Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Horoscope Today: ఈ రాశి వారికి అనుకోకుండా సంపద పెరుగుతుంది.. శుక్రవారం రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే.

Horoscope Today: తమ భవిష్యత్తు ఎలా ఉండబోతోందని ముందే తెలుసుకోవాలన్న ఆసక్తి ప్రతి ఒక్కరికీ ఉంటుంది. దీనికి ప్రపంచ వ్యాప్తంగా చాలా మంది విశ్వసించే విధానం జ్యోతిష్యం. జ్యోతిష్య శాస్త్రం మేరకు 12 రాశుల వారికి శుక్రవారం (05 మే 2023).. రాశిఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి..

Horoscope Today: ఈ రాశి వారికి అనుకోకుండా సంపద పెరుగుతుంది.. శుక్రవారం రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే.
Telugu AstrologyImage Credit source: TV9 Telugu
Follow us
Narender Vaitla

|

Updated on: May 05, 2023 | 5:00 AM

Horoscope Today: తమ భవిష్యత్తు ఎలా ఉండబోతోందని ముందే తెలుసుకోవాలన్న ఆసక్తి ప్రతి ఒక్కరికీ ఉంటుంది. దీనికి ప్రపంచ వ్యాప్తంగా చాలా మంది విశ్వసించే విధానం జ్యోతిష్యం. జ్యోతిష్య శాస్త్రం మేరకు 12 రాశుల వారికి శుక్రవారం (05 మే 2023).. రాశిఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి..

మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)

అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. ఆర్థిక ప్రయత్నాలు ఆశించిన విధంగా సఫలం అవుతాయి. రాదనుకుని వదిలేసుకున్న డబ్బు కూడా కొద్ది ప్రయత్నంతో తిరిగి చేతికి అందు తుంది. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది. పెళ్లి ప్రయత్నాలలో శుభవార్తలు వింటారు. తొందర పాటు నిర్ణయాలు తీసుకోవద్దు. కుటుంబ సభ్యు లను కలుపుకొని ముందుకు సాగడం మంచిది. ఉద్యోగ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. వృత్తి, వ్యాపారాలు నిలకడగా ముందుకు వెడతాయి. ప్రేమ వ్యవహారాలు సంతృప్తికరంగా ఉంటాయి.

వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)

అటు ఉద్యోగ జీవితం ఇటు కుటుంబ జీవితం ప్రశాంతంగా సాగిపోతాయి. మీకు రావలసిన డబ్బు కొద్ది ప్రయత్నంతో చేతికి రావడంతో ముఖ్యమైన అవసరాలు తీరిపోతాయి. అనవసర ఖర్చులు అదుపు చేయడం మంచిది. వృత్తిపరంగా, వ్యాపార పరంగా ఒకటి రెండు శుభవార్తలు వింటారు. గతంలో కుటుంబ పరంగా మీరు తీసుకున్న నిర్ణయాలు ఇప్పుడు మంచి ఫలితాలను ఇస్తాయి. శరీరానికి కొద్దిపాటి విశ్రాంతి అవసరమని గ్రహించండి. ప్రేమ వ్యవహారాలు ఆనందంగా ముందుకు వెళతాయి.

ఇవి కూడా చదవండి

మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)

కొన్ని ముఖ్యమైన పనులు విజయవంతంగా పూర్తి అవుతాయి. ఆర్థికంగా కొద్దిగా కలిసి వస్తుంది. పరోపకార బుద్ధితో ఇతరులకు సహాయం చేస్తారు. ఉద్యోగంలో అధికారులు ప్రత్యేక బాధ్యతలను అప్పగిస్తారు. కుటుంబ సభ్యులకు సంబంధించి ఒక శుభవార్త వింటారు. బంధు వర్గంలో మంచి పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది. నిరుద్యోగులకు ఒక మంచి కంపెనీ నుంచి ఆఫర్ రావచ్చు. ఆహార విహారాల్లో జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఉంది. ప్రేమ వ్యవహారాలు అనుకూలంగా ముందుకు వెళతాయి.

