Horoscope Today: ఈ రాశివారికి ఈరోజు కుటుంబంలో కలహాలు తప్పవు.. జాగ్రత్తగా ఉండాలి. మీ రాశి ఫలాలు చెక్ చేసుకోండి.
Horoscope Today: మనలో చాలా మంది రాశి ఫలాలను విశ్వసిస్తారు. వీటి ఆధారంగా రోజును ప్రారంభించే వారు ఎందరో. రాశి ఫలితాలను పరిగణలోకి తీసుకొని కొత్త పనులు ప్రారంభించడం, లేదా...
Horoscope Today: మనలో చాలా మంది రాశి ఫలాలను విశ్వసిస్తారు. వీటి ఆధారంగా రోజును ప్రారంభించే వారు ఎందరో. రాశి ఫలితాలను పరిగణలోకి తీసుకొని కొత్త పనులు ప్రారంభించడం, లేదా వాయిదా వేసుకోవడం చేస్తుంటారు. మరి ఆదివారం అందూలోనూ కొత్త నెల ప్రారంభం రోజున మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయో ఓసారి చెక్ చేసుకోండి. దానికి అనుగుణంగా మీ రోజును ప్లాన్ చేసుకోండి..
మేషం: ఈ రాశి వారు ఎప్పటి నుంచో ఉన్న ఆర్థిక ఇబ్బందులను దాటడానికి ప్రయత్నాలు చేస్తారు. ఇందుకో రుణాలు తీసుకోవడానికి ప్రయత్నాలను ప్రారంభిస్తారు. మేష రాశివారు ఈరోజు ప్రయాణాలు చేసే సమయంలో చాలా జాగ్రత్తగా ఉండడం సూచించదగ్గ అంశం.
వృషభం: వృషభ రాశి వారికి ఆకస్మిక ధన నష్టం కలిగే అవకాశం కనిపిస్తోంది కాబట్టి జాగ్రత్తగా ఉండడం అవసరం. బంధు, మిత్రులతో గొడవలు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. మాట్లాడే సమయంలో ఒకటికి రెండు సార్లు ఆలోచించడం అవసరం. వృత్తి, ఉద్యోగాల్లో ఓపికతో ఉండాలి.
మిథునం: విదేశీ ప్రయాణాలు చేసే వారికి ప్రయత్నాలు ఫలించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ రాశుల వారికి ధన లాభం కలిగే సూచనలు కనిపిస్తుంది. దూరబంధువులను కలిసే అవకాశాలు కనిపిస్తున్నాయి.
కర్కాటకం: ఈ రాశివారికి ఈరోజు బంధు, మిత్రులతో విబేధాలు ఏర్పడే అవకాశం కనిపిస్తోంది జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. మనసు చంచలంగా ఉంటుంది.
సింహం: సింహ రాశి వారు గతంలో వాయిదా వేసిన పనులను విజయవంతంగా పూర్తి చేస్తారు. విందు, వినోద కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశాలు కనిపిస్ఉతన్నాయి. ఎప్పటి నుంచో ఉన్న జటిల సమస్యలకు పరిష్కారం కనిపించే అవకాశాలున్నాయి.
కన్య: ఈ రాశి వారికి బంధు, మిత్రులతో విబేధాలు ఏర్పడే అవకాశం కనిపిస్తోంది. అనవసరమై ఖర్చులు పెరిగే అవకాశం కనిపిస్తోంది. విదేశీయాన ప్రయత్నాలు చేస్తున్న వారికి అనుకూల వాతావరణం కనిపిస్తోంది.
తుల: తుల రాశివారు అనారోగ్య సమస్యలతో బాధపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ రోజు కొత్త వ్యక్తులు పరిచయమవుతారు. కుటుంబంలో ఏర్పడే కొన్ని ప్రతికూల పరిస్థితుల కారణంతో మానసిక ఆందోళన ఏర్పడే అవకాశం కనిపిస్తోంది. ఆర్థిక ఇబ్బందుల నుంచి కొంతమేర ఉపశమనం లభిస్తుంది.
వృశ్చికం: ఈ రాశివారికి ఈరోజు ఆకస్మిక ధన లాభం కలిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎప్పటి నుంచో అప్పులు తీరే మార్గం కనిపిస్తోంది. ఆరోగ్యం మెరుగవుతుంది. పేరు, ప్రతిష్టలు లభిస్తాయి.
ధనస్సు: ధనస్సు రాశివారికి ఈరోజు అనుకూలత కనిపిస్తోంది. ఎప్పటి నుంచో పెండింగ్‌లో ఉన్న సమస్యలు పరిష్కారమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. నూత ఆభరణాలు కొనుగోలు చేస్తారు. ఈరాశి వారు ఈరోజు చేసే ప్రయత్నాలు ఫలించే అవకాశాలున్నాయి.
మకరం: ఈ రాశివారు ఈరోజు చేసే పనుల్లో కొన్ని ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం కనిపిస్తోంది. ఆచి తూచి నిర్ణయం తీసుకుంటే మంచిది. అంతేకాకుండా కుటుంబంలో కలహాలు ఏర్పడే అవకాశం కనిపిస్తోంది. రుణాల కోసం ఎదురు చూసే వారికి శుభ ఫలితాలు కనిపించే అవకాశం ఉంది.
కుంభం: కుంభరాశి వారికి ఆకస్మిక ధన నష్టం కలిగే అవకాశాలు ఉంటాయి. వృత్తి, ఉద్యోగరంగాల్లో ఆలస్యంగా అభివృద్ధి కనిపిస్తాయి. ఏ విషయంలోనూ నిర్ణయాలను అంత సులువుగా తీసుకోలేరు. అనుకోని ఆపదల్లో చిక్కుకోకుండా జాగ్రత్తగా ఉండడం మంచిది.
Friendship Day 2021: చెక్కు చెదరని బంధమే స్నేహం.. అంతర్జాతీయ ఫ్రెండ్‌షిప్ డే ఎలా వచ్చిందంటే..!