Horoscope Today: ఈ రాశివారికి అనవసరమైన ఖర్చులు పెరుగుతాయి.. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు

Horoscope Today: జీవితంలో కొన్ని సందర్భాల్లో మనం ముందువెనుక ఆలోచించకుండా తీసుకునే నిర్ణయాలతో జీవితం ఎంతో ప్రమాదంలో పడిపోతుంది. అందుకే ఏ..

Horoscope Today: ఈ రాశివారికి అనవసరమైన ఖర్చులు పెరుగుతాయి..  ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు
Follow us
Subhash Goud

|

Updated on: Oct 06, 2021 | 6:41 AM

Horoscope Today: జీవితంలో కొన్ని సందర్భాల్లో మనం ముందువెనుక ఆలోచించకుండా తీసుకునే నిర్ణయాలతో జీవితం ఎంతో ప్రమాదంలో పడిపోతుంది. అందుకే ఏదైనా నిర్ణయాలు తీసుకునే ముందు బాగా ఆలోచించి ఆతీసుకోవడం మంచిది. చేపట్టే ప్రతీ కార్యంలోనూ ఆచితూచి, సమయానుకూలంగా అడుగులు వేయాలి. అందుకే తమ భవిష్యత్తు గురించి తెలుసుకునేందుకు చాలామంది ఆసక్తి చూపిస్తుంటారు. తమ జీవితంలో ఏం జరుగబోతుందో ముందుగానే తెలుసుకునేందుకు రాశి ఫలాలను అనుసరిస్తారు. అయితే.. ముఖ్యంగా కొన్ని రాశుల వారికి పరిస్థితులు అనుకూలంగా ఉంటే.. మరికొన్ని రాశుల వారికి అనుకూలంగా లేవు. ఈ రోజు (అక్టోబర్‌ 6) పలు రాశుల వారికి ఏ విధంగా ఉందో తెలుసుకుందాం.

మేష రాశి:

కుటుంబ సభ్యుల సహకారం అందుకుంటారు. ఓ వ్యవహారంలో ఊహించని ఫలితాలు అందుకుంటారు. ఉద్యోగాల్లో మంచి ఫలితాలు ఉంటాయి. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు వహించాలి.

వృషభ రాశి:

అనవసరమైన ఖర్చులు పెరుగుతాయి. వ్యాపారాలలో సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. బంధుమిత్రుల నుంచి మంచి సలహాలు అందుకుంటారు.

మిథున రాశి:

బంధుమిత్రుల నుంచి మంచి మంచి వార్తలు ఉంటాయి. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు వహించాలి. ఉద్యోగులకు మంచి అవకాశాలు లభిస్తాయి. వ్యాపారాలు సానుకూలంగా ఉంటాయి.

కర్కాటక రాశి:

ఈ రాశివారు ఈ రోజు ఓ మంచి వార్త వింటారు. కొత్త కొత్త వ్యాపారాలు ప్రారంభించడానికి సిద్ధమవుతుంటారు. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది.

సింహ రాశి:

కొత్త ఆలోచనలు పుట్టుకొస్తాయి. సమాజంలో గౌరవం పెరుగుతుంది. బంధుమిత్రుల నుంచి మంచి వార్తలు వింటారు. పెద్ద ఆశీస్సులు తప్పనిసరి. నిరుద్యోగులకు శుభవార్త ఉంటుంది.

కన్య రాశి:

వ్యాపారులకు మంచి అవకాశాలు లభిస్తాయి. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు వహించాలి. ఆర్థికంగా ముందుకు సాగుతారు. ధన లాభం కలుగుతుంది.

తులరాశి:

మీమీ రంగాలలో మిశ్రమ ఫలితాలు ఉంటాయి. చేపట్టిన పనులను పూర్తి చేయడంలో ఇబ్బందులు ఎదురైనా పూర్తి చేసే ప్రయత్నాలు చేస్తారు.

వృశ్చిక రాశి:

నలుగురిలో మంచి పేరు సంపాదిస్తారు. కుటుంబ సభ్యుల సలహాలు సూచనలు అవసరం. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు అవసరం.

ధనుస్సు రాశి:

ఈ రాశివారు కొన్ని ఇబ్బందులకు గురయ్యే అవకాశం ఉంది. అధికంగా శ్రమించాల్సి ఉంటుంది. కొన్ని వ్యవహారాలలో ఇబ్బందులు తప్పవు.

మకర రాశి:

ఈ రాశివారికి ఇతరుల నుంచి ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. బంధుమిత్రుల నుంచి మాట పట్టింపులు ఎదురవుతాయి. కీలక వ్యవహారాలలో జాగ్రత్తగా వహించాలి.

కుంభ రాశి:

బంధుమిత్రులతో సుఖ సంతోషాలతో గడుపుతారు. కీలక సమస్యలను పరిష్కరించుకుంటారు. ఆర్థికంగా ముందుకు సాగుతారు. మానసికంగా ప్రశాంతత పొందడం అవసరం.

మీన రాశి:

నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. కీలక సమస్యలను పరిష్కరించుకుంటారు. ఉద్యోగులకు కీలక పదవులు దక్కే అవకాశం ఉంది.