Shukraditya Yoga: శుక్ర, రవుల కలయిక.. ఆ రాశుల వారికి అధికార, ఆర్థిక యోగాలు..!

ఈ నెల 29న బుధుడు మిథున రాశి నుంచి నిష్క్రమించడంతో ఆ రాశిలో శుక్ర, రవులు మాత్రమే కలిసి ఉండే అవకాశం ఉంది. ఈ రెండు గ్రహాలు ఈ రాశిలో జూలై 6వ తేదీ వరకు కలిసి ఉంటాయి. ఈ రెండు గ్రహాలు రాజకీయ, ప్రభుత్వ సంబంధమైన గ్రహాలే అయినందువల్ల వీటి కలయిక వల్ల రాజకీయ ప్రయోజనాలు, ప్రభుత్వ సంబంధమైన లాభాలు ఎక్కువగా ఉంటాయి.

Shukraditya Yoga: శుక్ర, రవుల కలయిక.. ఆ రాశుల వారికి అధికార, ఆర్థిక యోగాలు..!
Shukraditya Yoga
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By: Janardhan Veluru

Updated on: Jun 25, 2024 | 7:21 PM

ఈ నెల 29న బుధుడు మిథున రాశి నుంచి నిష్క్రమించడంతో ఆ రాశిలో శుక్ర, రవులు మాత్రమే కలిసి ఉండే అవకాశం ఉంది. ఈ రెండు గ్రహాలు ఈ రాశిలో జూలై 6వ తేదీ వరకు కలిసి ఉంటాయి. ఈ రెండు గ్రహాలు రాజకీయ, ప్రభుత్వ సంబంధమైన గ్రహాలే అయినందువల్ల వీటి కలయిక వల్ల రాజకీయ ప్రయోజనాలు, ప్రభుత్వ సంబంధమైన లాభాలు ఎక్కువగా ఉంటాయి. వృషభం, మిథునం, సింహం, కన్య, తుల, కుంభ రాశుల వారికి అధికార యోగం, ఆర్థిక యోగం పట్టే అవకాశం ఎక్కువగా ఉంది.

  1. వృషభం: రాశ్యధిపతి శుక్రుడితో రవి కలసినందువల్ల ప్రభుత్వపరంగా లాభం కలగడం గానీ, గుర్తింపు లభిం చడం గానీ జరుగుతుంది. ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నవారికి శుభవార్తలు అందు తాయి. ఆదాయం వృద్ధి చెంది ఆర్థిక స్థిరత్వం లభిస్తుంది. రాజకీయ ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. ఇప్పటికే రాజకీయాల్లో ఉన్నవారికి అధికార యోగం పట్టే అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాలు విస్తరిస్తాయి. ఉద్యోగంలో ప్రాధాన్యం పెరుగుతుంది. మాటకు విలువ ఏర్పడుతుంది.
  2. మిథునం: ఈ రాశిలో శుక్ర, రవుల కలయిక జరిగినందువల్ల సర్వత్రా గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ప్రభుత్వ మూలక ధన లాభానికి అవకాశం ఉంటుంది. ఆస్తి వివాదం ఒకటి అనుకూలంగా పరి ష్కారం అయి సంపద పెరుగుతుంది. సమాజంలో కీర్తి ప్రతిష్ఠలు పెరుగుతాయి. పలుకుబడి కలి గిన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. పిల్లలకు కూడా శుభ యోగాలు పడతాయి. ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్నవారు ఇంటర్వ్యూలు, పోటీ పరీక్షల్లో విజయాలు సాధిస్తారు.
  3. సింహం: ఈ రాశ్యధిపతి అయిన రవి లాభ స్థానంలో శుక్రుడి వంటి శుభ గ్రహంతో కలసి ఉండడం వల్ల ప్రతిభా పాటవాలకు మంచి గుర్తింపు లభిస్తుంది. ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉన్నవారికి పదోన్నతులు లభిస్తాయి. ఏ రంగానికి చెందిన వారైనా అనుకూలతలు పెరుగుతాయి. రాజకీయాల్లో ఉన్నవారికి పురోగతి చెందుతారు. అనేక అవకాశాలు అంది వస్తాయి. ఈ శుక్ర, రవుల కలయిక లాభస్థానంలో చోటు చేసుకున్నందువల్ల రాజకీయ పరిచయాలు విస్తరిస్తాయి. ఆదాయ వృద్ధికి అవకాశముంది.
  4. కన్య: ఈ రాశికి దశమ స్థానంలో ఈ శుక్ర రవులు కలసినందువల్ల వృత్తి, ఉద్యోగాల్లోనే కాకుండా సామా జికంగా కూడా గౌరవ మర్యాదలు, పేరు ప్రఖ్యాతులు పెరుగుతాయి. రాజకీయ ప్రముఖులతో లేక ఉన్నతాధికారులతో లాభదాయక పరిచయాలు ఏర్పడతాయి. ప్రభుత్వపరంగా రావాల్సిన డబ్బు చేతికి అందుతుంది. ప్రభుత్వ మూలక ధన లాభం ఉంటుంది. రాజకీయాల్లో ఉన్నవారికి దశ తిరుగుతుంది. ఉద్యోగపరంగా విదేశాలు వెళ్లవలసి వస్తుంది. వృత్తి, వ్యాపారాలు వృద్ధి చెందుతాయి.
  5. తుల: ఈ రాశి అధిపతి అయిన శుక్రుడితో గ్రహ రాజు రవి కలిసినందువల్ల ఏ రంగంలో ఉన్నప్పటికీ పదో న్నతులు లభించడం, హోదాలు పెరగడం, ప్రాధాన్యం వృద్ధి చెందడం, జీతభత్యాలు అంచనాలను మించడం వంటివి తప్పకుండా చోటు చేసుకుంటాయి. ఆరోగ్యం బాగా మెరుగుపడుతుంది. ఉన్నత స్థాయి వ్యక్తులతో సంబంధాలు పెరుగుతాయి. ఆర్థిక ప్రయత్నాలన్నీ విజయవంతం అవుతాయి. సామాజికంగానే కాక, ఆర్థికంగా కూడా స్థాయి పెరుగుతుంది. వ్యక్తిగత సమస్యలు తగ్గిపోతాయి.
  6. కుంభం: ఈ రాశికి పంచమ స్థానంలో శుక్ర, రవుల యుతి జరిగినందువల్ల రాజకీయ ప్రాధాన్యం పెరగడం, రాజకీయ నాయకులకు సలహాదార్లుగా మారడం, ప్రభుత్వపరంగా గుర్తింపు లభించడం వంటివి జరుగుతాయి. ప్రభుత్వ ఉద్యోగాలకు పోటీ పరీక్షలు రాస్తున్నవారు, ఇంటర్వ్యూలకు హాజరవుతు న్నవారు తప్పకుండా ఘన విజయాలు సాధిస్తారు. ఏ రంగంలో ఉన్నప్పటికీ ప్రతిభా పాటవాలు వెలుగులోకి వచ్చి, ప్రత్యేకమైన గుర్తింపు లభిస్తుంది. ఆదాయ ప్రయత్నాలన్నీ విజయం సాధిస్తాయి.

టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?