Horoscope Today: ఈ రాశుల వారందరికీ ఆకస్మిక ధనలాభ సూచనలు.. శనివారం రాశి ఫలాలు
Rasi Phalalu Today: మనం చాలా సందర్భాల్లో ముందువెనుక ఆలోచించకుండా తీసుకునే కొన్ని నిర్ణయాలతో ఊహించనిరీతిలో ప్రమాదంలో
Rasi Phalalu Today: మనం చాలా సందర్భాల్లో ముందువెనుక ఆలోచించకుండా తీసుకునే కొన్ని నిర్ణయాలతో ఊహించనిరీతిలో ప్రమాదంలో పడుతుంటాం. కావున తీసుకునే ప్రతి నిర్ణయంలోనూ, చేపట్టే ప్రతీ కార్యంలోనూ ఆచితూచి, సమయానుకూలంగా అడుగులు వేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. శనివారం ముఖ్యంగా పలు రాశుల వారికి పరిస్థితులు అనుకూలంగా లేవు. మరికొన్ని రాశుల వారికి అనుకూలంగా ఉన్నాయి. అయితే.. ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితాలు కలగనున్నాయో ఓ సారి చూద్దాం..
మేష రాశి: ఈ రాశి వారికి ఈ రోజు కార్యక్రమాలన్నీ సజావుగా జరుగుతాయి. ఆకిస్మక ధనలాభం ఏర్పడటంతోపాటు విందులు, వినోదాల్లో పాల్గొంటారు. బంధు, మిత్రులను, ఉన్నతాధికారులను కలుస్తారు. కొత్త కార్యక్రామాలను ప్రారంభించే అవకాశముంది.
వృషభ రాశి: ఈ రాశి వారు ముఖ్యమైన సమాచారాన్ని అందుకుంటారు. ఆకస్మిక ధనలాభం సూచనలు కనిపిస్తున్నాయి. ప్రయత్నకార్యక్రమాలన్నీ ఫలిస్తాయి. బంధు, మిత్రులను కలుస్తారు. ఆచితూచి అడుగులు వేయడం మంచిది.
మిథున రాశి: ఈ రాశి వారి స్థిరాస్తులకు సంబంధించిన సమస్యలు తీరే అవకాశాలు కనిపిస్తున్నాయి. సమయానుకూలంగా నిర్ణయాలు తీసుకోవాలి. మానసిక ప్రశాంతత లభిస్తుంది. దైవదర్శనం చేసుకుంటే చేసుకుంటే మంచిది.
కర్కాటక రాశి: ఈ రోజు ఈ రాశి వారు పట్టుదలతో కొన్ని కార్యక్రమాలను విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు. వృత్తి రీత్యా గౌరవ, మర్యాదలు లభిస్తాయి. కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉంటాయి. కొన్ని అనారోగ్య బాధలు ఇబ్బందులకు గురిచేస్తుంటాయి.
సింహ రాశి: ఈ రాశి వారు కొత్త కార్యక్రమాలను ప్రారంభించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రతి విషయంలో వ్యయ, ప్రయాసలు ఏర్పడతాయి. జాగ్రత్తలు తీసుకుంటే మంచిది. ఆకస్మిక ధననష్టమేర్పడే అవకాశం ఉంది. బంధు, మిత్రులతో కలహాలు ఏర్పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.
కన్య రాశి: ఈ రాశి వారి కార్యక్రమాలకు ఆటంకాలు ఎదురవుతాయి. స్థిరాస్తులకు సంబంధించిన విషయాల్లో జాగ్రత్తగా ఉండడం మంచిది. ఆర్థిక పరిస్థితి ఆందోళనకరంగా ఉంటుంది. నూతన కార్యాలను ప్రారంభించకపోవడం మంచిది.
తులా రాశి: ఈ రాశివారు సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటారు. కుటుంబంలో సుఖ సంతోషాలు ఉంటాయి. ప్రయత్నకార్యక్రమాలన్నింటిలో విజయం సాధిస్తారు. ఆకస్మిక ధనలాభయోగం సూచనలు కనిపిస్తున్నాయి. బంధు మిత్రులతో జాగ్రత్తగా ఉండాలి.
వృశ్చిక రాశి: ఈ రాశి వారిక మానసికోల్లాసం ఉంటుంది. కుటుంబంతో సంతోషంగా గడుపుతారు. గతంలో వాయిదా వేసిన పనులన్నీంటిని పూర్తి చేసుకోగలుగుతారు. కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే.. ప్రయత్నకార్యాలన్నీ ఫలించే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ధనస్సు రాశి: ఈ రాశి వారికి ప్రారంభ కార్యాలన్నింటిలో ఆటంకాలు ఏర్పడతాయి. అనారోగ్య బాధలు ఇబ్బందులకు గురిచేస్తుంటాయి. ఆర్థిక ఇబ్బందుల దృష్ట్యా ఎలాంటి కార్యాలను ప్రారంభించకపోవడం మంచిది. జాగ్రత్తగా వ్యవహరించాలి.
మకర రాశి: ఈ రాశి వారికి కొన్ని అనుకూల పరిస్థితులు కనిపిస్తున్నాయి. నూతన కార్యక్రమాలను ప్రారంభించే అవకాశాలు కనిపిస్తున్నాయి. కుటుంబంతో ఉల్లాసంగా ఉంటారు. బంధు, మిత్రులను కలుస్తారు. ఆకస్మిక ధనలాభం కలిగే సూచనలు కనిపిస్తున్నాయి.
కుంభ రాశి: ఈ రాశి వారి పనులు సక్రమంగా పూర్తవుతాయి. ఆకస్మిక ధనలాభయోగ సూచనలు కనిపిస్తున్నాయి. ముఖ్యమైన వ్యక్తులను, బంధు మిత్రులను కలుస్తారు. మానసికోల్లాసం ఉంటుంది.
మీన రాశి: ఈ రాశి వారికి కొన్ని కార్యాలు, రుణ ప్రయత్నాలు తొందరగా ఫలిస్తాయి. శుభకార్యక్రమాల వల్ల ధన వ్యయం అధికమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ప్రయాణాలు ఎక్కువ అవుతాయి. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు అవసరం.
Also Read: