Horoscope Today: వారికి ఆదాయం పెరిగే అవకాశముంది.. 12 రాశుల వారికి బుధవారం రాశిఫలాలు

దిన ఫలాలు (జూలై 24, 2024): మేష రాశి వారికి గృహం కొనుగోలు వ్యవహారంలో అవరోధాలు తొలగుతాయి. వృషభ రాశి వారు ఆర్థిక ఇబ్బందుల నుంచి కొద్దిగా బయటపడతారు. మిథున రాశి వారికి ఆదాయం నిలకడగా ఉంటుంది కానీ ఖర్చులు పెరుగుతాయి. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి బుధవారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..

Horoscope Today: వారికి ఆదాయం పెరిగే అవకాశముంది.. 12 రాశుల వారికి బుధవారం రాశిఫలాలు
Horoscope Today 24th July 2024
Follow us

| Edited By: Janardhan Veluru

Updated on: Jul 24, 2024 | 5:01 AM

దిన ఫలాలు (జూలై 24, 2024): మేష రాశి వారికి గృహం కొనుగోలు వ్యవహారంలో అవరోధాలు తొలగుతాయి. వృషభ రాశి వారు ఆర్థిక ఇబ్బందుల నుంచి కొద్దిగా బయటపడతారు. మిథున రాశి వారికి ఆదాయం నిలకడగా ఉంటుంది కానీ ఖర్చులు పెరుగుతాయి. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి బుధవారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..

మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)

ఆస్తి సమస్య ఒకటి అనుకూలంగా పరిష్కారం అవుతుంది. ఆస్తిపాస్తుల విలువ పెరిగినట్టు సమాచారం అందుతుంది. అనుకోకుండా వాహన యోగం పడుతుంది. గృహం కొనుగోలు వ్యవహారంలో అవరోధాలు తొలగుతాయి. సేవా కార్యక్రమాల్లో పాల్గొనడం వల్ల పేరు ప్రతిష్టలు పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాల్లో కీలక నిర్ణయాలు తీసుకుని లాభాలు అందుకుంటారు. ఉద్యోగులకు పదోన్నతి లభించే అవకాశం ఉంది. మిత్రుల నుంచి రావాల్సిన డబ్బు కొద్ది ప్రయత్నంతో చేతికి అందుతుంది.

వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)

కుటుంబ సభ్యుల కారణంగా కొద్దిగా ఇబ్బంది పడతారు. ఆర్థిక ఇబ్బందుల నుంచి కొద్దిగా బయట పడతారు. దీర్ఘకాలిక వ్యక్తిగత సమస్యల నుంచి, అనారోగ్య సమస్యల నుంచి చాలావరకు ఉపశ మనం లభిస్తుంది. ఆకస్మిక ప్రయాణాలకు అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాలు సాదా సీదాగా సాగిపోతాయి. ఉద్యోగాల్లో అధికారుల నుంచి విమర్శలు ఎదురవుతాయి. సొంత పనుల మీద శ్రద్ధ పెట్టడం మంచిది. పెళ్లి ప్రయత్నాల్లో ఆశించిన శుభవార్త వింటారు. నిరుద్యోగులకు ఆఫర్లు అందుతాయి.

మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)

ఆదాయం నిలకడగా ఉంటుంది కానీ ఖర్చులు పెరుగుతాయి. కొద్దిగా రుణ ప్రయత్నాలు చేయ వలసిన అవసరం ఏర్పడుతుంది. స్థిరమైన నిర్ణయాలు, ఆలోచనలతో కీలక వ్యవహారాలను ముగిస్తారు. చేపట్టిన పనులు కూడా కొంత శ్రమతో పూర్తవుతాయి. కుటుంబ సభ్యుల మీద ఖర్చు బాగా పెరుగుతుంది. వ్యాపారాలు సామాన్యమైన లాభాలనిస్తాయి. నిరుద్యోగులకు ఆశాజనకమైన పరిస్థితి ఉంటుంది. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండడం మంచిది. ఎవరినీ అతిగా నమ్మవద్దు.

