Horoscope Today: ఆర్థిక సమస్యల నుంచి వారు బయటపడుతారు.. 12 రాశుల వారికి శనివారంనాటి రాశిఫలాలు

Today Horoscope in Telugu (November 30, 2024): మేష రాశి వారికి ఉద్యోగంలో హోదాతో పాటు జీతం పెరిగే అవకాశం ఉంది. వృషభ రాశి వారికి ఆకస్మిక ధన లాభానికి కూడా అవకాశం ఉంది. మిథున రాశి వారు ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండాలి. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి శనివారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..

Horoscope Today: ఆర్థిక సమస్యల నుంచి వారు బయటపడుతారు.. 12 రాశుల వారికి శనివారంనాటి రాశిఫలాలు
Horoscope Today 30 November 2024
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By: Janardhan Veluru

Updated on: Nov 30, 2024 | 5:01 AM

దిన ఫలాలు (నవంబర్ 30, 2024): మేష రాశి వారికి ఉద్యోగంలో హోదాతో పాటు జీతం పెరిగే అవకాశం ఉంది. వృషభ రాశి వారికి ఆకస్మిక ధన లాభానికి కూడా అవకాశం ఉంది. మిథున రాశి వారు ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండాలి. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి శనివారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..

మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)

ఉద్యోగంలో హోదాతో పాటు జీతం పెరిగే అవకాశం ఉంది. అదనపు బాధ్యతలు, పని భారం పూర్తిగా తగ్గిపోతాయి. వృత్తి, వ్యాపారాలు ఆశాజనకంగా సాగిపోతాయి. ఆదాయం వృద్ధి చెందుతుంది. ఆర్థిక సమస్యలు కొద్దిగా తగ్గుతాయి. పిల్లల నుంచి ఇబ్బందులు ఎదురవుతాయి. ఆర్థిక వ్యవహారాల్లో అంచనాలు తలకిందులయ్యే అవకాశం ఉంది. కొద్దిగా జాగ్రత్తగా ఉండడం మంచిది. అనుకోకుండా ఆస్తి వివాదం పరిష్కారం అవుతుంది. గృహ, వాహన ప్రయత్నాలు ఫలిస్తాయి.

వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)

ఉద్యోగంలో బరువు బాధ్యతలు పెరిగినప్పటికీ ప్రతిఫలం ఉంటుంది. అనేక విధాలుగా ఆదాయం వృద్ధి చెందుతుంది. ఆకస్మిక ధన లాభానికి కూడా అవకాశం ఉంది. ఆర్థిక విషయాల్లో కొద్దిగా జాగ్రత్తగా ఉండడం అవసరం. వృత్తి, వ్యాపారాలు లాభాలపరంగా దూసుకుపోతాయి. మంచి పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది. ఇంటా బయటా గౌరవమర్యాదలు పెరుగుతాయి. కొన్ని వ్యక్తి గత, ఆర్థిక సమస్యలు పరిష్కారమవుతాయి. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి.

మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)

ఆదాయం పెరిగే అవకాశం ఉంది కానీ, ఆర్థిక సమస్యల నుంచి బయటపడడం మీద శ్రద్ద పెడతారు. శుభకార్యాల మీద కూడా ఖర్చు ఎక్కువగా ఉంటుంది. ఉద్యోగంలో అధికారుల నుంచి ఆదరణ లభిస్తుంది. అయితే, సహోద్యోగులతో ఇబ్బందులు తలెత్తుతాయి. వృత్తి, వ్యాపారాలు చాలావరకు అనుకూలంగా సాగిపోతాయి. ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండాలి. డబ్బు ఇవ్వడం, తీసుకోవడం వంటివి చేయకపోవడం మంచిది. నిరుద్యోగులకు సొంత ఊర్లోనే ఉద్యోగం లభిస్తుంది.

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)

అనేక విధాలుగా ఆదాయం పెరిగే అవకాశం ఉంది. ఉద్యోగ జీవితం ఉత్సాహంగా, సానుకూలంగా సాగిపోతుంది. అధికారులు మీకు అత్యధికంగా ప్రాధాన్యం ఇస్తారు. వృత్తి, వ్యాపారాలు లాభాల పరంగా పురోగమిస్తాయి. సమాజంలో కీర్తి ప్రతిష్ఠలు పెరుగుతాయి. కొందరు ప్రముఖులతో సన్ని హిత సంబంధాలేర్పడతాయి. ఏ ప్రయత్నం తలపెట్టినా తప్పకుండా నెరవేరుతుంది. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. పెళ్లి, ఉద్యోగ ప్రయత్నాల్లో సానుకూల సమాచారం అందుతుంది.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)

ఉద్యోగంలో పనిభారం ఎక్కువగా ఉంటుంది. అధికారులు ఒక పట్టాన సంతృప్తి చెందరు. వృత్తి, వ్యాపారాల్లో శ్రమాధిక్యత ఉన్నా ఆశించిన ఫలితం ఉంటుంది. వృత్తి, వ్యాపారాలు నిలకడగా సాగి పోతాయి. ఆదాయం కొద్దిగా వృద్ధి చెందుతుంది కానీ, కుటుంబ ఖర్చులు పెరుగుతాయి. ధన పరంగా ఎవరికీ వాగ్దానాలు చేయకపోవడం మంచిది. గృహ, వాహన ప్రయత్నాలు సానుకూల పడతాయి. వ్యక్తిగత సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. ఆరోగ్య సమస్యలు ఇబ్బంది పెడ తాయి.

కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)

సాధారణంగా ఏ ప్రయత్నం తలపెట్టినా విజయవంతం అవుతుంది. మీ సలహాలు, సూచనల వల్ల అటు అధికారులతో పాటు, ఇటు బంధుమిత్రులు కూడా లాభపడతారు. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాల్లో శుభ వార్తలు అందుతాయి. ఆదాయం ఆశించిన స్థాయిలో వృద్ధి చెందుతుంది. ముఖ్యమైన ఆర్థిక సమస్యల నుంచి బయటపడతారు. ఉద్యోగంలో పురోగతి ఉంటుంది. వృత్తి, వ్యాపారాల్లో లాభాలకు లోటుండదు. ఆరోగ్యం బాగా కుదుటపడుతుంది. కుటుంబ జీవితం సుఖసంతోషాలతో సాగిపోతుంది.

తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)

వృత్తి, వ్యాపారాలు నల్లేరు మీద బండిలా సాగిపోతాయి. ఉద్యోగంలో పదోన్నతి లభించే అవకాశం ఉంది. ఆదాయానికి లోటుండదు. ఖర్చుల్ని తగ్గించుకోవడం మంచిది. ఉద్యోగరీత్యా ప్రయాణాలు చేయవలసి వస్తుంది. మాటకు విలువ పెరుగుతుంది. లాభదాయక ఒప్పందాలు చోటు చేసుకుం టాయి. కుటుంబ జీవితం ఉత్సాహంగా, ఉల్లాసంగా సాగిపోతుంది. మాటకు విలువ పెరుగుతుంది. ఏ ప్రయత్నం తలపెట్టినా విజయవంతం అవుతుంది. సొంత పనుల మీద శ్రద్ధ పెట్టడం మంచిది.

వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట)

ఉద్యోగంలో పని భారం కాస్తంత ఎక్కువగానే ఉంటుంది. విశ్రాంతికి, విరామానికి అవకాశం ఉండక పోవచ్చు. ఆదాయం బాగా పెరిగే అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాలు నిలకడగా సాగిపోతాయి. సామాజికంగా గౌరవాభిమానాలు పెరుగుతాయి. నిరుద్యోగులకు సొంత ఊర్లోనే మంచి ఉద్యోగం లభించే అవకాశం ఉంది. పెళ్లి ప్రయత్నాలు ఫలించే సూచనలున్నాయి. షేర్లు, స్పెక్యులేషన్ల వల్ల అంచనాలకు మించి లాభాలు గడిస్తారు. ఉద్యోగులకు విదేశాల నుంచి కూడా ఆఫర్లు అందుతాయి.

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)

ఆశించిన స్థాయిలో ఆదాయం బాగా పెరుగుతుంది. కొన్ని ఆర్థిక సమస్యలు పరిష్కారం కావడంతో పాటు ముఖ్యమైన అవసరాలు తీరిపోయే అవకాశం ఉంది. ఉద్యోగులకు, నిరుద్యోగులకు విదేశీ అవకాశాలు కూడా అందుతాయి. పెళ్లి ప్రయత్నాల్లో విదేశీ సంబంధాల నుంచి సానుకూల స్పందన లభిస్తుంది. తండ్రి వైపు నుంచి సహాయ సహకారాలు లభిస్తాయి. తీర్థ యాత్రలు, విహార యాత్రలకు ప్లాన్ చేయడం జరుగుతుంది. వృత్తి, వ్యాపారాల్లో లాభాలు బాగా వృద్ధి చెందుతాయి.

మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2)

ఆర్థిక పరిస్థితికి ఇబ్బందేమీ ఉండదు. గతం కంటే కాస్తంత మెరుగ్గా ఉండే అవకాశం కూడా ఉంది. సాధారణంగా ఏ ప్రయత్నం చేపట్టినా సఫలం అవుతుంది. ఆర్థిక వ్యవహారాల్లో, ఇతరులతో కలిసి పని చేయడంలో ఓర్పు, సహనాలతో వ్యవహరించడం మంచిది. ఉద్యోగంలో జీతభత్యాలు పెరిగే అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాల్లో అనేక సమస్యలు తొలగిపోతాయి. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలలో ఆశించిన శుభవార్తలు వింటారు. కుటుంబంలో కొన్ని శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి.

కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)

ఉద్యోగంలో స్థిరత్వం ఏర్పడుతుంది. వృత్తి, వ్యాపారాలు నిలకడగా సాగిపోతాయి. గృహ, వాహన ప్రయత్నాలు సఫలం అయ్యే అవకాశం ఉంది. ఆస్తి సమస్యలు పరిష్కార దిశగా సాగుతాయి. కుటుంబంలో సుఖ సంతోషాలు నెలకొంటాయి. ప్రతి పనిలోనూ, ప్రతి వ్యవహారంలోనూ శ్రమ, తిప్పట అధికంగా ఉంటాయి. కొద్దిపాటి అనారోగ్య సమస్యలకు అవకాశం ఉంది. తొందరపాటు నిర్ణయాలు తీసుకోకపోవడం మంచిది. ఆదాయ ప్రయత్నాలు అనుకూల ఫలితాలను ఇస్తాయి.

మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)

ఉద్యోగంలో పని ఒత్తిడి దాదాపు పూర్తిగా తగ్గుతుంది. అధికారులతో అనుకూలతలు పెరుగు తాయి. వృత్తి, వ్యాపారాల్లో కొద్ది శ్రమతో అధిక లాభాలు సంపాదిస్తారు. ఎటువంటి ప్రయత్నం తల పెట్టినా సంతృప్తికరంగా నెరవేరుతుంది. ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. ఉద్యోగులకు, నిరు ద్యోగులకు విదేశాల నుంచి కూడా ఆఫర్లు అందుతాయి. ఆరోగ్యం విషయంలో శ్రద్ధ పెట్టడం మంచిది. జీవిత భాగస్వామితో వాగ్వాదాలకు దిగకపోవడం మంచిది. పిల్లలు వృద్ధిలోకి వస్తారు.