి, ఉద్యో గాలు బాగానే సాగిపోతాయి కానీ, వ్యాపారాలు లాభాల పరంగా మందగిస్తాయి. విద్యార్థులు కొద్ది శ్రమతో ఉత్తమ ఫలితాలు సాధిస్తారు. ప్రేమ వ్యవహారాలు చాలావరకు ఉత్సాహంగా సాగుతాయి.

మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)

కుటుంబ సభ్యులతో ఎంజాయ్ చేస్తారు. వృత్తి, ఉద్యోగాల్లో అనుకూల పరిస్థితులుంటాయి. చేపట్టిన పనుల్లో ఆటంకాలు ఎదురవుతాయి. ఆహార, విహారాల్లో జాగ్రత్తగా ఉండడం మంచిది. ఆర్థిక పరి స్థితి అనుకూలంగా ఉంటుంది. వ్యాపారాల్లో లాభాలు నిలకడగా ఉంటాయి. మంచి పరిచయాలు ఏర్పడతాయి. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలు సఫలం అవుతాయి. కుటుంబంలో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. విద్యార్థులు విజయాలు సాధిస్తారు. ప్రేమ వ్యవహారాలు సాఫీగా సాగిపోతాయి.

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)

ఆస్తికి సంబంధించి ఒప్పందాలు చోటు చేసుకుంటాయి. సోదరులతో ఆస్తి వివాదం పరిష్కార మయ్యే అవకాశం కూడా ఉంది. కీలక వ్యవహారాల్లో జీవిత భాగస్వామి సలహాలు కూడా తీసు కోవడం మంచిది. వృత్తి, ఉద్యోగాల్లో ఉత్సాహకర వాతావరణం ఉంటుంది. ఉద్యోగంలో అనవసర విషయాల్లో జోక్యం చేసుకోకపోవడం మంచిది. ఆర్థిక పరిస్థితి సానుకూలంగా ఉంటుంది. రావల సిన డబ్బు అందుతుంది. విద్యార్థులు శ్రమపడాల్సి ఉంటుంది. ప్రేమ వ్యవహారాలు హ్యాపీగా సాగి పోతాయి.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)

ప్రారంభించిన పనుల్లో కొద్దిగా అవరోధాలు, అంతరాయాలు ఉన్నప్పటికీ, వాటిని అధిగమిస్తారు. ఆర్థిక పరిస్థితి బాగా అనుకూలంగా ఉంటుంది. ప్రయాణాలు లాభిస్తాయి. మిత్రులకు సహాయ సహకారాలు అందిస్తారు. ఆరోగ్యం బాగా మెరుగ్గా ఉంటుంది. ఉద్యోగులకు ఉన్నతావకాశాలు లభిస్తాయి. వృత్తి, వ్యాపారాలు బాగా బిజీగా, లాభసాటిగా సాగిపోతాయి. ఒకటి రెండు శుభవార్తలు వింటారు. విద్యార్థులు ఘన విజయాలు సాధిస్తారు. ప్రేమ వ్యవహారాలు ఉత్సాహంగా సాగుతాయి.

కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)

కుటుంబ సభ్యులతో విందు కార్యక్రమంలో పాల్గొంటారు. వృత్తి, వ్యాపారాల్లో ఆశించిన స్థాయిలో లాభాలు అందుకుంటారు. బాగా అనుకూల పరిస్థితులుంటాయి. ఉద్యోగంలో పని భారం కాస్తంత ఎక్కువగా ఉంటుంది. విశ్రాంతికి దూర మవుతారు. ఆకస్మిక ధన ప్రాప్తి కలుగుతుంది. ఆర్థిక పరి స్థితి కొద్దిగా మెరుగుపడుతుంది. పిల్లల నుంచి శుభ వార్తలు అందుతాయి. నిరుద్యోగులకు మంచి ఆఫర్లు అందుతాయి. విద్యార్థులు విజయాలు సాధిస్తారు. ప్రేమ వ్యవహారాల్లో పురోగతి ఉంటుంది.

తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)

సమయం చాలావరకు అనుకూలంగా ఉంది. అనుకున్న పనులు అనుకున్నట్టు తేలికగా పూర్త వుతాయి. దీర్ఘకాలిక అనారోగ్యం నుంచి ఉపశమనం పొందుతారు. స్థిరాస్తి వివాదం పరిష్కారం అవుతుంది. వృత్తి, ఉద్యోగాల్లో గౌరవమర్యాదలు పెరుగుతాయి. వ్యాపారంలో కొత్త పద్ధతులు ప్రవేశ పెట్టి ప్రయోజనం పొందుతారు. ప్రముఖులతో పరిచయాలు విస్తృతమవుతాయి. నిరు ద్యోగులు శుభవార్త అందుకుంటారు. విద్యార్థులకు పరవాలేదు. ప్రేమ వ్యవహారాల్లో దూసుకుపోతారు.

వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట)

ఆర్థిక పరిస్థితికి లోటుండదు. రావలసిన డబ్బు చేతికి అందుతుంది. అవసరాలు తీరిపోతాయి. ఒకటి రెండు ఆర్థిక సమస్యలు పరిష్కారం అవుతాయి. ప్రయాణాల వల్ల లాభాలు పొందుతారు. వృత్తి, వ్యాపారాల్లో రాబడి అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగంలో ప్రశాంత వాతావరణం నెలకొం టుంది. ఇంటా బయటా ఒత్తిడి ఉన్నప్పటికీ, వ్యవహారాలను పూర్తి చేస్తారు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. విద్యార్థులకు శ్రమ పెరుగుతుంది. ప్రేమ వ్యవహారాలు నత్తనడక నడుస్తాయి.

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)

రోజంతా అనుకూలంగా సాగిపోతుంది. ముఖ్యమైన వ్యవహారాలను ఉత్సాహంగా పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితి బాగా మెరుగుపడుతుంది. ఆదాయ మార్గాలన్నీ ఆశించిన ఫలితాలనిస్తాయి. వ్యక్తి గత, కుటుంబ వ్యవహారాలు సానుకూలంగా పూర్తవు తాయి. వృత్తి వ్యాపారాల్లో కొత్త ఆలోచనలతో ముందుకు సాగుతారు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగంలో పకాలంలో బాధ్యతల్ని నిర్వర్తిస్తారు. విద్యార్థులు పురోగతి చెందుతారు. ప్రేమ వ్యవహారాలు కొత్త పుంతలు తొక్కుతాయి.

మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2)

ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. ఇతరులకు సహాయం చేసే పరిస్థితిలో ఉంటారు. కుటుంబ వ్యవహారాలను చక్కబెడతారు. తల్లితండ్రుల సహాయ సహకారాలతో కుటుంబ సమస్యల్ని పరిష్కరించుకుంటారు. అనేక విధాలుగా ఆదాయం పెరుగుతుంది. వృత్తి, ఉద్యోగాల్లో పనిభారం బాగా పెరిగి విశ్రాంతి తగ్గుతుంది. వ్యాపారాలు నిలకడగా ముందుకు సాగుతాయి. ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలి. విద్యార్థులు కొద్ది శ్రమతో ఉత్తమ ఫలితాలు సాధిస్తారు.. ప్రేమ వ్యవహారాల్లో ముందంజ వేస్తారు.

కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)

వృత్తి, ఉద్యోగాల్లో అధికారులు మీ మీద ఎక్కువగా ఆధారపడతారు. జీతభత్యాలకు సంబంధించి శుభవార్తలు వింటారు. ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. కొత్త ప్రయత్నాలు చేపట్టడానికి సమయం అనుకూలంగా ఉంది. నిరుద్యోగులకు మంచి ఆఫర్లు అందుతాయి. పెళ్లి ప్రయత్నాలు ఒక పట్టాన సఫలం కావు. ఎవరినీ గుడ్డిగా నమ్మకపోవడం మంచిది. ఆరోగ్యం బాగా అనుకూలంగా ఉంటుంది. విద్యార్థుల మీద ఒత్తిడి పెరుగుతుంది. ప్రేమ వ్యవహారాలు సాఫీగా సాగిపోతాయి.

మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)

గ్రహ సంచారం బాగా అనుకూలంగా ఉంది. కొద్ది ప్రయత్నంతో ప్రతి పనీ పూర్తవుతుంది. ఆర్థికంగా కొన్ని ఇబ్బందుల నుంచి బయటపడతారు. అదనపు ఆదాయ ప్రయత్నాలు కలిసి వస్తాయి. ఆధ్యాత్మిక చింతన పెరిగి, దైవ కార్యాల్లో పాల్గొంటారు. పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. వృత్తి, ఉద్యోగాలు గౌరవప్రదంగా సాగిపోతాయి. వ్యాపారాల్లో అంచనాలకు మించి లాభాలు గడిస్తారు. విద్యార్థులు కొద్ది ప్రయత్నంతో ఉత్తమ ఫలితాలు సాధిస్తారు. ప్రేమ వ్యవహారాలు అనుకూలిస్తాయి.

త్రిషతో ఉన్నఈ అమ్మాయిని గుర్తు పట్టారా? టాలీవుడ్ క్రేజీ హీరోయిన్
త్రిషతో ఉన్నఈ అమ్మాయిని గుర్తు పట్టారా? టాలీవుడ్ క్రేజీ హీరోయిన్
వైకుంఠ ఏకాదశి నాడు పొరపాటున కూడా ఈ పనులు చేయకండి..!
వైకుంఠ ఏకాదశి నాడు పొరపాటున కూడా ఈ పనులు చేయకండి..!
అన్న కోసం 130 కిలోమీటర్లు.. ఈ తమ్ముడు చేసిన పనికి అంతా ఫిదా..
అన్న కోసం 130 కిలోమీటర్లు.. ఈ తమ్ముడు చేసిన పనికి అంతా ఫిదా..
విజయవాడ GGH 'ఆకలి రాజ్యం'లో ఎలుకల స్వైర విహారం.. వీడియో
విజయవాడ GGH 'ఆకలి రాజ్యం'లో ఎలుకల స్వైర విహారం.. వీడియో
గత పదేళ్లలో ప్రఖ్యాత IITల్లో భారీగా బీటెక్‌ సీట్ల కోత.. కారణం ఇదే
గత పదేళ్లలో ప్రఖ్యాత IITల్లో భారీగా బీటెక్‌ సీట్ల కోత.. కారణం ఇదే
ఖాకీ ముసుగులో కామాంధుడు.. ఏకంగా ఇన్‌స్పెక్టర్ ఇంట్లోనే.. అసలేం..
ఖాకీ ముసుగులో కామాంధుడు.. ఏకంగా ఇన్‌స్పెక్టర్ ఇంట్లోనే.. అసలేం..
క్రిస్మస్ ఈ టేస్టీ డెజర్ట్స్ ట్రై చేస్తే ఫిదా అవ్వాల్సిందే!
క్రిస్మస్ ఈ టేస్టీ డెజర్ట్స్ ట్రై చేస్తే ఫిదా అవ్వాల్సిందే!
33 బంతుల్లో సెంచరీ.. కావ్యపాప పాకెట్ డైనమైట్ బీభత్సం
33 బంతుల్లో సెంచరీ.. కావ్యపాప పాకెట్ డైనమైట్ బీభత్సం
విమాన ప్రయాణికులకు గుడ్ న్యూస్.. కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు..
విమాన ప్రయాణికులకు గుడ్ న్యూస్.. కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు..
ఎవర్రా రోకో అన్నారు.. సెంచరీలతో గంభీర్‌కు దిమ్మతిరిగే షాక్
ఎవర్రా రోకో అన్నారు.. సెంచరీలతో గంభీర్‌కు దిమ్మతిరిగే షాక్