Horoscope Today: వారికి వ్యక్తిగత సమస్యలు పరిష్కారం.. 12 రాశుల వారికి శుక్రవారంనాటి రాశిఫలాలు
దిన ఫలాలు (ఆగస్టు 30, 2024): మేష రాశి వారికి ఈ రోజు ఆర్థికంగా సానుకూల పరిస్థితులుంటాయి. ఆరోగ్యం అనుకూలంగానే ఉంటుంది. వృషభ రాశి వారికి ఇంటా బయటా ఊహించని సమస్యలు తలెత్తుతాయి. రావలసిన డబ్బు అందక ఇబ్బంది పడతారు. మిథున రాశికి చెందిన నిరుద్యోగులకు నూతన ఉద్యోగ ప్రాప్తికి అవకాశం ఉంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి శుక్రవారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..
దిన ఫలాలు (ఆగస్టు 30, 2024): మేష రాశి వారికి ఈ రోజు ఆర్థికంగా సానుకూల పరిస్థితులుంటాయి. ఆరోగ్యం అనుకూలంగానే ఉంటుంది. వృషభ రాశి వారికి ఇంటా బయటా ఊహించని సమస్యలు తలెత్తుతాయి. రావలసిన డబ్బు అందక ఇబ్బంది పడతారు. మిథున రాశికి చెందిన నిరుద్యోగులకు నూతన ఉద్యోగ ప్రాప్తికి అవకాశం ఉంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి శుక్రవారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..
మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)
ఆధ్యాత్మిక సేవా కార్యాక్రమాల్లో ఎక్కువగా పాల్గొంటారు. వృత్తి, వ్యాపారాలు లాభాల బాటలో నడుస్తాయి. ఇంటా బయటా అనుకూలతలు పెరుగుతాయి. ప్రముఖులతో స్నేహ సంబంధాలు ఏర్పడతాయి. ఉద్యోగాలలో ఇతరులతో సమస్యలను తెలివిగా పరిష్కరించుకుంటారు. ఆర్థికంగా సానుకూల పరిస్థితులుంటాయి. కొందరు మిత్రులు మిమ్మల్ని అవసరానికి ఉపయోగించుకుంటారు. ముఖ్యమైన సొంత పనుల మీద దృష్టి పెట్టడం మంచిది. ఆరోగ్యం అనుకూలంగానే ఉంటుంది.
వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)
ఇంటా బయటా ఊహించని సమస్యలు తలెత్తుతాయి. రావలసిన డబ్బు అందక ఇబ్బంది పడతారు. వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. ఆదాయానికి మించి ఖర్చులుంటాయి. ప్రయాణాలు ఆశించిన విధంగా సాగిపోతాయి. ఉద్యోగాల్లో అధికారుల నుంచి కాస్తంత ఒత్తిడి ఉంటుంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఆదాయ మార్గాలు నిలకడగా కొనసాగుతాయి. చేప ట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి. నిరుద్యోగులకు మంచి ఆఫర్ అందే అవకాశం ఉంది.
మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)
ఇంటా బయటా గౌరవ మర్యాదలు పెరుగుతాయి. సోదరులతో ఆస్తి వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. పాత మిత్రుల కలయిక ఆనందం కలిగిస్తుంది. నిరుద్యోగులకు నూతన ఉద్యోగ ప్రాప్తికి అవకాశం ఉంది. కొందరు దగ్గర బంధువుల నుంచి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. వ్యాపార, ఉద్యోగాలు సజావుగా సాగిపోతాయి. పెళ్లి ప్రయత్నాల విషయంలో మిత్రుల నుంచి శుభవార్త అందుతుంది. ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండడం మంచిది. ఆర్థిక లావాదేవీలు పెట్టుకోవద్దు.
కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)
ముఖ్యమైన వ్యవహారాల్లో సరైన నిర్ణయాలు తీసుకుంటారు. కుటుంబ సభ్యుల మీద ఖర్చులు పెరుగుతాయి. జీవిత భాగస్వామితో ఆలయ దర్శనాలు చేసుకుంటారు. చేపట్టిన పనులన్నీ సునా యాసంగా పూర్తవుతాయి. ధనపరంగా కొన్ని ఒడిదుడుకుల నుంచి బయటపడతారు. వ్యాపా రాలు బిజీగా సాగుతాయి. ఉద్యోగంలో అదనపు బాధ్యతలు స్వీకరించాల్సి వస్తుంది. రావలసిన డబ్బును అతి కష్టం మీద వసూలు చేసుకుంటారు. శరీరానికి విశ్రాంతి అవసరమని గ్రహించండి.
సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)
ముఖ్యమైన పనుల్లో శ్రమకు తగ్గ ఫలితం ఉంటుంది. వ్యాపార వ్యవహారాల్లో వ్యయ ప్రయాసలుం టాయి. ఆర్థిక ఇబ్బందుల బాధ చాలావరకు తగ్గుతుంది. బంధువులతో వివాదాలు, విభేదాలు పరిష్కారం అవుతాయి. ఆరోగ్యం నిలకడగా సాగిపోతుంది. వృత్తి, ఉద్యోగాల్లో అదనపు పని భారం ఉంటుంది. కుటుంబ జీవితం చాలావరకు ఉత్సాహంగా సాగిపోతుంది. కొద్ది ప్రయత్నంతో ముఖ్య మైన వ్యవహారాలు పూర్తి అవుతాయి. రావలసిన డబ్బు, మొండి బాకీలు వసూలు అవుతాయి.
కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)
ఆధ్యాత్మిక విషయాల మీద శ్రద్ధాసక్తులు పెరుగుతాయి. మిత్రుల నుంచి అవసరానికి తగ్గ సహాయ సహకారాలు లభిస్తాయి. నిరుద్యోగుల ప్రయత్నాలు అనుకూలిస్తాయి. చేపట్టిన ప్రతి పని సంతృప్తికరంగా పూర్తవుతుంది. పిల్లల నుంచి శుభవార్తలు అందుతాయి. ఉద్యోగంలో సానుకూల మార్పులు చోటు చేసుకుంటాయి. వృత్తి, వ్యాపారాలు నల్లేరు మీద బండిలా సాగిపోతాయి. కొద్ది ప్రయత్నంతో ఒకటి రెండు వ్యక్తిగత సమస్యలు పరిష్కారం అవుతాయి. ఆరోగ్యం బాగానే ఉంటుంది.
తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)
కుటుంబంలో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. వృత్తి, వ్యాపారాలను విస్తరించే అవకాశం ఉంది. కుటుంబ సభ్యులతో ఆలయ దర్శనాలు చేసుకుంటారు. మిత్రులకు సహాయంగా ఉంటారు. ఇంటా బయటా అనుకూల వాతావరణం ఉంటుంది. ఉద్యోగంలో నూతన ప్రోత్సాహకాలు అందు కుంటారు. అనుకున్న వ్యవహారాలు అనుకున్నట్టు పూర్తవుతాయి. కొత్త పరిచయాలు కలుగు తాయి. చదువుల్లో పిల్లలు ఆశించిన పురోగతి సాధిస్తారు. ఆశించిన శుభవార్తలు వినే అవకాశం ఉంది.
వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట)
బంధుమిత్రులతో సఖ్యత, సాన్నిహిత్యం పెరుగుతాయి. దైవ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. వ్యాపారాల్లో తొందరపాటు నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. ముఖ్యమైన పనుల్లో శ్రమ, తిప్పట ఉంటాయి. ఆకస్మిక ప్రయాణ సూచనలున్నాయి. ఉద్యోగాల్లో అధికారుల అంచనాలను అందుకుంటారు. ధనపరమైన చిక్కులు, సమస్యలు చాలావరకు తగ్గిపోతాయి. వృత్తి జీవితం అనుకూలంగా సాగిపోతుంది. ఆదాయానికి లోటుండదు. ఆహార, విహారాల్లో జాగ్రత్తగా ఉండడం మంచిది.
ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)
ఆర్థిక వ్యవహారాలను సమర్థవంతంగా చక్కబెడతారు. కొందరు బంధువుల నుంచి ఒత్తిడి ఎక్కు వగా ఉంటుంది. ముఖ్యమైన వ్యవహారాల్లో అవరోధాలు తొలగిపోతాయి. పిల్లల ఆరోగ్యాలు, చదు వుల మీద శ్రద్ధ పెట్టడం మంచిది. ఆర్థిక లావాదేవీలు ఆశించిన ఫలితాలనిస్తాయి. వ్యాపారాలు సాదా సీదాగా సాగిపోతాయి. ఉద్యోగాలు ఆశాజనకంగా, ప్రోత్సాహకరంగా సాగుతాయి. ఆర్థిక పరి స్థితి చాలావరకు అనుకూలంగా ఉంటుంది. కుటుంబ సభ్యులతో సరదాగా కాలక్షేపం చేస్తారు.
మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2)
బంధుమిత్రుల నుంచి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. నూతన వాహన యోగం ఉంది. వృత్తి, వ్యాపారాల్లో కీలక నిర్ణయాలు అమలు చేస్తారు. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా, సంతృప్తిక రంగా ఉంటుంది. నూతన వ్యక్తుల పరిచయాలు ఆనందం కలిగిస్తాయి. ఇంటా బయటా పరిస్థి తులు బాగా అనుకూలంగా ఉంటాయి. ఉద్యోగంలో ఆదరాభిమానాలు పెరుగుతాయి. కొందరు మిత్రుల సహాయంతో వ్యక్తిగత సమస్యలు పరిష్కరించుకుంటారు. ఆరోగ్యం నిలకడగా సాగుతుంది.
కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)
ముఖ్యమైన పనులు, వ్యవహారాల్లో శ్రమాధిక్యత ఉంటుంది. వృత్తి, వ్యాపారాలు ముందుకు సాగక నిరాశ కలిగిస్తాయి. ఉద్యోగంలో అదనపు పని భారం వల్ల మానసిక ఒత్తిడి పెరుగుతుంది. చేపట్టిన ప్రయత్నాలు నిదానంగా సాగుతాయి. కుటుంబ సభ్యుల సహాయ సహకారాలుంటాయి. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలకు సానుకూల స్పందన లభిస్తుంది. కుటుంబ జీవితంలో అన్యోన్యత, సామరస్యం పెరుగుతాయి. ఆర్థిక లావాదేవీలు పెట్టుకోవద్దు. ధనపరంగా ఎవరికీ ఎటువంటి హామీలూ ఉండవద్దు.
మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)
ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి. ఇష్టమైన మిత్రులను కలుసుకుని ఎంజాయ్ చేస్తారు. గృహ నిర్మాణ పనులు వేగవంతం చేస్తారు. పెళ్లి ప్రయత్నాల విషయంలో సన్నిహితుల నుంచి శుభ వార్తలు అందుతాయి. వృత్తి, వ్యాపారాల్లో అభివృద్ధి కనిపిస్తుంది. ఉద్యోగంలో పదోన్నతులకు అవకాశం ఉంది. అదనపు ఆదాయ ప్రయత్నాలు లాభసాటిగా సాగిపోతాయి. ముఖ్యమైన వ్యక్తి గత సమస్యలు ఒక కొలిక్కి వస్తాయి. కుటుంబ జీవితం ఉత్సాహంగా, ఉల్లాసంగా సాగిపోతుంది.