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)

ఉద్యోగ పరంగా, కుటుంబ పరంగా ఒత్తిడి పెరుగుతుంది. పూర్తి చేయాల్సిన ముఖ్యమైన పనుల సంఖ్య ఎక్కువగా ఉంటుంది. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా పురోగతి చెందుతుంది. విలాసాల మీద, దానధర్మాల మీద ఖర్చు చేయడం కొద్దిగా తగ్గించుకుంటే మంచిది. పొదుపు పాటించాల్సిన అవసరం ఉంది. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. బాగా తెలిసిన కుటుంబంతో పెళ్లి సంబంధం కుదిరే సూచనలు ఉన్నాయి. పిల్లల నుంచి శుభవార్త వింటారు. ప్రేమలో భాగంగా భారీగా కానుకలు కొని ఇస్తారు.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)

ఒకటి రెండు వ్యక్తిగత, కుటుంబ సమస్యల నుంచి అనుకోకుండా బయటపడటం జరుగుతుంది. కొందరు మిత్రుల విషయంలో అప్రమత్తంగా ఉండటం మంచిది. ఆర్థిక పరిస్థితి సానుకూల పడుతుంది. కొందరు బంధువులు స్నేహితులు మీకు ఇవ్వాల్సిన డబ్బు తిరిగి ఇచ్చే అవకాశం ఉంది. ఆరోగ్యం అనుకూలంగానే ఉంటుంది. నిరుద్యోగులకు ఆఫర్ అందవచ్చు. మంచి పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది. ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ప్రేమ వ్యవహారాల్లో దూసుకు వెళతారు.

కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)

ఉద్యోగంలో అనుకోకుండా అపార్ధాలు ఎదురయ్యే అవకాశం ఉంది. అధికారులతో ఆచితూచి వ్యవహరించడం మంచిది. వృత్తి, వ్యాపారాల్లో పని భారం బాగా పెరుగుతుంది. కుటుంబ సభ్యుల నుంచి ఆశించిన సహకారం లభిస్తుంది. జీవిత భాగస్వామితో సంప్రదించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది. కొద్దిగా డబ్బు మోసపోయే ప్రమాదం ఉంది. మిత్రుల సహా యంతో ముఖ్యమైన పనులు పూర్తవుతాయి. పిల్లలు శుభవార్త తీసుకువస్తారు. ప్రేమ వ్యవహా రాలలో అనుకోని సమస్యలు ఎదురవుతాయి.

తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)

ఆర్థికంగా అనుకూల కాలం నడుస్తోంది. అద నపు ఆదాయ ప్రయత్నాలకు విజయం లభిస్తుంది. ఉద్యోగపరంగా ఆదాయం లేదా సంపా దనకు సంబంధించి శుభవార్తలు వింటారు. వృత్తి, వ్యాపారాల్లో క్షణం కూడా తీరికలేని పరిస్థితి ఏర్పడుతుంది. ప్రస్తుతానికి అనారోగ్యాలేవీ దగ్గరకు రాకపోవచ్చు. దూర ప్రాంతం నుంచి ఆశించిన తీపి కబురు అందుతుంది. నిరు ద్యోగుల ప్రయత్నాలు సఫలం అవుతాయి. స్నేహి తులతో విందులు వినోదాలు పాల్గొంటారు. ప్రేమ వ్యవహారాలు ఉత్సాహంగా ఉల్లాసంగా సాగి పోతాయి.

వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట)

ఆర్థిక పరిస్థితి నిలకడగా ఉంటుంది. వృత్తి, వ్యాపారాల్లో మాత్రం ఒకటి రెండు ఆర్థిక సమస్యలు ఎదురై ఇబ్బంది పడతారు. ఉద్యోగ పరంగా రోజంతా సాఫీగా గడిచిపోతుంది. ఆరోగ్యం మీద ఒక కన్ను వేసి ఉండటం మంచిది. నిరుద్యోగుల ప్రయత్నాలు సఫలం అవుతాయి కానీ అవి అంత సంతృప్తికరంగా ఉండవు. ఆర్థిక లావాదేవీలకు ప్రస్తుతానికి దూరంగా ఉండటం మంచిది. కుటుంబంలోని పెద్దల నుంచి ఆశించిన సహకారం లభిస్తుంది. కొద్దిపాటి ప్రయత్నంతో పెళ్లి సంబంధం కుదురుతుంది. ప్రేమ వ్యవహా రాలు కొద్దిగా నిరుత్సాహం కలిగిస్తాయి.