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)

ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. లాభదాయక ఒప్పందాలు చోటు చేసుకుంటాయి. జీవిత భాగస్వామితో కలిసి వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. పిల్లల చదువులు సంతృప్తి కలిగి స్తాయి. చేపట్టిన పనులన్నిటిలో కార్యసిద్ధికి అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాల్లో అంచనాలకు మించిన పురోగతి సాధిస్తారు. ఉద్యోగంలో పరస్పర సహాయ సహకారాలు లభిస్తాయి. అనుకున్న పనుల్లో కొన్ని అనుకున్న విధంగా పూర్తవుతాయి. ఇంటా బయటా అనుకూలతలు పెరుగుతాయి.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)

చిన్ననాటి మిత్రులతో విహార యాత్ర చేపట్టే అవకాశం ఉంది. లాభదాయక పరిచయాలు ఏర్పడతాయి. కొద్దిపాటి శ్రమ, ఖర్చులతో ముఖ్యమైన వ్యవహారాలనన్నిటినీ పూర్తి చేస్తారు. నిరుద్యోగు లకు మంచి ఉద్యోగం లభించే అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాల్లో లాభాలు అంచనాలను మించు తాయి. ఉద్యోగులకు హోదా పెరుగుతుంది. ఆర్థిక ప్రయత్నాలు చాలావరకు సత్ఫలితాలనిస్తాయి. కుటుంబ జీవితం ఆనందంగా సాగిపోతుంది. పిల్లలు వృద్ధిలోకి వస్తారు. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది.

కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)

ఆర్థిక పరిస్థితి బాగా ఆశాజనకంగా ఉంటుంది. శ్రమాధిక్యత ఉన్నప్పటికీ అత్యవసర పనులు, వ్యవహారాలను పూర్తి చేస్తారు. చిన్ననాటి మిత్రులతో సఖ్యత, సాన్నిహిత్యం పెరుగుతాయి. ఇంటిని కొనడానికి ఆలోచిస్తారు. వృత్తి, వ్యాపారాల్లో కొద్దిపాటి లాభాలుంటాయి. ఉద్యోగం సానుకూలంగా, సామరస్యంగా సాగిపోతుంది. ఆర్థిక వ్యవహారాల్లో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. నిరుద్యోగుల ప్రయత్నాలకు సానుకూల స్పందన లభిస్తుంది. అవసరానికి తగ్గట్టుగా డబ్బు వసూలవుతుంది.

తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)

ప్రయాణాల వల్ల ఇబ్బందులు పడతారు. ఆశించిన ప్రయోజనాలు నెరవేరకపోవచ్చు. ఆదాయం పెరిగే అవకాశం ఉంది. కొన్ని ముఖ్యమైన ఆర్థిక ఒత్తిళ్ల నుంచి బయటపడతారు. కొందరు బంధు మిత్రులతో దైవ కార్యాల్లో పాల్గొంటారు. కొందరు మిత్రుల ప్రవర్తన ఇబ్బంది కలిగిస్తుంది. నష్టదా యక వ్యవహారాలకు దూరంగా ఉండడం మంచిది. వృత్తి, వ్యాపారాలు ఆశాజనకంగా సాగుతాయి. ఉద్యోగ వాతావరణం ఉత్సాహవంతంగా ఉంటుంది. చేపట్టిన పనులన్నీ సకాలంలో పూర్తవుతాయి.

వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట)

కుటుంబసమేతంగా పుణ్య క్షేత్రం సందర్శిస్తారు. దీర్ఘకాలిక వివాదాలు పరిష్కార దిశగా సాగు తాయి. వ్యాపారాల్లో లాభాలకు లోటుండదు. తోబుట్టువుల నుంచి శుభ వార్తలు వింటారు. కొత్త వాహన యోగం పట్టడానికి అవకాశం ఉంది. నిరుద్యోగులకు ఎదురు చూస్తున్న సమాచారం అందుతుంది. ఉద్యోగంలో కొన్ని రకాల ఒత్తిళ్ల నుంచి బయటపడతారు. వృత్తి జీవితం బిజీగా సాగి పోతుంది. రావలసిన డబ్బు అవసర సమయంలో చేతికి అందుతుంది. ఆరోగ్యానికి ఢోకా ఉండదు.

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)

ఆధ్యాత్మిక విషయాల మీద ఆసక్తి బాగా పెరుగుతుంది. ఆస్తి వివాదంలో ప్రతిబంధకాలు తొలగు తాయి. కొద్దిగా అనారోగ్య సమస్యలుంటాయి. కుటుంబ వాతావరణం సామరస్యంగా ఉంటుంది. వృత్తి, వ్యాపారాలను విస్తరించే ఆలోచన చేస్తారు. ఉద్యోగంలో బరువు బాధ్యతలు పెరిగి, మానసిక ఒత్తిడి పెంచుతాయి. అనేక విధాలుగా ఆదాయం పెరుగుతుంది. మొండి బాకీలు వసూలవు తాయి. వృథా ఖర్చుల్ని బాగా తగ్గించుకుంటారు. కుటుంబ జీవితం అన్యోన్యంగా సాగిపోతుంది.

మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2)

ఇష్టమైన బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు. చేపట్టిన పనులు, వ్యవహారాల్లో ఊహించని విజయాలు సాధిస్తారు. ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది. వృత్తి, వ్యాపారాల్లో కొత్త మార్పులు ప్రవేశపెట్టి ఆర్థిక ప్రయోజనాలు పొందుతారు. ఉద్యోగ జీవితంలో మంచి గుర్తింపు లభిస్తుంది. నిరు ద్యోగులకు, ఉద్యోగులకు మంచి అవకాశాలు అంది వస్తాయి. అనవసర ఖర్చుల్ని అదుపు చేయడం మంచిది. స్వల్ప అనారోగ్య సూచనలున్నాయి. ఆకస్మిక ధన లాభానికి అవకాశం ఉంది.

కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)

దైవ సంబంధమైన కార్యక్రమాల్లో చురుకైన పాత్ర పోషిస్తారు. వృత్తి, వ్యాపారాలు లాభాలపరంగా కొత్త పుంతలు తొక్కుతాయి. ఉద్యోగంలో అధికారులు మీ మీద ఎక్కువగా ఆధారపడతారు. ఇంటా బయటా గౌరవమర్యాదలకు లోటుండదు. ప్రయాణాల్లో కొద్దిపాటి నష్టాలు తప్పకపోవచ్చు. జీవిత భాగస్వామితో అనుకూలతలు పెరుగుతాయి. సొంత పనుల మీద శ్రద్ధ పెట్టడం మంచిది. ఆరోగ్యం విషయంలో వీలైనంత జాగ్రత్తగా ఉండడం మంచిది. నిరుద్యోగులకు మంచి ఉద్యోగం లభిస్తుంది.

మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)

ఆర్థిక పరిస్థితి గతం కంటే బాగా మెరుగ్గా ఉంటుంది. ఆర్థిక వ్యవహారాలు విజయవంతంగా ముందుకు సాగుతాయి. వస్త్రాభరణాలు, విలువైన గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు. నిరుద్యో గులకు సమయం బాగా అనుకూలంగా ఉంది. ఇంట్లో శుభ కార్యాలు నిర్వహించడానికి ప్లాన్ చేస్తారు. వృత్తి, వ్యాపారాల్లో నూతనోత్సాహంగా ముందుకు సాగుతారు. ఉద్యోగంలో అధికారుల ఆదరణ లభిస్తుంది. పిల్లల చదువుల మీద శ్రద్ధ పెంచాల్సి ఉంటుంది. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది.