AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Medical Shop: రైల్వే స్టేషన్లలో మెడికల్ షాప్‌లు ఎందుకు ఉండవో తెలుసా? 99 శాతం మందికి తెలియని సీక్రెట్

మీరు ఊరెళ్లేటప్పుడో లేదా, యాత్రలకు వెళ్లేటప్పుడో.. ఏదో ఒక సందర్భంలో రైల్వే స్టేషన్‌కు వెళ్లే ఉంటారు. అయితే స్టేషన్‌లో మీకు అన్ని రకాలు దుఖానాలు కనిపిస్తాయి. కానీ ఎప్పుడైన రైల్వే స్టేషన్‌లో మీరు మెడికల్ షాప్‌లను చూశారా?.. కనిపించక పోతే.. ఎందుకు రైల్వే స్టేషన్‌లో మెడికల్ షాప్‌లు లేవు అనే డౌట్ మీకు వచ్చిందా.. అయితే కచ్చితంగా మీరు ఇది తెలుసుకోవాల్సిందే.

Medical Shop: రైల్వే స్టేషన్లలో మెడికల్ షాప్‌లు ఎందుకు ఉండవో తెలుసా? 99 శాతం మందికి తెలియని సీక్రెట్
Why No Medical Shops At Railway Stations
Anand T
|

Updated on: Jun 09, 2026 | 6:40 PM

Share

టీ, టిఫిన్స్, బ్యాగ్స్, బుక్స్‌ ఇలా మనకు కావాల్సిన అన్ని రైల్వే స్టేషన్‌లో దొరుకుతాయి కానీ ఒక్క మెడిసిన్స్ మాత్రం ఎక్కడా కనిపించవు. మీరు కూడా ట్రైన్ జర్నీ సమయంలో దీన్ని గమనించే ఉంటారు. అయితే రైల్వే స్టేషన్లలో మెడికల్ షాప్‌లు పెట్టకపోవడానికి అనేక కారణాలు ఉన్నాయి. ఒకరు రైల్వే స్టేషన్లలో మెడికల్ షాప్ పెట్టాలి అనుకుంటే దానికి భారతీయ రైల్వే నుండి ప్రత్యేక అనుమతి, లైసెన్స్ తీసుకోవాల్సి ఉంటుంది. స్టేషన్‌లో చాలా తక్కువ ప్లేస్ ఉంటుంది కాబట్టి ఫుడ్‌, వాటర్, వంటి ప్రధాన సేవలకు ప్రధాన్యత ఇస్తారు.

మెడికల్ షాప్ తెరవడానికి కఠినమైన నియమాలు ఉన్నాయా?

ఒక మెడికల్ షాప్ పెట్టాలంటే.. దానిని ఎలా నడపాలో తెలిసి ఉండాలి,దీనికి క్వాలిఫైడ్ ఫార్మసిస్ట్ కచ్చితంగా ఉండాలి. మందులను భద్రపరచడానికి నిర్దిష్ట ఉష్ణోగ్రత అవసరం. రైల్వే స్టేషన్‌లలో ఉండే సాధారణ స్టాళ్లలో ఇలాంటి నిబంధనలను పాటించడం, తనిఖీలు చేయడం కొంతవరకు కష్టంతో కూడుకున్న పని. కాబట్టి చాలా వరకు రైల్వే స్టేషన్‌లో మెడికల్ షాప్‌లు ఎవరూ పెట్టేందుకు ముందుకురారు. దీని వల్ల మనకు ఎక్కవగా మెడికల్ షాప్‌లు కనిపించవు.

ఒకవేళ మందులు అవసరమైతే?

అయితే అన్ని స్టేషన్‌లలో వైద్య సౌకర్యాలు ఉండవని చెప్పడం సరికాదు.. కొన్ని పెద్ద రైల్వే స్టేషన్లలో రైల్వే ఆసుపత్రులు, ఆరోగ్య కేంద్రాలు, ప్రథమ చికిత్స కేంద్రాలు కచ్చితంగా ఉంటాయి. ఏదైనా ఎమర్జెన్సీ ఉంటే ప్రయాణికులు ఇక్కడ సేవలను ఉపయోగించుకోవచ్చు. అయితే కొన్ని స్టేషన్‌లలో లైసైన్స్ పొందిచిన మెడికల్ షాప్‌లు కూడా ఉంటాయి.

భవిష్యత్తులో ఇలాంటి సౌకర్యాలు పెరుగుతాయా?

డిజిటల్ ఆరోగ్య సేవలు, ఆధునిక రైల్వే స్టేషన్ల అభివృద్ధితో రాబోయే రోజుల్లో మరిన్ని స్టేషన్‌లలో కూడా మెడికల్ షాప్‌లు ఏర్పాటు అయ్యే అవకాశాలు ఉన్నాయి. రోజురోజుకూ పెరుగుతున్న ప్రయాణికుల రద్దీ నేపథ్యంలో అనేక స్టేషన్లలో మెరుగైన వైద్య సౌకర్యాలను అందించడానికి రైల్వే నిరంతరం కృషి చేస్తోంది. అందువల్ల, భవిష్యత్తులో, స్టేషన్ ప్రాంగణంలోనే వైద్య సేవలు మునుపెన్నడూ లేనంతగా సులభంగా అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
కష్టం విలువ తెలిస్తేనే డబ్బు విలువ అర్థమవుతుంది.. నీతి కథ
కష్టం విలువ తెలిస్తేనే డబ్బు విలువ అర్థమవుతుంది.. నీతి కథ
వాషింగ్ మెషీన్‌లోకి నీళ్లు స్లోగా వస్తున్నాయా.. పైసా ఖర్చు..
వాషింగ్ మెషీన్‌లోకి నీళ్లు స్లోగా వస్తున్నాయా.. పైసా ఖర్చు..
పేరుకే సీరియల్ నటి.. కానీ హీరోయిన్స్‌కు ఏమాత్రం తీసిపోదు..
పేరుకే సీరియల్ నటి.. కానీ హీరోయిన్స్‌కు ఏమాత్రం తీసిపోదు..
ఆ హీరోని పెళ్లి చేసుకోమని చాలా మంది చెప్పారు..
ఆ హీరోని పెళ్లి చేసుకోమని చాలా మంది చెప్పారు..
ఆపద్బాంధవులుగా ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు.. అస్సాం వరదల్లో..
ఆపద్బాంధవులుగా ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు.. అస్సాం వరదల్లో..
నడిరోడ్డుపై టీజీపీఎస్సీ OMR షీట్లు.. ఆందోళనలో విద్యార్థులు!
నడిరోడ్డుపై టీజీపీఎస్సీ OMR షీట్లు.. ఆందోళనలో విద్యార్థులు!
చికెన్ స్కిన్ తింటే మంచిదేనా..? ఇవిగో పూర్తి వివరాలు..
చికెన్ స్కిన్ తింటే మంచిదేనా..? ఇవిగో పూర్తి వివరాలు..
ఆగస్టులో ఆ రాశుల వారికి ఉద్యోగ యోగం.. లిస్ట్‌లో మీ రాశి ఉందా..?
ఆగస్టులో ఆ రాశుల వారికి ఉద్యోగ యోగం.. లిస్ట్‌లో మీ రాశి ఉందా..?
ఒకే రీఛార్జ్‌లో అన్నీ.. 15 నెలల హై-స్పీడ్ నెట్‌, 12 OTT యాప్‌లు
ఒకే రీఛార్జ్‌లో అన్నీ.. 15 నెలల హై-స్పీడ్ నెట్‌, 12 OTT యాప్‌లు
రోజుకు 45 దాచిపెడితే.. 100 ఏళ్ల వరకు ఏటా 40 వేలు.. ఎల్ఐసీ స్కీమ్
రోజుకు 45 దాచిపెడితే.. 100 ఏళ్ల వరకు ఏటా 40 వేలు.. ఎల్ఐసీ స్కీమ్