Horoscope Today: వారు ఆర్థిక సమస్యల నుంచి బయటపడుతారు.. 12 రాశుల వారికి మంగళవారం రాశిఫలాలు

దిన ఫలాలు (జూన్ 25, 2024): మేష రాశివారికి ఈ రోజు ఆర్థిక విషయాల్లో సమయం చాలా అనుకూలంగా ఉంది. వృషభ రాశి వారు వృత్తి, ఉద్యోగాల్లో కాస్తంత పనిభారం ఉన్నప్పటికీ సానుకూల పరిస్థితులు నెలకొంటాయి. మిథున రాశి వారికి ఆదాయం మెరుగ్గా ఉంటుంది. ఆర్థిక ప్రయత్నాలు బాగా అనుకూలంగా ఉంటాయి. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి మంగళవారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..

Horoscope Today: వారు ఆర్థిక సమస్యల నుంచి బయటపడుతారు.. 12 రాశుల వారికి మంగళవారం రాశిఫలాలు
Horoscope Today 25th June 2024
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By: Janardhan Veluru

Updated on: Jun 25, 2024 | 5:01 AM

దిన ఫలాలు (జూన్ 25, 2024): మేష రాశివారికి ఈ రోజు ఆర్థిక విషయాల్లో సమయం చాలా అనుకూలంగా ఉంది. వృషభ రాశి వారు వృత్తి, ఉద్యోగాల్లో కాస్తంత పనిభారం ఉన్నప్పటికీ సానుకూల పరిస్థితులు నెలకొంటాయి. మిథున రాశి వారికి ఆదాయం మెరుగ్గా ఉంటుంది. ఆర్థిక ప్రయత్నాలు బాగా అనుకూలంగా ఉంటాయి. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి మంగళవారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..

మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)

ఈ రాశివారికి ఆర్థిక విషయాల్లో సమయం చాలా అనుకూలంగా ఉంది. ఏ ప్రయత్నం తలపెట్టినా సఫలం అవుతుంది. అదనపు ఆదాయ ప్రయత్నాలు సత్ఫలితాలనిస్తాయి. ఆరోగ్యం బాగా అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలు తప్పకుండా సఫలం అవుతాయి. కుటుంబ జీవితం సాఫీగా, హ్యాపీగా సాగిపోతుంది. ఉద్యోగంలో ప్రాధాన్యం బాగా పెరుగుతుంది. డాక్టర్లు, లాయర్లు తదితర వృత్తుల వారు బాగా బిజీ అయిపోతారు. వ్యాపారాల్లో లాభాలకు లోటుండదు.

వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)

వృత్తి, ఉద్యోగాల్లో కాస్తంత పనిభారం ఉన్నప్పటికీ సానుకూల పరిస్థితులు నెలకొంటాయి. వ్యాపారాలు నిలకడగా సాగిపోతాయి. కుటుంబ పరిస్థితులు చాలావరకు మెరుగ్గా ఉంటాయి. నిరుద్యోగులకు శుభవార్తలు వింటారు. ఆదాయానికి, ఆరోగ్యానికి లోటుండదు. కొందరు బంధువులతో వివాదాలు తొలగిపోతాయి. దూర ప్రాంతంలో ఉన్న పిల్లల నుంచి ఆశించిన సమాచారం అందుతుంది. పెళ్లి ప్రయత్నాల విషయంలో ఆశించిన శుభవార్తలు అందుతాయి. ఎవరికీ గుడ్డిగా నమ్మవద్దు.

మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)

ఆదాయం మెరుగ్గా ఉంటుంది. ఆర్థిక ప్రయత్నాలు బాగా అనుకూలంగా ఉంటాయి. వృత్తి, వ్యాపా రాల్లో రాబడి బాగా పెరుగుతుంది. మరింత మంచి ఉద్యోగంలోకి మారే ప్రయత్నాలు ఫలిస్తాయి. నిరుద్యోగులకు ఆశించిన ఆఫర్లు అందుతాయి. జీవిత భాగస్వామితో అన్యోన్యత పెరుగుతుంది. ముఖ్యమైన వ్యవహారాల్లో మిత్రుల నుంచి సహాయ సహకారాలు లభిస్తాయి. ఆస్తి వివాదం ఒకటి అనుకూలంగా మారుతుంది. ఆకస్మిక ధన లాభానికి అవకాశం ఉంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది.

