బెండకాయ.. ఓ కూరగాయగానే పరిచయం. తింటే ఆరోగ్యానికి మేలు చేస్తుందని విన్నాం.. రకరకాల కూరలు వండుకొని తిన్నాం! మరి.. బెండకాయ నీటి గురించి ఎప్పుడైనా విన్నారా?
TV9 Telugu
బెండకాయ నీళ్లు ఆరోగ్యంతోపాటు అందానికి భరోసా ఇస్తాయట. ఎలా తయారు చేయాలంటే.. ముందుగా బెండకాయను బాగా కడిగి ముక్కలుగా కోయాలి
TV9 Telugu
వీటిని ఓ గ్లాసు తాగు నీటిలో వేసి, రాత్రంతా నానబెట్టాలి. ఉదయాన్నే నీటిని వడగట్టి.. పరగడుపునే తాగాలి. ఇలా తాగడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు అందుతాయి మరి
TV9 Telugu
బెండకాయలో ఫైబర్ అధికం. అది బరువు తగ్గేందుకు సహాయపడుతుంది. మలబద్ధకాన్ని నివారిస్తుంది. ఇందులోని యాంటి ఆక్సిడెంట్లు, విటమిన్లు, మినరల్స్.. రోగ నిరోధక శక్తిని బలోపేతం చేస్తాయి
ఈ నీటిలో కొద్దిగా నిమ్మరసం, తేనె కలుపుకొని తాగితే.. శరీరంలోని విష పదార్థాలు బయటికి వెళ్లిపోతాయి. ఇందులో ఉండే విటమిన్ సి, పాలీఫినాల్స్ చర్మాన్ని యవ్వనంగా మారుస్తాయి
TV9 Telugu
బెండకాయలో కాల్షియం, మెగ్నీషియం, విటమిన్ కె తదితర పోషకాలు సమృద్ధిగా లభిస్తాయి. ఇవి ఎముకల ఆరోగ్యానికి మేలుచేస్తాయి
TV9 Telugu
బెండకాయ నీటిలో ఉండే ల్యూటిన్, జియాగ్జాంతిన్ వంటి పోషకాలు.. కంటిచూపును మెరుగుపరుస్తాయి. బెండకాయ నీటిని తలకు బాగా పట్టిస్తే.. జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది