AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Horoscope Today: ఈ రాశి వారికి అనుకోని ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది.. శుక్రవారం రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే..

Horoscope Today: శుక్రవారం ఎవరి రాశి ఫలాలు ఎలా ఉన్నాయి.. ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి, ఎలాంటి వాటి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి లాంటి విషయాలను 'రాశి ఫలాల్లో' భాగంగా తెలుసుకుందాం..

Horoscope Today: ఈ రాశి వారికి అనుకోని ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది.. శుక్రవారం రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే..
Horoscope Today
Narender Vaitla
|

Updated on: Apr 09, 2021 | 7:01 AM

Share

Horoscope Today: శుక్రవారం ఎవరి రాశి ఫలాలు ఎలా ఉన్నాయి.. ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి, ఎలాంటి వాటి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి లాంటి విషయాలను ‘రాశి ఫలాల్లో’ భాగంగా తెలుసుకుందాం..

మేషరాశి..

మేషరాశి వారు ఈరోజు వ్యక్తిగత అవసరాల కోసం ప్రముఖులను కలుసుకుంటారు. చేపట్టిన పనులు పూర్తి చేసే అవకాశాలున్నాయి. ఆంజనేయ స్వామికి తమలపాకులతో అర్చన నిర్వహించుకోవడం మంచిది.

వృషభ రాశి..

ఈ రాశివారు ఈరోజు వేరు వేరు రూపాల్లో అనూహ్యమైన ఫలితాలు అందుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆరోగ్య విషయాల్లో కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. గన్నేరు పుష్పాలతో దక్షిణామూర్తి స్వామిని ఆరాధన చేస్తే మంచి జరుగుతుంది.

మిథున రాశి..

మిథున రాశి వారికి ఈరోజు గతంలో ఉన్న కొన్ని భిన్నమైన పరిస్థితులు అనుకూలంగా మారుతుంటాయి. విష్ణు సహస్త్ర నామ స్తోత్ర పారాయణం మేలు చేస్తుంది.

కర్కాటక రాశి..

ఈ రాశి వారికి శ్రమ ఫలితస్తుంది. అనుకున్న పనులను పూర్తి చేయడంలో కుటుంబ సభ్యుల సహకారం అందుతుంది. గౌరీ అమ్మవారి దర్శనం ఈ రాశివారికి సూచించదగ్గ అంశం.

సింహ రాశి..

సింహ రాశి వారికి ఈరోజు రావాల్సిన బాకీలు వసూళు అవుతుంటాయి. ఆద్యాత్మిక, దైవ చింతన కార్యక్రమాల్లో పాల్గొంటారు. సూర్య నారయణ స్వామి స్తోత్ర పారాయణం మేలు చేస్తుంది.

కన్య రాశి..

ఈ రాశివారికి అలౌలిక విషయాల పట్ల ఆసక్తి కలుగుతుంది. కానీ ఇలాంటి వాటికి దూరంగా ఉంటే మంచిది. విష్ణు సహస్త్ర నామ స్తోత్ర పారాయణం మేలు చేస్తుంది.

తుల రాశి..

తుల రాశి వారు రుణ ప్రయత్నాలు చేస్తారు. దూర ప్రయాణాల గురించి ఆలోచనలు చేస్తుంటారు. మహా లక్ష్మి అమ్మవారి అర్చన మేలు చేస్తుంది.

వృశ్చిక రాశి..

ఈ రాశి వారికి కొత్త వ్యక్తులతో పరిచయమవుతుంటాయి. ముఖ్యమైన విషయాలను అంత తొందరపడి వెల్లడించకూడదు. శ్రీ రామ రక్ష స్తోత్ర పారాయణం మేలు చేస్తుంది.

ధనుస్సు రాశి..

ధనుస్సు రాశి వారికి రావాల్సిన బాకీలు ఆలస్యం కావడం వల్ల వేరు వేరు మార్గాలను అన్వేషిస్తుంటారు. అష్టలక్ష్మీ స్తోత్రపారాయణం ఈ రాశి వారికి సూచించదగ్గ అంశం.

మకర రాశి..

ఈ రాశి వారు రాజకీయ పరమైన విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. అనుకోని ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. సంకటనాష గణపతి స్తోత్ర పారాయణం మేలు చేస్తుంది.

కుంభరాశి..

కుంభ రాశి వారికి వృత్తి, వ్యాపారమైన భావనలు పెరుగుతాయి. సామాజిక, సేవ కార్యక్రమాల్లో పాల్గొంటుంటారు. శివ పంచాక్షరి జపం ఈ రాశివారికి సూచించదగ్గ అంశం.

మీన రాశి..

ఈ రాశి వారు షేర్లు, పెట్టబడుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. పిల్లల చదువుల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. శ్రీ హరగ్రీవ స్వామి వారి ఆరాధన మేలు చేస్తుంది.

Also Read: దుర్గగుడి మాజీ ఈవో సురేష్ బాబుకు షాకింగ్ ట్రీట్మెంట్, రాజమండ్రి ఆర్జేసీగా నిన్నటి నియామకపు ఉత్తర్వులు రద్దు

Ugadi : ఈ ఏడాదీ.. ఉగాది పర్వదినంపై కరోనా ప్రభావం , తెలంగాణలో నిరాడంబరంగా పండుగ, పంచాంగ శ్రవణం

ప్రముఖ పుణ్యక్షేత్రం హ‌నుమంతుని జ‌న్మస్థానం.. ఆధారాలతో సహా నిరూపిస్తామంటున్న టీటీడీ .. ఎప్పుడంటే..!