Horoscope Today: ఈ రాశివారు వ్యాపారంలో ఎదురయ్యే ఆటంకాలను అధిగమించే ప్రయత్నం చేస్తారు..!

Today Rasi Phalalu: మనం పలు సందర్భాల్లో ముందువెనుక ఆలోచించకుండా తీసుకునే నిర్ణయాలతో ఊహించనిరీతిలో జీవితం ప్రమాదంలో పడుతుంది..

Horoscope Today: ఈ రాశివారు వ్యాపారంలో ఎదురయ్యే ఆటంకాలను అధిగమించే ప్రయత్నం చేస్తారు..!
Rasi Phalalu
Follow us
Subhash Goud

|

Updated on: Aug 03, 2021 | 9:09 AM

Today Rasi Phalalu: మనం పలు సందర్భాల్లో ముందువెనుక ఆలోచించకుండా తీసుకునే నిర్ణయాలతో ఊహించనిరీతిలో జీవితం ప్రమాదంలో పడుతుంది. కావున తీసుకునే ప్రతి నిర్ణయంలోనూ, చేపట్టే ప్రతీ కార్యంలోనూ ఆచితూచి, సమయానుకూలంగా అడుగులు వేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అయితే మంగళవారం పలు రాశుల వారికి పరిస్థితులు అనుకూలంగా ఉంటే.. మరికొన్ని రాశుల వారికి అనుకూలంగా లేవు. ఈ రోజు రాశిఫలాలు ఓ సారి చూద్దాం..

మేషరాశి:

ఈ రాశివారికి ఈ రోజు చేపట్టే పనులలో ఆటంకాలు ఎదురయ్యే అవకాశం ఉంది. వాటిని అధిగమించే ప్రయత్నం చేస్తారు. కీలకమైన పనులలో ఆలోచించి అడుగు వేయాలి. చంద్ర ధ్యానం మేలు చేస్తుంది.

వృషభరాశి:

ఈ రాశివారు ఆదాయ మార్గాలు పెంచుకునేందుకు ప్రయత్నాలు చేస్తారు. కుటుంబ సభ్యుల సలహాలు, సూచనలు ఎంతో అవసరం. దుర్గాదేవిని పూజించడం మేలు జరుగుతుంది.

మిథునరాశి:

ఈ రాశివారు సకాలంలో పనులను పూర్తి చేస్తారు. ఆత్మీయులతో ఆనందంగా గడుపుతారు. వ్యాపారాలలో లాభాలు పొందుతారు. గణపతి పూజ మేలు చేస్తుంది.

కర్కాటకరాశి:

మీరు చేసే పనులపై ప్రశంసలు కురిపిస్తారు. పెద్దల సహకారం అవసరం. ముఖ్యమైన పనులను పూర్తి చేస్తారు. మహాలక్ష్మీ అమ్మవారికి పూజించడం మేలు జరుగుతుంది.

సింహరాశి:

వ్యాపారంలో ముందుకు సాగుతారు. ఎదురయ్యే ఆటంకాలను అధిగమించే ప్రయత్నాలు చేస్తారు. ఏదైనా పనులు చేపట్టే ముందు ఆలోచించి నిర్ణయం తీసుకోవడం మంచిది. ఇష్టదైవ ఆరాధన మేలు చేస్తుంది.

కన్యరాశి:

చేపట్ట పనులలో శ్రమ పెరుగకుండా చూసుకోవాలి. ఆర్థిక విషయాలలో జాగ్రత్తలు తీసుకోవాలి. డబ్బులు పొదుపుగా ఖర్చు చేయాలి. శ్రీవేంకటేశ్వరస్వామిని దర్శించడం మేలు జరుగుతుంది.

తులరాశి:

ఈ రాశివారికి అలసట పెరుగుతుంది. బంధుమిత్రులతో ఆచితూచిగా వ్యవహరించాలి. ఒక సంఘటన మిమ్మల్ని బాధపెట్టే అవకాశం ఉంది. మహాలక్ష్మీని పూజించడం మంచిది.

వృశ్చిక రాశి:

ధైర్యంతో పనులు చేపడితే విజయం మీ సొంతం అవుతుంది. విందు, వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. అనవసర ఖర్చులు పెరిగే అవకాశాలున్నాయి. ఇష్టదైవాన్ని పూజించడం మంచిది.

ధనుస్సు రాశి:

ఉద్యోగులు శుభవార్తలు వింటారు. తోటివారి సహాయం అందుతుంది. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. బంధువులతో వాదనలు చేయకపోవడం మంచిది. శ్రీవేంకటేశ్వరస్వామి ఆరాధన మేలు చేస్తుంది.

మకరరాశి:

వృత్తి, ఉద్యోగ, వ్యాపారుల వారికి అనుకూలంగా ఉంటుంది. వ్యాపారాలలో రాణిస్తుంటారు. ముఖ్యమైన విషయాలలో అనుకూలమైన నిర్ణయాలు ఉంటాయి. శివుడిని పూజించడం మేలు జరుగుతుంది.

కుంభరాశి:

ఈ రాశివారి తలపెట్టిన పనులు ముందుకు సాగుతాయి. ముఖ్యమైన విషయాలలో అనుకూలమైన నిర్ణయాలు తీసుకుంటారు. శిశస్తోత్రాన్ని పఠించడం మంచి జరుగుతుంది.

మీన రాశి:

తోటివారి సహకారంతో అనుకున్నది సాధిస్తారు. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా పట్టుదలతో ముందుకు సాగుతారు. అధికంగా శ్రమించాల్సి ఉంటుంది. గణపతిని పూజించడం మంచిది.

ఇవీ కూడా చదవండి:

Kamakshi Deepam: మీ ఇంట్లో అఖండ ఐశ్వర్యాలతో నింపే కామాక్షిదీపం అంటే ఏమిటి.. ఎలా పెట్టాలంటే

Astrology: మంచి శకునాలు-చెడు శకునాలు.. మీ జీవితంపై వాటి ప్రభావం ఎంతవరకు ఉంటుంది.?