దుర్గగుడి మాజీ ఈవో సురేష్ బాబుకు షాకింగ్ ట్రీట్మెంట్, రాజమండ్రి ఆర్జేసీగా నిన్నటి నియామకపు ఉత్తర్వులు రద్దు
Vijayawada Durga Temple Ex EO : బెజవాడ దుర్గగుడి మాజీ ఈవో సురేష్ బాబుకు షాకింగ్ ట్రీట్మెంట్ ఇచ్చింది ఏపీ ప్రభుత్వం...
Vijayawada Durga Temple Ex EO : బెజవాడ దుర్గగుడి మాజీ ఈవో సురేష్ బాబుకు షాకింగ్ ట్రీట్మెంట్ ఇచ్చింది ఏపీ ప్రభుత్వం. రాజమండ్రి ఆర్జేసీగా నిన్నటి నియామకపు ఉత్తర్వులను ఏపీ దేవాదాయశాఖ రద్దు చేసింది. విజయవాడ కనకదుర్గమ్మ దేవస్థానం జాయింట్ కమిషనర్, ఈవో గా బాధ్యతల నుంచి తప్పించిన జగన్ సర్కారు నిన్న సురేష్ బాబును ను రాజమండ్రి ఆర్జేసీగా బదిలీ చేసింది. అయితే, ఈ సాయంత్రం ఆర్జేసీ నియామకపు ఉత్తర్వులను రద్దు చేస్తూ జీవో 208 విడుదల చేసింది. అంతేకాదు, దేవాదాయ కమిషనర్ కార్యాలయంలో రిపోర్టు చేయాలని ఆదేశిచ్చింది.
ఇలా ఉండగా, విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన భమరాంబ మళ్లిఖార్జున స్వామి వారి దేవస్థానం జాయింట్ కమిషనర్.. నూతన ఎగ్జిక్యుటివ్ ఆఫీసర్ (ఈఓ) గా భ్రమరాంబ ను నియమిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిన్న ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ నియామకం తక్షణమే అమల్లోకి వస్తుందని కూడా ప్రభుత్వం పేర్కొంది. ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి వాణీమోహన్ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. ఇక, సురేష్ బాబును ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ రీజినల్ జాయింట్ కమిషనర్ గా నియమిస్తూ నిన్న తీసుకున్న నిర్ణయాన్ని ఇవాళ వెనక్కి తీసుకుంటూ సంచలన ఉత్తర్వులిచ్చింది ఏపీ దేవాదాయశాఖ.
కాగా, దుర్గగుడిలో ఇటీవల ఏసీబీ అధికారులు సోదాలు చేసి దేవస్థానంలో అక్రమాలపై ప్రభుత్వానికి నివేదిక ఇచ్చిన సంగతి తెలిసిందే. ప్రాథమిక నివేదిక ఆధారంగా 15 మంది ఉద్యోగులను ప్రభుత్వం అప్పట్లో సస్పెండ్ చేసింది. దేవస్థానంలో గత రెండేళ్లుగా జరుగుతున్న అక్రమాలకు సంబంధించి అభియోగాలు మోపుతూ మరో నివేదికను ఏసీబీ అధికారులు ప్రభుత్వానికి పంపించారు. దీంతో ప్రభుత్వం దిద్దుబాటు చర్యలకు దిగింది. అప్పట్లోనే ఈవో సురేష్ బాబు బదిలీ అవుతారని పెద్ద ఎత్తున ఊహాగానాలు వినిపించాయి.
Reada also: రేషన్ పంపిణీ పూర్తయ్యే వరకూ గ్రామ, వార్డు వాలంటీర్లు వాహనం వెంటే.. ఇంకా అదనపు బాధ్యతలు ఏమేమిటంటే..