Horoscope Today: ఆ రాశుల వారు జాగ్రత్తగా అడుగేయాలి.. సోమవారం రాశిఫలాలు ఇలా..
Today Rasi Phalalu: మనం పలు సందర్భాల్లో ముందువెనుక ఆలోచించకుండా తీసుకునే నిర్ణయాలతో ఊహించనిరీతిలో జీవితం ప్రమాదంలో పడుతుంది. కావున తీసుకునే ప్రతి నిర్ణయంలోనూ, చేపట్టే ప్రతీ కార్యంలోనూ ఆచితూచి,
Today Rasi Phalalu: మనం పలు సందర్భాల్లో ముందువెనుక ఆలోచించకుండా తీసుకునే నిర్ణయాలతో ఊహించనిరీతిలో జీవితం ప్రమాదంలో పడుతుంది. కావున తీసుకునే ప్రతి నిర్ణయంలోనూ, చేపట్టే ప్రతీ కార్యంలోనూ ఆచితూచి, సమయానుకూలంగా అడుగులు వేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అయితే… సోమవారం ముఖ్యంగా పలు రాశుల వారికి పరిస్థితులు అనుకూలంగా ఉంటే.. మరికొన్ని రాశుల వారికి అనుకూలంగా లేవు. ఈ రోజు రాశిఫలాలు ఓ సారి చూద్దాం..
మేష రాశి: ఈ రాశివారికి శ్రమతో కూడిన పనులు నెరవేరుతాయి. ఈ రోజు ఒక ముఖ్యమైన సమస్యకు పరిష్కారం లభించే సూచనలు కనిపిస్తున్నాయి.
వృషభం: ఈ రాశి వారు చేసిన పనికి ప్రశంసలు లభించడంతోపాటు గౌరవమర్యాలు పెరుగుతాయి. నూతన వస్తువులను కొనుగోలు చేసే అవకాశముంది. బంధువులత, స్నేహితులతో ఆనందంగా గడుపుతూ విందు వినోదాల్లో పాల్గొంటుంటారు.
విథున రాశి: ఈ రోజు ఈ రాశి వారు పలు రంగాల్లో శుభఫలితాలను అందుకుంటారు. ఆనందకరమైన కాలాన్ని గడుపేందుకు.. బంధుమిత్రులను కలుస్తారు.
కార్కాటక రాశి: ఈ రోజు ఈ రాశి వారికి అందిన ఒక శుభవార్త ఇంట్లో సంతోషాన్ని రెట్టింపు చేస్తుంది. ఒక ముఖ్య వ్యవహరంలో బంధువులు, స్నేహితుల సాయం అందుతుంది. అనుకున్న పనులు నెమ్మదిస్తాయి.
సింహ రాశి: ఈ రాశి వారు వృత్తి ఉద్యోగ వ్యాపారాది రంగాల్లో పలు అభివృద్ధికి సంబంధించిన శుభవార్తలు వింటారు. మీచుట్టూ సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది. కుటుంబ సౌఖ్యం కలదు. పలు సందర్భాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి.
కన్య రాశి: ఆ రాశి వారికి కుటుంబ సభ్యుల నుంచి సంపూర్ణ సహకారం లభిస్తుంది. అవసరానికి ఆర్థిక సహకారం కొంచెం కష్టంగా అందుతుంది.
తులా రాశి: ఈ రాశి వారు చేపట్టిన పనుల్లో కొన్ని ఆటంకాలు ఎదురైనా అధిగమించేందుకు పలువురి సహకారం తీసుకుంటారు. మానసికంగా దృఢంగా ఉంటే.. పలు సమస్యల నుంచి గట్టెక్కవచ్చు.
వృశ్చిక రాశి: ఈ రాశి వారికి కార్యక్రమాలన్నీ సజావుగా పూర్తవుతాయి. బంధు మిత్రుల నుంచి ఆర్థిక సహకారం లభిస్తుంది. తోటివారితో జాగ్రత్తగా వ్యవహరించాలి.
ధనస్సు రాశి: ఈ రాశి వారు చేపట్టిన పనులను ప్రణాళికాబద్ధంగా పూర్తిచేయగలుగుతారు. ఇష్టమైన వారితో కాలాన్ని గడుపేందుకు ప్రయత్నిస్తారు.
మకర రాశి: ఈ రాశి వారు చేపడుతున్న కార్యక్రమాల్లో విశ్వాసం ఉండేలా చూసుకోవాలి. ముఖ్య విషయాల్లో కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది. కొన్ని సంఘటనల్లో జాగ్రత్తగా ఆచితూచి అడుగేయాలి.
కుంభ రాశి: ఈ రాశివారు లక్ష్యాన్ని చేరుకునేందుకు బలమైన నమ్మకంతో ముందుకు సాగాలి. బయట వారితో జగ్రత్తగా ఉండాలి.
మీన రాశి: ఈ రాశి వారు పలు రంగాల్లో చేపట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి. వ్యాపారంలో లాభ సూచనలు కనిపిస్తున్నాయి. బయట వాతావరణం అనుకూలంగా ఉంటుంది.
Also Read: