AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Shukra Gochar 2026: శుక్రుడి కటాక్షం.. ఇక వారి జీవితంలో కొత్త వెలుగులు ఖాయం..!

Venus Transit in Cancer: జ్యోతిషశాస్త్రంలో ధన, అధికారాలకు గురువు ఎంత ముఖ్యమో, సుఖసంతోషాలు, మానసిక ప్రశాంతతకు శుక్రుడు అంతే కీలకంగా భావిస్తారు. ఈ నేపథ్యంలో జూన్ 9 నుంచి జూలై 4 వరకు కర్కాటక రాశిలో శుక్రుడు సంచరించనున్నాడు. ఈ సంచారం వల్ల కొన్ని రాశుల వారికి అనుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. దీని ప్రభావంతో జీవితం సాఫీగా, సంతోషంగా సాగుతుందని జ్యోతిష పండితుల అంచనావేస్తున్నారు.

TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Jun 09, 2026 | 12:35 PM

Share
జ్యోతిషశాస్త్రంలో ధనానికి, అధికారానికి కారకుడైన గురువుకు ఎంత ప్రాధాన్యం ఉందో సుఖసంతోషాలకు, మానసిక ప్రశాంతతకు కారకుడైన శుక్రుడికి కూడా దాదాపు అంతే ప్రాధాన్యం ఉంది. జాతక చక్రంలోనూ, గ్రహ సంచారంలోనూ శుక్రుడి స్థితికి జ్యోతిష పండితులు అత్యధిక ప్రాధాన్యం ఇవ్వడం జరుగుతుంటుంది. ఈ నెల (జూన్) 9 నుంచి జూలై 4 వరకు కర్కాటకంలో సంచారం చేయబోతున్న శుక్రుడు కొన్ని రాశుల వారి జీవితాల్లో వెలుగులను, సుఖసంతోషాలను నింపబోతున్నాడు. మేషం, మిథునం, కర్కాటకం, కన్య, తుల, మకర రాశుల వారి జీవితాలు నల్లేరు మీద బండిలా సాగిపోబోతున్నాయి.

1 / 7
మేషం: ఈ రాశివారికి చతుర్థ స్థానమైన కర్కాటక రాశిలో శుక్ర సంచారం వల్ల దిగ్బల రాజయోగం ఏర్పడింది. ఒత్తిళ్లు, సమస్యలు, వివాదాలు, విభేదాల నుంచి పూర్తిగా విముక్తి లభిస్తుంది. ఇంట్లో సుఖ సంతోషాలు వృద్ధి చెందుతాయి. శుభ కార్యాలు జరిగే అవకాశం కూడా ఉంది. ఉద్యోగంలో ఆశించిన పదోన్నతి లభిస్తుంది. వృత్తి, వ్యాపారాల్లో యాక్టివిటీ బాగా పెరుగుతుంది. ఆస్తి వివాదాలు అనుకూలంగా పరిష్కారమవుతాయి. ఇల్లు, స్థలాలు, వాహనం వంటివి అమరే అవకాశం ఉంది.

2 / 7
మిథునం: ఈ రాశికి ద్వితీయ స్థానంలో శుక్ర సంచారం వల్ల అతి తక్కువ శ్రమతో ఆదాయం వృద్ధి చెందుతుంది. ఆర్థిక, వ్యక్తిగత, కుటుంబ సమస్యలు పూర్తిగా తొలగిపోతాయి. ఉద్యోగంలో వేతనాలు బాగా పెరుగుతాయి. మీ సలహాలు, సూచనల వల్ల సంస్థ లబ్ధి పొందుతుంది. వృత్తి, వ్యాపారాల్లో రాబడి బాగా పెరుగుతుంది. పిల్లలు వృద్ధిలోకి వస్తారు. కుటుంబ జీవితం, దాంపత్య జీవితం  హ్యాపీగా సాగిపోతాయి. షేర్లు, స్పెక్యులేషన్లతో సహా అనేక విధాలుగా ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది.

3 / 7
కర్కాటకం: ఈ రాశికి చతుర్థ, లాభాధిపతి అయిన శుక్రుడు ఇదే రాశిలో సంచారం వల్ల అనేక ఒత్తిళ్లు, సమ స్యలు, వివాదాల నుంచి పూర్తిగా విముక్తి లభించి మానసిక ప్రశాంతత కలుగుతుంది. ఇంట్లో శుభ కార్యాలు నిర్వహిస్తారు. తీర్థయాత్రలు, విహార యాత్రలు ఎక్కువగా చేస్తారు. ఆస్తి లాభం కలు గుతుంది. సొంత ఇంటి కల నెరవేరుతుంది. ఉద్యోగంలో పదోన్నతి లభిస్తుంది. వృత్తి, వ్యాపారాలు లాభాల బాటపడతాయి. సంపన్న కుటుంబానికి చెందిన వ్యక్తితో పెళ్లి సంబంధం కుదురుతుంది.

4 / 7
కన్య: ఈ రాశికి ధన, భాగ్యాధిపతి అయిన శుక్రుడు లాభ స్థానంలో సంచారం చేయడం వల్ల ఈ రాశికి చెందిన ఉద్యోగులు, నిరుద్యోగులకు విదేశీ ఆఫర్లు అందుతాయి. విదేశీ సంపాదనను అనుభవించే యోగం పడుతుంది. ఉద్యోగంలో పదోన్నతులు కలుగుతాయి. వృత్తి, వ్యాపారాలకు డిమాండ్ బాగా పెరుగుతుంది. వృత్తి, ఉద్యోగ విధుల్లో భాగంగా విదేశాలకు వెళ్లే అవకాశం కలుగుతుంది. ఆస్తి వివాదం ఒకటి అనుకూలంగా పరిష్కారమవుతుంది. వారసత్వపు ఆస్తి కలిసి వస్తుంది.

5 / 7
తుల: రాశ్యధిపతి శుక్రుడు దశమ స్థానంలో సంచారం ప్రారంభించడం వల్ల ఉద్యోగ జీవితంలో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఉద్యోగంలో తప్పకుండా అందలాలు ఎక్కుతారు. పని ఒత్తిడి, పని భారం నుంచి విముక్తి లభిస్తుంది. నిరుద్యోగులకు విదేశీ ఆఫర్లు కూడా అందుతాయి. ప్రముఖులతో పరిచయాలు వృద్ధి చెందుతాయి. మరింత మంచి ఉద్యోగంలోకి మారడానికి అవకాశం ఉంది. పెళ్లి ప్రయత్నాల్లో విదేశీ సంబంధం ఖాయమవుతుంది. శుభ వార్తలు ఎక్కువగా వింటారు.

6 / 7
మకరం: పంచమ, దశమాధిపతిగా ఈ రాశికి అత్యంత శుభుడైన శుక్రుడు సప్తమ స్థానంలో సంచారం ప్రారంభించడం వల్ల ఈ రాశివారికి అనేక విధాలుగా అదృష్టం తలుపుతడుతుంది. రావలసిన సొమ్ము పూర్తిగా చేతికి అందడంతో పాటు షేర్లు, స్పెక్యులేషన్లు, ఆర్థిక లావాదేవీలు, లాటరీల వల్ల కూడా ఆదాయం వృద్ధి చెందుతుంది. ఉద్యోగంలో అందలాలు ఎక్కుతారు. వృత్తి, వ్యాపారాలు బాగా బిజీగా సాగిపోతాయి. పిల్లలు వృద్ధిలోకి వస్తారు. సంతాన యోగానికి బాగా అవకాశం ఉంది.

7 / 7
Follow Us