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)

వృత్తి, వ్యాపారాలు కొత్త పుంతలు తొక్కుతాయి. ఉద్యోగ జీవితం సానుకూలంగా సాగిపోతుంది. కుటుంబ జీవితం హ్యాపీగా కొనసాగుతుంది. గృహ, వాహన యోగాలు పట్టే సూచనలున్నాయి. పెళ్లి ప్రయత్నాల విషయంలో బంధువుల నుంచి ఆశించిన శుభవార్తలు అందుతాయి. ముఖ్య మైన వ్యవహారాలను పట్టుదలగా పూర్తి చేస్తారు. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు ఫలించే అవకాశం ఉంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది. ఇతరుల వ్యవహారాల్లో తలదూర్చి ఇబ్బంది పడడం జరుగుతుంది.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)

సమయం బాగా అనుకూలంగా ఉంది. ఏ ప్రయత్నం తలపెట్టినా తప్పకుండా సఫలం ముఖ్యమైన వ్యవహారాలు తేలికగా పూర్తవుతాయి. ఆర్థికంగా ఇతరులకు సహాయం చేసే స్థితిలో ఉంటారు. ఉద్యోగ జీవితంలో ప్రాధాన్యం బాగా పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాల్లో లాభాలకు లోటుం డదు. ఉద్యోగ ప్రయత్నాలకు సానుకూల స్పందన లభించే అవకాశం ఉంది. అనుకోకుండా ఆస్తి వివాదం పరిష్కారం అవుతుంది. అనుకోకుండా కుటుంబంలో ఒక శుభ పరిణామం చోటు చేసుకుంటుంది.

కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)

ఆకస్మిక ధన లాభానికి బాగా అవకాశం ఉంది. ఆస్తి వివాదం ఒకటి పరిష్కారం అయ్యే అవకాశం ఉంది. నిరుద్యోగులకు విదేశాల నుంచి ఆఫర్ అందే అవకాశం ఉంది. విదేశాల్లో ఉన్న పిల్లల నుంచి శుభవార్తలు అందుకుంటారు. ఉద్యోగంలో స్థిరత్వం ఏర్పడుతుంది. ఆదాయం అనుకూ లంగా ఉండడంతో చిన్నా చితకా ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి. ఆరోగ్యం బాగానే ఉంటుంది. పెళ్లి ప్రయత్నాలు కొద్దిగా నిరుత్సాహం కలిగిస్తాయి. వృత్తి, వ్యాపారాలు లాభసాటిగా సాగిపోతాయి.

తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)

ఏ పని, ఏ ప్రయత్నం తలపెట్టినా విజయవంతం అవుతుంది. గ్రహ బలం అనుకూలంగా ఉంది. ఉద్యోగంలో అధికారులకు మీ మీద బాగా నమ్మకం పెరుగుతుంది. హోదా పెరగడానికి కూడా అవకాశముంది. వృత్తుల్లో ఉన్నవారికి ఆశించిన గుర్తింపు లభిస్తుంది. వ్యాపారాల్లో కూడా ఆశించిన అభివృద్ధి కనిపిస్తుంది. పిల్లల చదువుల మీద శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉంది. తల్లితండ్రుల నుంచి ఆర్థికంగా తోడ్పాటు లభిస్తుంది. ఒకటి రెండు ముఖ్యమైన ఆర్థిక సమస్యల నుంచి బయట పడతారు.

వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట)

అనవసర ఆర్థిక సహాయాల వల్ల ఇబ్బందుల్లో పడతారు. ఆర్థిక లావాదేవీలకు ఎంత వీలైతే అంత దూరంగా ఉండడం మంచిది. ఇష్టమైన బంధువుల నుంచి శుభ వార్తలు వింటారు. ఆరోగ్యం విష యంలో జాగ్రత్తగా ఉండడం మంచిది. ఉద్యోగ జీవితం సాఫీగా సాగిపోతుంది. వృత్తి, వ్యాపారాలు నిలకడగా సాగిపోతాయి. ఉద్యోగ ప్రయత్నాలకు అనుకూల స్పందన లభిస్తుంది. పెళ్లి ప్రయ త్నాలు అనుకూలించకపోవచ్చు. మంచి పరిచయాలు ఏర్పడతాయి. పెండింగ్ పనులు పూర్తవుతాయి.

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)

సమయం బాగా అనుకూలంగా ఉంది. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. ఇష్ట మైన ఆలయాలను సందర్శించడం, ఇష్టమైన స్నేహితుల్ని కలుసుకోవడం వంటివి జరుగుతాయి. మొత్తం మీద రోజంతా హ్యాపీగా సాగిపోతుంది. వృత్తి, ఉద్యోగాల్లో అనుకూలతలు పెరుగుతాయి. అధికారుల నుంచి ఆదరణ లభిస్తుంది. వ్యాపారాల్లో అంచనాలకు మించిన లాభాలు ఆర్జిస్తారు. నిరుద్యోగులకు విదేశాల నుంచి కూడా ఆఫర్లు అందుతాయి. పిల్లలు ఘన విజయాలు సాధిస్తారు.

మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2)

అనుకోకుండా కొన్ని శుభవార్తలు వింటారు. శుభ పరిణామం ఒకటి చోటు చేసుకుంటుంది. వృత్తి, ఉద్యోగాలు హాయిగా, హుషారుగా సాగిపోతాయి. వ్యాపారాలు లాభదాయకంగా ముందుకు వెడతాయి. వ్యక్తిగత సమస్య ఒకటి అప్రయత్నంగా పరిష్కారం అవుతుంది. ఆదాయంలో పెద్దగా మార్పు ఉండకపోవచ్చు కానీ అనుకోని ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. ఏ విషయంలో అయినా జీవిత భాగస్వామితో సంప్రదించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది. ఆరోగ్యం బాగానే ఉంటుంది.

కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)

ఇంటా బయటా బాగా ఒత్తిడి, శ్రమ ఉంటాయి. ప్రతి వ్యవహారంలోనూ ఆచితూచి వ్యవహరించడం మంచిది. వ్యయ ప్రయాసలుంటాయి. అనవసర ఖర్చులు పెరుగుతాయి. ఆర్థిక పరిస్థితి నిలకడగా ఉంటుంది. అదనపు ఆదాయ ప్రయత్నాల్లో ప్రతిఫలం తక్కువగా ఉంటుంది. ఆరోగ్యం అనుకూ లంగా ఉంటుంది. బంధువులకు అండగా నిలబడతారు. ఉద్యోగంలో అధికారుల నుంచి ప్రోత్సాహ కాలు అందుకుంటారు. వృత్తి, వ్యాపారాల్లో స్వల్ప లాభాలు చవి చూస్తారు. ఎవరికీ హామీలు ఉండవద్దు.

మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)

సొంత పనులు, వ్యవహారాల మీద శ్రద్ధ పెట్టడం మంచిది. ఆర్థిక సహాయాలు, దాన ధర్మాలకు ప్రస్తుతానికి దూరంగా ఉండడం అవసరం. ఒకటి రెండు వ్యక్తిగత సమస్యలు పరిష్కారం అవు తాయి. ఆర్థిక ప్రయత్నాలు సత్ఫలితాలనిస్తాయి. ముఖ్యమైన వ్యవహారాలు కొద్ది శ్రమతో పూర్తవు తాయి. కుటుంబసమేతంగా ఆలయాలు సందర్శిస్తారు. కుటుంబ జీవితం హ్యాపీగా, సాఫీగా సాగి పోతుంది. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. వృత్తి, ఉద్యోగాలు ఉత్సాహంగా సాగిపోతాయి.

ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
గులాబీ రేకులతో షర్బత్.. రుచి, ఆరోగ్యం రెండూ మీ సొంతం!
గులాబీ రేకులతో షర్బత్.. రుచి, ఆరోగ్యం రెండూ మీ సొంతం!
వరుసగా 9 సినిమాలు ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
వరుసగా 9 సినిమాలు ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..