Horoscope Today: వారికి ఉద్యోగంలో హోదా పెరుగుతుంది.. 12 రాశుల వారికి బుధవారంనాటి రాశిఫలాలు
దిన ఫలాలు (జూన్ 26, 2024): మేష రాశి వారి ఆర్థిక పరిస్థితి బాగా మెరుగ్గా ఉంటుంది. ఆర్థిక సమస్యలు చాలావరకు తగ్గుముఖం పడతాయి. వృషభ రాశి వారికి ఆదాయ వృద్ధికి అవకాశం ఉంది. పొదుపు పాటించి జాగ్రత్త పడతారు. మిథున రాశి వారికి అదనపు ఆదాయ మార్గాలు విస్తరిస్తాయి. మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి బుధవారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..
దిన ఫలాలు (జూన్ 26, 2024): మేష రాశి వారి ఆర్థిక పరిస్థితి బాగా మెరుగ్గా ఉంటుంది. ఆర్థిక సమస్యలు చాలావరకు తగ్గుముఖం పడతాయి. వృషభ రాశి వారికి ఆదాయ వృద్ధికి అవకాశం ఉంది. పొదుపు పాటించి జాగ్రత్త పడతారు. మిథున రాశి వారికి అదనపు ఆదాయ మార్గాలు విస్తరిస్తాయి. మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి బుధవారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..
మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)
ఆర్థిక పరిస్థితి బాగా మెరుగ్గా ఉంటుంది. ఆర్థిక సమస్యలు చాలావరకు తగ్గుముఖం పడతాయి. వృథా ఖర్చులు తగ్గించుకోవడం మంచిది. వృత్తి, ఉద్యోగాల్లో ప్రతిభ పాటవాలకు ఆశించిన గుర్తింపు లభిస్తుంది. వ్యాపారాలు లాభసాటిగా సాగిపోతాయి. సొంత పనుల మీద శ్రద్ద పెట్డం మంచిది. ప్రయాణాల్లో అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. ముఖ్యమైన వ్యవహారాలన్నీ మిత్రుల సహాయంతో స్వల్ప అనారోగ్యానికి అవకాశం ఉంది. నిరుద్యోగులు శుభవార్తలు వింటారు.
వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)
ఆదాయ వృద్ధికి అవకాశం ఉంది. పొదుపు పాటించి జాగ్రత్త పడతారు. వాహన యోగం పడుతుంది. ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. ఆర్థిక పరిస్థితి ఇతరులకు సహాయం చేసే స్థితిలో ఉంటుంది. ఇష్టమైన బంధుమిత్రులతో సరదాగా కాలక్షేపం చేస్తారు. ఉద్యోగంలో సహోద్యోగులతో మాట పట్టిం పులు తలెత్తుతాయి. వృత్తి జీవితంలో శ్రమాధిక్యతతో పాటు రాబడి కూడా బాగా పెరుగుతుంది. కుటుంబ జీవితం అనుకూలంగా సాగిపోతుంది. పిల్లలు చదువుల్లో ఘన విజయాలు సాధిస్తారు.
మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)
అదనపు ఆదాయ మార్గాలు విస్తరిస్తాయి. మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. అనవసర ఖర్చుల్ని తగ్గించుకోవడం మంచిది. ఆస్తి వివాదం ఒకటి అనుకూలంగా మారుతుంది. ముఖ్య మైన వ్యవహారాలను పట్టుదలగా పూర్తి చేసి ఆర్థికంగా లాభం పొందుతారు. జీవిత భాగస్వామితో కలిసి వస్త్రాభరణాలను కొనుగోలు చేస్తారు. వృత్తి, వ్యాపారాల్లో లాభసాటిగా సాగిపోతాయి. బంధువుల నుంచి శుభ వార్తలు వింటారు. ఉద్యోగంలో హోదా పెరగడానికి అవకాశం ఉంది. ఆరోగ్యం పరవాలేదు.
కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)
కొందరు మిత్రుల వల్ల ఆర్థికంగా నష్టపోయే అవకాశం ఉంది. ఎవరినీ గుడ్డిగా నమ్మకపోవడం మంచిది. ఆర్థిక వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరించడం ఉండడం మంచిది. వృత్తి, ఉద్యోగాల్లో ఆదరణ పెరుగుతుంది. వ్యాపారాల్లో లాభాలు అంచనాలను మించుతాయి. కుటుంబ సభ్యుల నుంచి ఒత్తిడి ఉంటుంది. ఆర్థిక లావాదేవీలకు దూరంగా ఉండడం మంచిది. అదనపు ఆదాయ మార్గాలు సత్ఫలితాలనిస్తాయి. ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి. పిల్లలు బాగా వృద్ధిలోకి వస్తారు.
సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)
పలుకుబడి కలిగిన వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి. పెళ్లి ప్రయత్నం విషయంలో బంధు వుల నుంచి సహకారం లభిస్తుంది. జీవిత భాగస్వామితో అన్యోన్యత పెరుగుతుంది. నిరుద్యోగు లకు ఆశించిన ఆఫర్ అందుతుంది. ఇష్టమైన మిత్రులతో విందు వినోదాల్లో పాల్గొంటారు. కుటుంబ సభ్యులతో కలిసి పుణ్య క్షేత్రాన్ని సందర్శిస్తారు. ఆరోగ్యానికి ఇబ్బందేమీ ఉండదు. ఆర్థిక పరిస్థితి బాగా అనుకూలంగా ఉంటుంది. వృత్తి, ఉద్యోగాలతో పాటు వ్యాపారాల్లో కూడా శుభవార్తలు వింటారు.
కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)
ఆహార, విహారాల్లో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ప్రయాణాలు ఆశించిన స్థాయిలో లాభి స్తాయి. ముఖ్యమైన వ్యవహారాలను గట్టి ప్రయత్నంతో పూర్తి చేస్తారు. బంధువుల విషయాల్లో జోక్యం చేసుకోకపోవడం మంచిది. ఆర్థిక వ్యవహారాలు చాలావరకు విజయవంతం అవుతాయి. వృత్తి, వ్యాపారాల్లో లాభాలు బాగా పెరుగుతాయి. ఉద్యోగంలో అధికారుల నుంచి ప్రోత్సాహకాలు అందుకుంటారు. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది. ప్రస్తుతానికి ఎవరికీ ఎక్కడా హామీలు ఉండవద్దు.
తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)
శుభ గ్రహాల అనుకూలతలు బాగా ఎక్కువగానే ఉన్నాయి. ఏ ప్రయత్నం తలపెట్టినా సఫలం అయ్యే అవకాశం ఉంది. అదనపు ఆదాయ ప్రయత్నాలన్నీ సత్ఫలితాలనిస్తాయి. ఆదాయం బాగా పెరుగుతుంది. అనవసర ఖర్చుల్ని తగ్గించుకుంటారు. ఆరోగ్యం బాగా కుదుటపడుతుంది. ఉద్యో గంలో మాటకు, చేతకు తిరుగుండదు. హోదా పెరగడానికి అవకాశముంది. శత్రువులు మిత్రు లుగా మారే సూచనలున్నాయి. వృత్తి, వ్యాపారాలు లాభాలు పండిస్తాయి. ఆర్థిక సమస్యలు తగ్గు తాయి.
వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట)
రోజంతా అనుకూలంగా గడిచిపోతుంది. తక్కువ శ్రమతో ఎక్కువ లాభం పొందుతారు. ఆర్థిక వ్యవ హారాల్లో ఆచితూచి వ్యవహరించడం మంచిది. ఆదాయ వృద్ధికి అవకాశం ఉంది. ఖర్చుల్ని తగ్గిం చుకునే ప్రయత్నం చేస్తారు. వృత్తి, ఉద్యోగాల్లో ప్రాధాన్యం పెరుగుతుంది. వ్యాపారాలు అభి వృద్ధి బాట పడతాయి. ఇతరులకు ఉపయోగపడే పనులు చేస్తారు. కొందరు బంధుమిత్రులతో శుభ కార్యంలో పాల్గొంటారు. కుటుంబ జీవితంలో సుఖ సంతోషాలకు లోటుండదు. ఆరోగ్యం బాగానే ఉంటుంది.
ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)
మంచి పరిచయాలు ఏర్పడతాయి. రోజంతా ఉత్సాహంగా గడిచిపోతుంది. ఆదాయ వృద్ధికి అవ కాశం ఉంది. వృత్తి, వ్యాపారాల్లో రాబడికి లోటుండదు. ఉద్యోగంలో అనుకూలతలు పెరుగు తాయి. ఆరోగ్యం సజావుగా సాగిపోతుంది. పిల్లల నుంచి ఆశించిన శుభవార్తలు వింటారు. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలకు సానుకూల స్పందన లభించే అవకాశం ఉంది. ఆకస్మిక ధన ప్రాప్తికి కూడా అవకాశం ఉంది. కుటుంబ జీవితం ప్రశాంతంగా, సామరస్యంగా సాగిపోతుంది. ఎవరికీ హామీలు ఉండవద్దు.
మకరం (ఉత్తరాషాఢ, శ్రవణం, ధనిష్ట 1,2)
కుటుంబ సభ్యులతో మాట పట్టింపులు రాకుండా చూసుకోవాలి. ఆస్తి వివాదం ఒకటి పరిష్కార దిశగా సాగుతుంది. ఉద్యోగపరంగా ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. కొందరు మిత్రుల తోడ్పాటుతో ముఖ్యమైన వ్యవహారాలు పూర్తి అవుతాయి. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి కానీ, వ్యయ ప్రయాసలు తప్పకపోవచ్చు. ఒకటి రెండు వ్యక్తిగత సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. వృత్తి, వ్యాపారాలు బాగా బిజీ అవుతాయి. అనవసర ఖర్చులతో ఇబ్బంది పడతారు.
కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)
ఆర్థిక పరిస్థితి పరవాలేదనిపిస్తుంది. అదనపు ఆదాయ ప్రయత్నాలు నిదానంగా సాగిపోతాయి. ఇష్టమైన బంధుమిత్రులతో ఆలయాలు సందర్శిస్తారు. ఉన్నత స్థాయి వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి. వృత్తి, ఉద్యోగాల్లో అధికారులకు మీ పనితీరు బాగా నచ్చుతుంది. కుటుంబ అవస రాల మీద ఖర్చులు పెరుగుతాయి. కొందరు మిత్రులతో విహార యాత్ర చేసే అవకాశం ఉంది. వ్యాపారాలు నిలకడగా సాగిపోతాయి. ఆరోగ్యం విషయంలో కాస్తంత జాగ్రత్తగా ఉండడం మంచిది.
మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)
తల్లితండ్రుల నుంచి ఆశించిన సహాయ సహకారాలు అందుతాయి. రావలసిన డబ్బు చేతికి అందుతుంది. వృత్తి, వ్యాపారాల్లో కార్యకలాపాలు బాగా పెరుగుతాయి. ఉద్యోగంలో బాధ్యతల మార్పు ఉండే అవకాశం ఉంది. అధికారుల నుంచి ప్రోత్సాహకాలు అందుతాయి. ఆరోగ్యం నిల కడగా ఉంటుంది. నిరుద్యోగుల ప్రయత్నాలకు సానుకూల స్పందన లభిస్తుంది. విదేశాల్లో ఉన్న పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. కుటుంబ జీవితం హ్యాపీగా సాగిపోతుంది. ఆరోగ్యం పరవాలేదు.