Horoscope Today: వారి పెళ్లి ప్రయత్నాలు సఫలం అవుతాయి.. 12 రాశుల వారికి సోమవారంనాటి రాశిఫలాలు
దిన ఫలాలు (సెప్టెంబర్ 23, 2024): మేష రాశి వారికి ఈ రోజు ఆదాయ పరిస్థితి బాగా అనుకూలంగా ఉంటుంది. వృషభ రాశికి చెందిన నిరుద్యోగులు శుభవార్తలు వినే అవకాశం ఉంది. మిథున రాశి వారికి ఉద్యోగంలో సానుకూల మార్పులు చోటు చేసుకుంటాయి. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి సోమవారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..
దిన ఫలాలు (సెప్టెంబర్ 23, 2024): మేష రాశి వారికి ఈ రోజు ఆదాయ పరిస్థితి బాగా అనుకూలంగా ఉంటుంది. వృషభ రాశికి చెందిన నిరుద్యోగులు శుభవార్తలు వినే అవకాశం ఉంది. మిథున రాశి వారికి ఉద్యోగంలో సానుకూల మార్పులు చోటు చేసుకుంటాయి. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి సోమవారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..
మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)
ఉద్యోగంలో అధికారులు అత్యధిక ప్రాధాన్యం ఇచ్చి ఆదరిస్తారు. వృత్తి జీవితం బాగా బిజీ అయిపోతుంది. వ్యాపారాలు లాభదాయకంగా సాగిపోతాయి. ఆదాయ పరిస్థితి బాగా అనుకూలంగా ఉంటుంది. ముఖ్యమైన వ్యవహారాల్లో తేలికగా పూర్తవుతాయి. ఆరోగ్య సమస్యలు పరిష్కారం అవుతాయి. ఏ ప్రయత్నం చేపట్టినా విజయం సిద్ధిస్తుంది. అనేక వైపుల నుంచి ఆదాయం పెరు గుతుంది. ఆధ్యాత్మిక చింతన బాగా పెరుగుతుంది. ఎవరినీ గుడ్డిగా నమ్మకపోవడం మంచిది.
వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)
వృత్తి, ఉద్యోగాలలో సమస్యలున్నా బాధ్యతలు పూర్తి చేస్తారు. వృత్తి జీవితంలో అనుకూల వాతావరణం ఉంటుంది. వ్యాపారాల్లో తక్కువ శ్రమతో ఎక్కువ ఫలితం పొందుతారు. నిరుద్యోగులు శుభవార్తలు వినే అవకాశం ఉంది. పెళ్లి ప్రయత్నాలు సఫలం అవుతాయి. సమాజంలో గౌరవ మర్యా దలు పెరుగుతాయి. ముఖ్యమైన పనులు, వ్యవహారాల్లో కార్యసిద్ధి కలుగుతుంది. జీవిత భాగస్వా మితో కలిసి వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. ఆదాయానికి, ఆరోగ్యానికి ఇబ్బందేమీ ఉండదు.
మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)
ఉద్యోగంలో సానుకూల మార్పులు చోటు చేసుకుంటాయి. వృత్తి జీవితంలో మంచి గుర్తింపు లభిస్తుంది. వ్యాపారాల్లో అంచనాలకు మించి లాభాలు ఆర్జిస్తారు. ఆస్తి వివాదం పరిష్కార దిశగా సాగుతుంది. కోర్టు కేసు పరిష్కారమవుతుంది. బంధువుల నుంచి శుభవార్తలు వింటారు. ఆశించిన పెళ్లి సంబంధం నిశ్చయమవుతుంది. శుభ కార్యాల్లో పాల్గొంటారు. ఆరోగ్యం మెరుగు పడుతుంది. కుటుంబ జీవితం హ్యాపీగా సాగిపోతుంది. నష్టదాయక వ్యవహారాలకు దూరంగా ఉండండి.
కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)
ఉద్యోగంలో పని భారం కాస్తంత ఎక్కువగా ఉంటుంది. అనేక బాధ్యతలను ఒకేసారి నిర్వర్తించాల్సి వస్తుంది. వృత్తి, వ్యాపారాలు ఇదివరకటి కంటే మెరుగ్గా ఉంటాయి. ఆర్థిక లావాదేవీలు విజయ వంతం అవుతాయి. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. కుటుంబసమేతంగా ఆలయ సంద ర్శనాలు చేసుకుంటారు. ఆదాయానికి, ఆరోగ్యానికి ఇబ్బందేమీ ఉండదు. నిరుద్యోగులకు ఆశిం చిన శుభ వార్తలు అందుతాయి. కుటుంబంలో సుఖ సంతోషాలు నెలకొంటాయి. పిల్లలు వృద్ధిలోకి వస్తారు.
సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)
వృత్తి, ఉద్యోగాల్లో పని భారం అధికంగా ఉంటుంది. అధికారులకు మీ పనితీరు సంతృప్తి కలిగి స్తుంది. వ్యాపారాల్లో లాభాలు కొద్దిగా వృద్ధి చెందుతాయి. నిరుద్యోగులకు మంచి కంపెనీల నుంచి ఆఫర్లు అందుతాయి. వ్యక్తిగత సమస్యలు చాలావరకు పరిష్కారం అవుతాయి. చిన్ననాటి మిత్రు లతో సరదాగా కాలక్షేపం చేస్తారు. కుటుంబ వ్యవహారాలు ఉత్సాహంగా సాగిపోతాయి. పిల్లలు మంచి ఫలితాలు సాధిస్తారు. ఆరోగ్యానికి ఇబ్బందేమీ ఉండదు. ప్రయాణాలు బాగా లాభిస్తాయి.
కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)
వృత్తి, ఉద్యోగాల్లో హోదా గానీ, అధికారాలు గానీ పెరిగే అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాల్లో కొద్దిగా కూడా తీరిక ఉండని పరిస్థితి ఏర్పడుతుంది. నిరుద్యోగులకు దూర ప్రాంతంలో ఉద్యోగం లభించే అవకాశం ఉంది. కుటుంబ వ్యవహారాలను చక్కబెడతారు. పిల్లలు చదువుల్లో దూసుకుపోతారు. ఆశించిన పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది. చిన్ననాటి స్నేహితులతో విందు కార్యక్రమంలో పాల్గొంటారు. దైవ కార్యాల్లోనూ, ఆధ్యాత్మిక కార్యక్రమాల్లోనూ పాల్గొంటారు. ఆరోగ్యం పరవాలేదు.
తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)
అనుకున్న పనులు అనుకున్నట్టు సాగిపోతాయి. సాధారణంగా వృత్తి, ఉద్యోగాల్లో మీ మాటకు విలువ ఉంటుంది. మీ పనితీరుతో పాటు మీ ఆలోచనలు కూడా అధికారులకు సంతృప్తిని కలిగి స్తాయి. వ్యాపారాలు అంచనాలకు మించిన ఎక్కువ లాభాలనిస్తాయి. ఆరోగ్యం సజావుగా సాగి పోతుంది. బంధువుల వ్యక్తిగత వ్యవహారాలకు దూరంగా ఉండడం మంచిది. ఆస్తి వివాదంలో రాజీ మార్గం అనుసరిస్తారు. నిరుద్యోగులకు మంచి ఆఫర్లు వస్తాయి. పెళ్లి ప్రయత్నాలు ఫలిస్తాయి.
వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట)
వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలు నిలకడగా సాగిపోతాయి. ప్రతిభా పాటవాల వల్ల ఆర్థిక ప్రయోజనాలు కలుగుతాయి. సొంత పనులు, వ్యవహారాల మీద శ్రద్ధ పెట్టడం మంచిది. ఆర్థిక వ్యవహారాలు ఆశించిన విధంగా సాగిపోతాయి. కుటుంబ ఖర్చులు పెరుగుతాయి. అదనపు ఆదాయ మార్గాలు నిలకడగా సాగిపోతాయి. ఉచిత సహాయాల విషయంలో ఒకటికి రెండు సార్లు ఆలోచించడం అవసరం. పిల్లలు ఆశించిన విధంగా పురోగతి సాధిస్తారు. ప్రయాణాల్లో కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి.
ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)
ఉద్యోగాలు బాగా ప్రోత్సాహకరంగా కొనసాగుతాయి. అధికారులు మీ సేవలను గరిష్ఠ స్థాయిలో ఉపయోగించుకుంటారు. వ్యాపారాలు అంచనాలకు మించి లాభాలనిస్తాయి. వృత్తి జీవితం నల్లేరు మీద బండిలా సాగిపోతుంది. సర్వత్రా మీ మాటకు విలువ పెరుగుతుంది. పెళ్లి ప్రయత్నాల్లో ఆశించిన శుభవార్తలు అందుతాయి. రాదనుకున్న డబ్బు కొద్ది ప్రయత్నంతో చేతికి అందు తుంది. అనుకున్న పనులను అనుకున్న విధంగా పూర్తి చేస్తారు. ఆర్థిక వ్యవహారాలు కలిసి వస్తాయి.
మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2)
వృత్తి, ఉద్యోగాల్లో ఆశించిన శుభవార్తలు వింటారు. వ్యాపారాలు లాభాల బాటలో కొనసాగుతాయి. మంచి పరిచయాలు ఏర్పడతాయి. కొందరు మిత్రులకు ఆర్థికంగా తోడ్పడతారు. ఆర్థిక వ్యవహా రాలు సజావుగా సాగిపోతాయి. అదనపు ఆదాయ మార్గాలు ఆశించిన ఫలితాలనిస్తాయి. దీర్ఘ కాలిక వ్యక్తిగత సమస్యల నుంచి కొద్దిపాటి ఊరట లభిస్తుంది. ఇంటా బయటా ఒత్తిడి ఎక్కువగానే ఉంటుంది. ముఖ్యమైన పనులను, వ్యవహారాలను సకాలంలో పూర్తి చేస్తారు. ఆరోగ్యానికి లోటుండదు.
కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)
వృత్తి, ఉద్యోగాల్లో ఒకటి రెండు సమస్యలకు అవకాశం ఉంది. పొరపాట్లు జరిగే సూచనలున్నాయి. సహోద్యోగులతో ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. ఇంటా బయటా కొద్దిగా ఒత్తిడి ఉంటుంది. ఆధ్యాత్మిక చింతన పెరిగి, దైవ కార్యాల్లో పాల్గొంటారు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండడం మంచిది. చేపట్టిన పనులన్నిటినీ పట్టుదలగా పూర్తి చేస్తారు. వ్యాపారాలు నిలకడగా, సాదా సీదాగా సాగిపోతాయి. ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. పిల్లల నుంచి శుభవార్తలు వింటారు.
మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)
వృత్తి, ఉద్యోగాల్లో కొత్త బాధ్యతలు చేపట్టాల్సి వస్తుంది. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఏ ప్రయత్నం తలపెట్టినా విజయవంతం అవుతుంది. ఆదాయాన్ని పెంచుకోవడానికి ఇది అనుకూల సమయం. స్థిరాస్తి వివాదం ఒకటి తేలికగా పరిష్కారం అవుతుంది. జీవిత భాగస్వామి సహాయ సహకారాలు లభిస్తాయి. పెళ్లి, ఉద్యోగ ప్రయత్నాలు విజయవంతం అవుతాయి. ఆకస్మిక ధన లాభ సూచనలున్నాయి. ప్రయాణాలు చాలావరకు లాభిస్తాయి. ఆరోగ్యానికి ఇబ్బంది ఉండదు.