Horoscope Today: ఆ రాశి వారికి శుభవార్తలు అందుతాయి.. 12 రాశుల వారికి సోమవారంనాటి రాశిఫలాలు
దిన ఫలాలు (జూన్ 24, 2024): మేష రాశి వారికి ఈ రోజు కుటుంబ జీవితం ప్రశాంతంగా సాగిపోతుంది. ఆదాయం నిలకడగా ఉంటుంది. వృషభ రాశి వారికి అనుకోకుండా ఆస్తి వివాదం ఒకటి పరిష్కారం అవుతుంది. మిథున రాశి వారు ఉద్యోగరీత్యా ఆకస్మిక ప్రయాణ సూచనలున్నాయి. ఇంటా బయటా కొద్దిగా ఒత్తిడి ఉంటుంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి సోమవారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..
దిన ఫలాలు (జూన్ 24, 2024): మేష రాశి వారికి ఈ రోజు కుటుంబ జీవితం ప్రశాంతంగా సాగిపోతుంది. ఆదాయం నిలకడగా ఉంటుంది. వృషభ రాశి వారికి అనుకోకుండా ఆస్తి వివాదం ఒకటి పరిష్కారం అవుతుంది. మిథున రాశి వారు ఉద్యోగరీత్యా ఆకస్మిక ప్రయాణ సూచనలున్నాయి. ఇంటా బయటా కొద్దిగా ఒత్తిడి ఉంటుంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి సోమవారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..
మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)
కుటుంబ జీవితం ప్రశాంతంగా సాగిపోతుంది. ఆదాయం నిలకడగా ఉంటుంది. అనవసర ఖర్చులు తగ్గించుకోవడం మంచిది. ప్రయాణాలు బాగా లాభిస్తాయి. అదనపు ఆదాయ ప్రయత్నాలు సఫలం అవుతాయి. వృత్తి, వ్యాపారాలు లాభాల బాట పడతాయి. కుటుంబసమేతంగా ఆలయాల సందర్శన ఉంటుంది. వృత్తి, ఉద్యోగాలలో జీతభత్యాలు కొద్దిగా పెరిగే అవకాశం ఉంది. ఉద్యోగంలో అధికారుల నుంచి ఒత్తిడి ఉంటుంది. మీ మాటకు విలువ పెరుగుతుంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది.
వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)
అనుకోకుండా ఆస్తి వివాదం ఒకటి పరిష్కారం అవుతుంది. ఆర్థిక వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. బంధుమిత్రుల రాకపోకలుంటాయి. వ్యాపారాల్లో లాభాలు చాలావరకు నిలకడగా సాగుతాయి. వృత్తి, ఉద్యోగాలలో హోదా పెరగడానికి అవకాశం ఉంది. ఆరోగ్యం పరవాలేదు. మంచి ఉద్యోగంలోకి మారేందుకు అవకాశం ఉంది. నిరుద్యోగులు ఆశించిన సమాచారం అందుకుంటారు. పిల్లల నుంచి శుభవార్త వింటారు. ప్రయాణాల విషయంలో వీలైనంత జాగ్రత్తగా ఉండడం మంచిది.
మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)
ఉద్యోగరీత్యా ఆకస్మిక ప్రయాణ సూచనలున్నాయి. ఇంటా బయటా కొద్దిగా ఒత్తిడి ఉంటుంది. స్నేహితుల నుంచి ఆశించిన సహాయ సహకారాలు లభిస్తాయి. కొందరు మిత్రులు ఇబ్బందులకు గురిచేసే అవకాశం కూడా ఉంది. ముఖ్యమైన వ్యవహారాలలో జీవిత భాగస్వామిని సంప్రదించడం మంచిది. వృత్తి, వ్యాపారాలు పరవాలేదనిపిస్తాయి. ఉద్యోగంలో అధికారుల నుంచి ఆశించిన ప్రోత్సాహం ఉంటుంది. అధికారులతో జాగ్రత్తగా ఉండడం మంచిది. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది.
కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)
ముఖ్యమైన వ్యవహారాలు విజయవంతంగా పూర్తవుతాయి. వ్యాపారాలలో లాభాలు పెరుగు తాయి. ఇంట్లో పండుగ వాతావరణం నెలకొంటుంది. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. వృత్తి, ఉద్యోగాల్లో మీ పనితీరుతో అధికారులను ఆకట్టుకుంటారు. బంధుమిత్రులకు ఆర్థికంగా సహాయ పడతారు. ఆరోగ్యం పరవాలేదనిపిస్తుంది. చిన్ననాటి స్నేహితులను కలుసుకుని ఎంజాయ్ చేస్తారు. కుటుంబంతో విందులు వినోదాల్లో పాల్గొంటారు. ఒకటి రెండు శుభవార్తలు వినే అవకాశం ఉంది.
సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)
వృత్తి, వ్యాపారాలు సాదా సీదాగా సాగిపోతాయి. ఉద్యోగంలో మీ ప్రతిభా పాటవాలకు తగిన గుర్తింపు లభిస్తుంది. ఆదాయ ప్రయత్నాలు బాగా కలిసి వస్తాయి. ఆర్థిక లావాదేవీలు లాభసాటిగా సాగుతాయి. చేపట్టిన పనులు నిదానంగా పూర్తవుతాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ముఖ్యమైన వస్తువులతో కొద్దిగా జాగ్రత్తగా ఉండడం మంచిది. నిరుద్యోగులు సొంత ఊర్లోనే ఉద్యోగం సంపాదించుకుంటారు. జీవిత భాగస్వామితో ఆలయాలకు వెడతారు. పిల్లలు వృద్ధిలోకి వస్తారు.
కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)
ఆకస్మిక ధన లాభ సూచనలున్నాయి. చిన్ననాటి మిత్రులతో దైవ కార్యాల్లో పాల్గొంటారు. ఇంటికి బంధువుల రాకపోకలుంటాయి. కుటుంబ జీవితం ఉత్సాహంగా సాగిపోతుంది. స్థిరాస్తి వివాదాలు పరిష్కారం అయ్యే అవకాశం ఉంది. ఉద్యోగంలో ప్రాధాన్యం, ప్రాభవం పెరుగుతాయి. వృత్తి వ్యాపా రాల్లో ఆశించిన లాభాలు కనిపిస్తాయి. ముఖ్యమైన వ్యవహారాలు విజయవంతంగా పూర్తవు తాయి. జీవిత భాగస్వామితో అన్యోన్యత పెరుగుతుంది. ఒకటి రెండు శుభవార్తలు వింటారు.
తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)
నిరుద్యోగులకు మంచి మంచి ఆఫర్ అందుతుంది. మరింత మంచి ఉద్యోగంలోకి మారడానికి ఇది అనుకూలమైన సమయం. అనుకున్న పనులు అనుకున్నట్టు జరిగిపోతాయి. అదనపు ఆదాయ ప్రయత్నాలు సఫలం అవుతాయి. వృత్తి, వ్యాపారాలు లాభాల బాటపడతాయి. డాక్టర్లు, లాయర్ల వంటి వృత్తుల వారికి మంచి గుర్తింపు లభిస్తుంది. కుటుంబ జీవితం సాఫీగా, హ్యాపీగా సాగిపో తుంది. ఆరోగ్యం, ఆదాయం నిలకడగా ఉంటాయి. విదేశాల్లోని పిల్లల నుంచి శుభవార్త వింటారు.
వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట)
వృత్తి, ఉద్యోగాలు ఉత్సాహంగా సాగిపోతాయి. వ్యాపారాల్లో అప్రమత్తంగా ఉండడం మంచిది. ఉద్యోగంలో సానుకూల మార్పులు చోటు చేసుకుంటాయి. అధికారులతో సామరస్యం ఏర్పడు తుంది. దూర ప్రాంతంలో ఉన్న పిల్లల నుంచి ఆశించిన సమాచారం అందుతుంది. ఉద్యోగం మార డానికి ప్రయత్నాలు చేయడం మంచిది. నిరుద్యోగులు మంచి ఆఫర్ అందుకుంటారు. పెళ్లి ప్రయ త్నాలు ఒక కొలిక్కి వస్తాయి. దాంపత్యంలో అన్యోన్యత పెరుగుతుంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది.
ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)
ఆదాయం, ఆరోగ్యం నిలకడగా ఉంటాయి. ఉద్యోగంలో ఆశించిన పురోగతి కనిపిస్తుంది. దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. ధనపరంగా కొందరు బంధుమిత్రులతో జాగ్రత్తగా ఉండడం మంచిది. ముఖ్యమైన పనులు నిదానంగా పూర్తవుతాయి. గృహ, వాహన సౌకర్యాల మీద దృష్టి పెడతారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాలు ఉత్సాహం కలిగి స్తాయి. నిరుద్యోగులకు శుభవార్త అందుతుంది. ఉద్యోగ జీవితం సానుకూలంగా సాగిపోతుంది.
మకరం (ఉత్తరాషాడ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2)
ముఖ్యమైన వ్యక్తిగత సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. కుటుంబ సభ్యుల వల్ల కొద్దిగా ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. వృత్తి, ఉద్యోగాలలో ఆశించిన ప్రోత్సాహకాలు అందుకుం టారు. బంధుమిత్రుల నుంచి అవసర సమయాల్లో సహాయ సహకారాలు అందుతాయి. స్థిరాస్తి వ్యవహారాలు సజావుగా సాగిపోతాయి. ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. పిల్లల నుంచి శుభ వార్తలు వింటారు. చిన్ననాటి మిత్రులతో ఎంజాయ్ చేస్తారు. వ్యాపారాల్లో లాభాలు పెరుగుతాయి.
కుంభం (ధనిష్ఠ 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)
కుటుంబ వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ముఖ్య మైన వ్యవహారాల్ని సకాలంలో పూర్తి చేస్తారు. బంధుమిత్రులతో సఖ్యత, సాన్నిహిత్యం పెరుగు తాయి. ప్రయాణాలు లాభిస్తాయి. వ్యాపారాలలో లాభాలు పెరుగుతాయి. వృత్తి, ఉద్యోగా లలో ఆశిం చిన పురోగతి కనిపిస్తుంది. సోదరులతో ఆస్తి వివాదాలు తొలగిపోతాయి. అప్రయత్న కార్యసిద్ధి కలుగుతుంది. ఇంటికి బంధువుల రాకపోకలుంటాయి. పిల్లల గురించి శుభవార్త వింటారు.
మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)
జీవిత భాగస్వామి సహాయంతో కుటుంబ పరిస్థితులను చక్కదిద్దుతారు. పట్టుదలగా కొన్ని ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు. కొందరు బంధువులతో అపార్థాలు తలెత్తే సూచనలున్నాయి. ఆర్థిక వ్యవహారాలు సాఫీగా, సానుకూలంగా సాగిపోతాయి. వృత్తి, ఉద్యోగాలలో అధికారుల నుంచి ఒత్తిడి పెరుగుతుంది. వ్యాపారాలు నిలకడగా సాగే అవకాశం ఉంది. అదనపు ఆదాయ మార్గాలు మీ ముందుకు వస్తాయి. ఆరోగ్యం పరవాలేదు. ఒకటి రెండు ఆశించిన శుభవార్తలు వింటారు.