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)

వ్యక్తిగత సమస్య ఒకటి అనుకో కుండా పరిష్కారం అయ్యి కొద్దిగా మనశ్శాంతి లభిస్తుంది. కుటుంబంలో ప్రశాంత వాతావరణం నెలకొంటుంది. పెళ్లి ప్రయత్నాలు సానుకూలంగా ముందుకు వెళ్లకపోవచ్చు. ఉద్యోగంలో సహచరుల సహాయంతో లక్ష్యాలను పూర్తి చేయగలుగుతారు. వృత్తి వ్యాపారాల్లో లాభాలు నిలకడగా ముందుకు సాగుతాయి. ముఖ్యమైన పనులు వాయిదా పడుతూ ఆర్థిక భారాన్ని పెంచే అవకాశం ఉంది.ప్రేమ వ్యవహారాలు మధ్య మధ్య ఇబ్బంది పెడుతూ ఉంటాయి.

మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2)

అనుకోకుండా సంపాదన పెరిగే సూచనలు ఉన్నాయి. అనవసర ఖర్చులు తగ్గించుకొని పొదుపు పాటించడం మంచిది. ఉద్యోగ జీవితం గౌరవప్రదంగా సాగిపోతుంది. వ్యాపారంలో లాభాలు పెరుగుతాయి. డాక్టర్లు, లాయర్లు, ఇంజనీర్లు, ఐటి రంగానికి చెందినవారు బాగా బిజీ అయిపోయే అవకాశం ఉంది. చిన్న వ్యాపారులు, స్వయం ఉపాధి వారు కూడా లాభాల బాటలో పడతారు. ముఖ్యమైన పనులు సకాలంలో విజయవంతంగా పూర్తి అవుతాయి. ప్రేమ వ్యవహారాలు ఉత్సాహంగా సాగిపోతాయి.

కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)

ఈ రాశి వారికి కష్టేఫలి అనే సూత్రం బాగా వర్తిస్తుంది. ఉద్యోగంలో పని భారం పెరుగుతుంది. కుటుంబపరంగా కూడా ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ఈ రాశి వారి శక్తి సామర్థ్యాలను గుర్తించిన అధికారులు అదనపు బాధ్యతలు అప్పగించడం జరుగుతుంది. ఆర్థిక పరిస్థితి చాలా వరకు నిలకడగా ఉంటుంది. ఖర్చుల్ని తగ్గించుకుంటారు. ఆరోగ్యం బాగానే సహకరిస్తుంది. ఒక ముఖ్యమైన వ్యక్తిగత సమస్య నుంచి మిత్రుల సహాయంతో బయట పడటం జరుగుతుంది. ప్రేమ వ్యవహారాలు నిలకడగా ముందుకు సాగుతాయి.

మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)

ఒకటి రెండు అతి పెద్ద ఆర్థిక సమస్యల నుంచి బయటపడటానికి అవకాశం ఉంది. అదనపు ఆదాయం కోసం మీరు చాలా కాలంగా చేస్తున్న ప్రయత్నాలు సఫలం కావచ్చు. ఉద్యోగ పరిస్థితి సానుకూలంగా ఉంటుంది. వృత్తి వ్యాపారాలు ఆశించిన స్థాయిలో పురోగతి చెందుతాయి. డాక్టర్లకు, లాయర్లకు గౌరవ మర్యాదలు పెరుగు తాయి. మంచి డిమాండ్ ఏర్పడుతుంది. ఆహార విహారాల్లో జాగ్రత్తలు పాటించడం మంచిది. కుటుంబ సభ్యులలో ఒకరి ఆరోగ్యం కొద్దిగా ఆందోళన కలిగిస్తుంది. ప్రేమ వ్యవహారాలు మందకొడిగా ముందుకు వెళతాయి. డబ్బు విషయాలలో జాగ్రత్తగా ఉండాలి.

Note: (ఇక్కడ ఇచ్చిన సమాచారం నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది.. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం).

మరిన్ని జ్యోతిష్య కథనాల కోసం క్లిక్ చేయండి..