Ugadi : ఈ ఏడాదీ.. ఉగాది పర్వదినంపై కరోనా ప్రభావం , తెలంగాణలో నిరాడంబరంగా పండుగ, పంచాంగ శ్రవణం

Ugadi Festival : తెలుగువారి కొత్త సంవత్సరాది పండుగ ఉగాదిపై కరోనా ప్రభావం వరుసగా రెండో ఏడాదీ పడింది...

Ugadi : ఈ ఏడాదీ.. ఉగాది పర్వదినంపై కరోనా ప్రభావం , తెలంగాణలో నిరాడంబరంగా పండుగ, పంచాంగ శ్రవణం
Indra Karan On Ugadi
Follow us

|

Updated on: Apr 08, 2021 | 5:53 PM

Ugadi Festival : తెలుగువారి కొత్త సంవత్సరాది పండుగ ఉగాదిపై కరోనా ప్రభావం వరుసగా రెండో ఏడాదీ పడింది. గతేడాది కరోనా తీవ్ర ప్రభావాన్ని చూపించన తరుణంలో ఉగాది సంబరాలు మొత్తానికి మమ అనిపించేశారు. ఇక ఈ ఏడాదైనా ఉగాది పర్వదినాన్ని ఉత్సాహంగా తెలుగు ప్రజలు జరుపుకుంటారనుకుంటే, ఆ పరిస్థితీ కనిపించడంలేదు. కరోనా రెండో దఫా తన ప్రతాపాన్ని చూపిస్తుండటంతో ఈ ఏడాది ఉగాది పండుగనూ నిరాడంబరంగా కానివ్వాలని తెలంగాణ సర్కారు నిర్ణయించింది. ప్రతి ఏటా ఉగాది వేడుకలను ప్రభుత్వం అట్టహాసంగా నిర్వహించడం ఆనవాయితీ. అయితే, కరోనా వైరస్ వ్యాప్తి నిరోధక చర్యల్లో భాగంగా సీఎం కేసీఆర్ ఆదేశాల మేర‌కు ఈసారి కూడా ఉగాది వేడుక‌లను నిరాడంబరంగా నిర్వహిస్తున్నట్లు దేవాదాయ శాఖ మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి తెలిపారు.

ప్రతి ఒక్కరూ ఇళ్లలోనే ఉండి టీవీలలో ప్రత్యక్ష ప్రసారం ద్వారా పంచాంగ శ్రవణాన్ని వీక్షించాలని తెలంగాణ దేవాదాయ శాఖ మంత్రి సూచించారు. కరోనా వైరస్ వ్యాప్తి దృష్ట్యా భక్తులు ప్రస్తుత పరిస్థితిని అర్థం చేసుకొని, సహకరించాలని కోరారు. ఇక, బొగ్గుల‌కుంట‌లోని దేవాదాయ శాఖ ప్రధాన కార్యాలయంలో ఈ నెల 13 న ఉగాది ప‌ర్వ‌దినాన్ని పుర‌స్క‌రించుకుని యాదాద్రి శ్రీల‌క్ష్మిన‌ర్సింహా స్వామి దేవాస్థాన ఉగాది పంచాంగాన్ని మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి ఆవిష్క‌రిస్తారు. అనంత‌రం ఉద‌యం 10.45 నిమిషాల‌కు బాచంపల్లి సంతోష్ కుమార్ శాస్త్రి పంచాంగ ప‌ఠ‌న కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హిస్తారని మంత్రిత్వశాఖ ఒక ప్రకటనలో వెల్లడించింది.

Read also : Begum Bazar : హైదరాబాద్‌ బేగం బజార్ పై కరోనా సెకండ్‌ వేవ్ పంజా, మార్కెట్ అసోసియేషన్ కీలక నిర్ణయం!